MP BJP Candidate List 2023: రెండు జాబితాల్లో లేని శివరాజ్‌సింగ్ పేరు.. ముఖ్యమంత్రిని మారుస్తారని జోరుగా ప్రచారం
Madhya Pradesh Election 2023: బీజేపీ ప్రకటించిన రెండు జాబితాల్లో మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్‌సింగ్ చౌహాన్ పేరు లేకపోవడం సంచలనం రేపుతోంది. మధ్యప్రదేశ్ సీఎంగా ఈసారి కొత్త నేతను ఎంపిక చేస్తారని , అందుకే ఏడుగురు ఎంపీలను బీజేపీ హైకమాండ్ అసెంబ్లీ ఎన్నికల బరి లోకి దింపినట్టు ఊహాగానాలు విన్పిస్తున్నాయి.

మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్‌సింగ్ చౌహాన్‌కు మరోసారి ఛాన్స్ ఉండదా ? ఆయన స్థానంలో బీజేపీ హైకమాండ్ కొత్త నేతను రెడీ చేస్తోందా? అన్న విషయం హాట్‌టాపిక్‌గా మారింది. ఇప్పటివరకు బీజేపీ ప్రకటించిన అభ్యర్ధుల రెండు జాబితాల్లో కూడా శివరాజ్‌సింగ్ పేరు లేదు. దీంతో ఆయన అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తారా ? లేదా అన్న విషయంపై కూడా ఉత్కంఠ నెలకొంది.
మధ్యప్రదేశ్ ఎన్నికల్లో బీజేపీ కొత్త వ్యూహంతో ముందుకెళ్తోంది. సీఎం అభ్యర్ధిని ప్రకటించకుండా ప్రచారం చేస్తున్నారు. అంతేకాకుండా ఏకంగా ఏడుగురు ఎంపీలను అసెంబ్లీ ఎన్నికల బరి లోకి దింపడం సంచలనం రేపుతోంది. కేంద్ర మంత్రులు నరేంద్ర సింగ్ తోమర్, ప్రహ్లాద్‌సింగ్ పటేల్ , ఫగన్ సింగ్ కులస్తే సైతం అసెంబ్లీ ఎన్నికల బరిలో దిగుతున్నారు.
బీజేపీ ఎన్నికల బరి లోకి దించడంపై..
అయితే ఎంపీలను, కేంద్రమంత్రులను బీజేపీ ఎన్నికల బరి లోకి దించడంపై కాంగ్రెస్ సెటైర్లు వేస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో విజయంపై ఆశలు సన్నగిల్లడం , శివరాజ్‌సింగ్ నాయకత్వంపై నమ్మకం లేకపోవడం తోనే ఈ ఎత్తుగడలు వేస్త్తున్నారని మధ్యప్రదేశ్ పీసీసీ చీఫ్ కమల్‌నాథ్ విమర్శించారు. రాష్ట్రంలో మునుగుతున్న నావను కాపాడుకునేందుకు చివరిప్రయత్నాలు చేస్తున్నారని అన్నారు.
అయితే కాంగ్రెస్ వ్యాఖ్యలకు గట్టి కౌంటరిచ్చారు శివరాజ్‌సింగ్ . హేమాహేమీలాంటి నేతలు బరి లోకి దిగడం తమ పార్టీ బలానికి సంకేతమన్నారు. ఓటమి భయం తోనే కాంగ్రెస్ నేతలు తమపై విమర్శలు చేస్తున్నారని అన్నారు. అయితే అధికారుల సమావేశంలో శివరాజ్‌సింగ్ చేసిన వ్యాఖ్యలు వేరే సంకేతాలను ఇస్తున్నాయి. పరిపాలనలో సహకరించిన అధికారులకు ఆయన ధన్యవాదాలు తెలపడం.. మరోసారి ఆయన సీఎం పగ్గాలు చేపడుతారా ? లేదా ? అన్న విషయంపై సస్పెన్స్ కొనసాగేలా చేస్తోంది.
శివరాజ్ చౌహాన్ ఏమవుతుంది?
మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి విడుదల చేసిన రెండు బీజేపీ అభ్యర్థుల జాబితాల్లో ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ పేరు కనిపించలేదు. బీజేపీ తన సీఎం ముఖాన్ని కూడా ప్రకటించలేదు. అందుకే, ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్‌కు ఏమవుతుందనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి మరియు ఎన్నికల తర్వాత సీఎం ముఖాన్ని ప్రకటించే మూడ్‌లో బీజేపీ ఉందా? ఎన్నికల తర్వాత ఈ ప్రశ్నలకు సమాధానం దొరికే అవకాశం ఉంది.
ఎంత మంది సింధియా మద్దతుదారుల టిక్కెట్లు రద్దు చేయబడ్డాయి?
బీజేపీ రెండో జాబితాలో జ్యోతిరాదిత్య సింధియా మద్దతుదారులు జాగ్రత్త పడ్డారు. ఆయనతో పాటు కాంగ్రెస్ నుంచి బీజేపీలో చేరిన ఐదుగురు నేతలు – రఘురాజ్ కంసన, ఇమర్తి దేవి, హీరేంద్ర సింగ్ బంటీ, శ్రీకాంత్ చతుర్వేది, మోహన్ రాథోడ్‌లకు టిక్కెట్లు ఇచ్చారు. 2020 ఎన్నికలలో ఓడిపోయిన రఘురాజ్ కంసనా మరియు ఇమర్తి దేవిలను పార్టీ మళ్లీ నామినేట్ చేయడం ద్వారా బీజేపీలో సింధియా ఆధిపత్యాన్ని అంచనా వేయవచ్చు.
బీజేపీ రెండో జాబితాపై కాంగ్రెస్ ఫైర్..
కొందరు ప్రముఖుల పేర్లతో కూడిన బీజేపీ రెండో జాబితాను విడుదల చేయడంపై కాంగ్రెస్ నేతలు మండిపడుతున్నారు. మాజీ ముఖ్యమంత్రి, ఎంపీ కాంగ్రెస్ అధ్యక్షుడు కమల్ నాథ్ సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేశారు మధ్యప్రదేశ్‌లో తన ఎంపీలకు అసెంబ్లీ టిక్కెట్లు ఇవ్వడం ద్వారా, 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కానీ 2024 లోక్‌సభ ఎన్నికల్లో కానీ బీజేపీ గెలవదని బీజేపీ నిరూపించింది. ఎన్నికలలో గెలవలేనంతగా పరువు పోయిందని.. పెద్ద పెద్దలనే ఎందుకు బెట్టింగ్ కాకూడదని పార్టీగా అంగీకరించిందని దీని అర్థం.
మరిన్ని జాతీయ వార్తల కోసం