Lorry driver: జాతీయ రహదారిపై ఏనుగుకు చెరకు వేసిన లారీ డ్రైవర్ కు రూ. 75 వేల. జరిమానా..! ఎక్కడంటే..

|

Dec 06, 2022 | 11:11 AM

రోడ్డుపక్కన నిలబడి లారీని అడ్డుకున్న ఏనుగుకు చెరుకు వేశాడు డ్రైవర్‌. పెట్రోలింగ్‌ చేస్తుండగా ఇది చూసిన అటవీశాఖ సిబ్బంది ఘటనపై ఆరా తీసి జరిమానా విధించారు.

Lorry driver: జాతీయ రహదారిపై ఏనుగుకు చెరకు వేసిన లారీ డ్రైవర్ కు రూ. 75 వేల. జరిమానా..! ఎక్కడంటే..
Elephant
Follow us on

జాతీయ రహదారిపై లారీకి అడ్డంగా ఏనుగు నిలబడి ఉండంటంలో ఆ డ్రైవర్‌ కంగుతిన్నాడు. ఏం చేయాలో అర్థంకాని పరిస్థితిలో అతడు ఏనుగును తరిమేందుకు ఓ ప్లాన్‌ వేశాడు. తన లారీలో ఉన్న చెరుకు కర్రను ఎదురుగా వచ్చిన గజరాజుకు ఇచ్చాడు లారీ డ్రైవర్. అదే అతడికి శాపంగా మారింది. ఏనుగుకు చెరుకు వేసిన పనికి శిక్షగా స్థానిక పోలీసులు ఆ లారీ డ్రైవర్‌కు 75 వేల రూపాయల జరిమానా విధించారు. ఈ సంఘటన కర్ణాటక రాష్ట్రంలో వెలుగు చూసింది.  తమిళనాడు సరిహద్దులోని చామరాజనగర్‌లో ని ఆసనూరు సమీపంలో రోడ్డుపక్కన నిలబడి లారీని అడ్డుకున్న ఏనుగుకు చెరుకు వేశాడు డ్రైవర్‌. మైసూరు జిల్లా నంజనగూడుకి చెందిన సిద్ధరాజు అనే లారీ డ్రైవర్‌కు పోలీసులు జరిమానా విధించారు. పూర్తి వివరాల్లోకి వెళితే..

తమిళనాడు సరిహద్దులోని చామరాజనగర్‌ ఆసనూర్‌ సమీపంలో రోడ్డుపక్కన నిలబడి ఉన్న ఏనుగుపై డ్రైవర్‌ సిద్దరాజు చెరకును విసిరాడు. పెట్రోలింగ్‌ చేస్తుండగా ఇది చూసిన అటవీశాఖ సిబ్బంది ఘటనపై ఆరా తీసి జరిమానా విధించారు. జరిమానా చెల్లించే వరకు లారీని వదలకపోవడంతో డ్రైవర్ సిద్దరాజు జరిమానా చెల్లించుకున్నట్టు సమాచారం.

బెంగుళూరు దిండిగల్ జాతీయ రహదారిలోని అసనూర్ భాగంలో చెరకు రుచి చూసేందుకు ఏనుగులు తరచుగా ట్రక్కులను అడ్డగించడం, చెరకు దొంగిలించడం సర్వసాధారణం. కానీ, లారీ డ్రైవర్‌కు ఈ జరిమానా విధించటం పట్ల కొందరు తీవ్ర ఆగ్రహాం వ్యక్తం చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి