ఎల్‌టీటీఈ చీప్ ప్రభాకరన్ బతికే ఉన్నాడని తమిళ దేశీయవాదం అధ్యక్షుడు నెడుమారన్ సంచలన వ్యాఖ్యలు చేశారు . త్వరలో ప్రభాకరన్ ప్రజల ముందుకు వస్తారని తెలిపారు. కుటుంబసభ్యులతో ఆయన టచ్‌లో ఉన్నట్టు కూడా తెలిపారు. ప్రభాకరన్ చనిపోయినట్టు వచ్చిన వార్తలు అవాస్తమన్నారు నెడుమారన్. తాను బతికే ఉన్నట్టు ప్రజలకు చెప్పమన్నారని , అందుకే మీడియా ముందుకు వచ్చినట్టు నెడుమారన్ చెప్పారు. 2009లో ముల్లైతీవు ప్రాంతంలో శ్రీలంక సైన్యంతో జరిగిన పోరులో ప్రభాకరన్ చనిపోయినట్టు ప్రకటించారు. 18 మే 2009 న ప్రభాకరన్ కుమారుడు చార్లెస్ ఆంథోనీ కూడా పోరులో చనిపోయారు. ప్రభాకరన్ చనిపోయారని , ఆయన మృతదేహం ఫోటోలను కూడా శ్రీలంక సైన్యం విడుదల చేసింది. కాని 14 ఏళ్ల తరువాత ఆకస్మాత్తుగా ఆయన బతికే ఉన్నారని నెడుమారన్ నుంచి స్టేట్‌మెంట్ రావడం సంచలనం రేపింది.
అయితే, ప్రస్తుతం శ్రీలంకను భారత్ వ్యతిరేక స్థావరంగా మార్చేందుకు చైనా ప్రయత్నిస్తోంది. దీనికి తోడు హిందూ మహాసముద్రం ఆధిపత్యం చైనా పట్టులో పడే ప్రమాదం ఉందని, దానిని అరికట్టాలని భారత ప్రభుత్వాన్ని కోరుతున్నాం. ఈ ముఖ్యమైన కాలంలో తమిళనాడు ప్రభుత్వం, తమిళనాడులోని అన్ని పార్టీలు, తమిళనాడు ప్రజలు ఐక్యంగా నిలబడి తమిళ ఈలం జాతీయ అధ్యక్షుడు ప్రభాకరన్‌కు మద్దతు ఇవ్వాలని మేము ప్రార్థిస్తున్నాము.
మరిన్ని జాతీయవార్తల కోసం