Lok Sabha Election Final Results 2024 Highlights: అటు ఎన్డీఏ.. ఇటు ఇండియా కూటమి.. పోటాపోటీ సమావేశాలు..

| Edited By: TV9 Telugu

Jun 12, 2024 | 3:13 PM

Telangana Lok Sabha Election Results 2024 Full Winners list in Telugu: బీజేపీకి ప్రజలు అద్భుతమైన విజయాన్ని అందించారన్నారు ప్రధాని మోదీ. తెలంగాణలో తమ సీట్ల సంఖ్య రెట్టింపయ్యిందన్నారు. మోదీ. గుజరాత్,చత్తీస్‌గఢ్‌,మధ్యప్రదేశ్‌,ఢిల్లీలో క్లీన్‌స్వీప్‌ చేశామన్నారు. ఏపీ,ఒడిశా ప్రజలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు మోదీ. ఏపీలో చంద్రబాబు అద్భుత ఫలితాలు సాధించారని అభినందించిన మోదీ.. ఏపీ అభివృద్దికి పూర్తి సహకారం అందిస్తామన్నారు.

Lok Sabha Election Final Results 2024 Highlights: అటు ఎన్డీఏ.. ఇటు ఇండియా కూటమి.. పోటాపోటీ సమావేశాలు..
NDA Meeting

Telangana Lok Sabha Election Results 2024 Full Winners list in Telugu: సార్వత్రిక ఎన్నికల్లో ఎన్​డీఏ కూటమి మరోసారి విజయం సాధించింది. నరేంద్ర మోదీ మూడోసారి ప్రధాని ఖావడం ఖాయమైంది. తద్వారా ఆయన తొలి ప్రధాని నెహ్రూ రికార్డు సమం చేయనున్నారు. అయితే ఎన్​డీఏకు 400స్థానాలకుపైగా వస్తాయని సాధిస్తుందని బీజేపీ వేసుకున్న అంచనాలు తప్పాయి. మిత్రపక్షాల సాయంతోనే బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సిన ఆవశ్యకత ఏర్పడింది. ఈ నేపథ్యంలో ఎన్​డీఏ ప్రభుత్వంలో మిత్రపక్షాలు కీలకం కానున్నాయి. ఎగ్జిట్‌ పోల్స్ అంచనాలకు మించి ఇండి కూటమి సత్తా చాటింది. ప్రధానంగా యూపీ, మహారాష్ట్ర, బంగాల్‌లో బీజేపీకి గట్టిపోటీ ఇచ్చింది.

లోక్ సభ ఎన్నికల ఫలితాలు ఇలా..

  • ఎన్డీఏ కూటమి – 292  (బీజేపీ -240)
  • ఇండియా కూటమి -232 (కాంగ్రెస్ -99)
  • ఇతరులు -17

ఏపీ ఎన్నికల ఫలితాల్లో కూటమి ప్రభంజనం

  • ఎన్డీఏ కూటమి -164 (టీడీపీ-135, జనసేన 21, బీజేపీ 8)
  • వైసీపీ -11

ఎన్నికల ఫలితాలు లైవ్ వీడియో చూడండి..

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 05 Jun 2024 01:01 PM (IST)

    8న ప్రధాని మోదీ ప్రమాణం..

    ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జూన్ 8న ప్రమాణ స్వీకారం చేయనున్నారు. వరుసగా మూడోసారి నరేంద్రమోదీ.. ప్రమాణం చేయనున్నారు.

  • 05 Jun 2024 11:35 AM (IST)

    ఎన్డీఏ కూటమితోనే ఉంటాం..

    ఇండియా కూటమిలోకి వెళ్తున్నారా..? అని మిడియా అడిగిన ప్రశ్నపై చంద్రబాబు స్పందించారు.. తనకు రాజకీయ అనుభవం చాలా ఉందని .. ఎన్నో ఒడిదుడుకులను చూశామంటూ చంద్రబాబు వ్యాఖ్యానించారు. ప్రస్తుతానికి ఎన్డీఏతో ఉన్నామని.. ఎన్డీఏతోనే తమ ప్రయాణమన్నారు. ఈరోజు ఎన్డీఏ సమావేశానికి హాజరవుతున్నామని.. ఢిల్లీ వెళ్లి వచ్చిన తర్వాత అన్ని వివరిస్తానని చంద్రబాబు తెలిపారు.

  • 05 Jun 2024 10:19 AM (IST)

    రాహుల్‌గాంధీ ప్రాతినిథ్యం వహించే సీటుపై సస్పెన్స్‌

    • రాహుల్‌గాంధీ ప్రాతినిథ్యం వహించే సీటుపై సస్పెన్స్‌
    • ఈ ఎన్నికల్లో రెండు చోట్ల గెలిచిన రాహుల్‌గాంధీ
    • కేరళలోని వయనాడ్‌, యూపీలోని రాయ్‌బరేలీలో విజయం
    • ఏ సీటును వదలుకుంటారో అన్న అంశంపై కాంగ్రెస్‌లో చర్చలు
    • తనకు ఛాయిస్‌ ఉంటే రెండుసీట్ల నుంచి..ప్రాతినిథ్యం వహిస్తానంటూ సరదాగా రాహుల్‌ వ్యాఖ్యలు
  • 05 Jun 2024 08:49 AM (IST)

    ప్రధాని మోదీతో సమావేశం కానున్న చంద్రబాబు, పవన్

    ఏపీలో కూటమి ఘన విజయం సాధించిన తర్వాత అమరావతి కీలక పరిణామలు చోటుచేసుకుంటున్నాయి. ఒకవైపు ప్రమాణ స్వీకార ఏర్పాట్లు, మరోవైపు ప్రభుత్వ కూర్పుపై సమాలోచనలు జరుగుతున్నాయి. ఇదే పరిస్థితుల్లో ప్రధాని మోదీని కలుసుకోవడానికి బాబు, పవన్‌ ఢిల్లీకి వెళుతున్నారు.

  • 05 Jun 2024 07:48 AM (IST)

    ఇవాళ ఇండియా కూటమి కీలక సమావేశం

    — ఇవాళ ఇండియా కూటమి కీలక సమావేశం

    — ఢిల్లీకి శరద్‌పవార్‌, స్టాలిన్‌, ఉద్ధవ్‌ ఠాక్రే

    — ఈ భేటీకి మమతా బెనర్జీ అల్లుడు అభిషేక్‌, అఖిలేష్‌ హాజరు

    — ఎన్డీయేలోని పార్టీలతో చర్చలంటూ ఇప్పటికే ఊహాగానాలు

    — ఆయా పార్టీలతో మాట్లాడిన తర్వాతే..

    — ఈ అంశంపై స్పందిస్తామని చెప్పిన రాహుల్‌గాంధీ

  • 05 Jun 2024 06:51 AM (IST)

    ఇవాళ మోదీ అధ్యక్షతన ఢిల్లీలో ఎన్డీఏ పక్షాల సమావేశం

    — కేంద్రంలో ఎన్డీయే హ్యాట్రిక్ విజయం
    — 292 స్థానాల్లో ఎన్డీయే పక్షాల గెలుపు
    — 240 సీట్లలో గెలుపొందిన బీజేపీ అభ్యర్థులు
    — 234 స్థానాల్లో ఇండియా కూటమి విజయం
    — మరో 17 స్థానాల్లో గెలుపొందిన ఇతరులు
    — కేంద్రంలో మూడోసారి అధికారం చేపట్టనున్న బీజేపీ
    — మూడోసారి ప్రధానిగా పగ్గాలు చేపట్టబోతున్న మోదీ
    — ప్రధానిగా నెహ్రూ రికార్డును సమం చేయబోతున్న మోదీ
    — ఇవాళ మోదీ అధ్యక్షతన ఢిల్లీలో ఎన్డీఏ పక్షాల సమావేశం

  • 04 Jun 2024 09:39 PM (IST)

    ఇది భారతీయులందరి విజయం – మోడీ

    ఇది భారతీయుల విజయమని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. ఎన్నికల్లో అఖండ విజయం సాధించిన సందర్భంగా మోడీ దేశ ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. బీజేపీకి ప్రజలు అద్భుతమైన విజయాన్ని అందించారన్నారు. మూడోసారి ఎన్డీయే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తోంది. భారత ప్రజాస్వామ్యం ప్రపంచానికి ఆదర్శమన్నారు.

  • 04 Jun 2024 09:22 PM (IST)

    ఆంధ్రప్రదేశ్‌లోనూ ఎన్డీయే ప్రభుత్వం- మోడీ

    దీంతో పాటు ఆంధ్రప్రదేశ్‌లో ఎన్డీయే కూటమి విజయంపై ప్రధాని మోదీ స్పందించారు. ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీతో బీజేపీ పొత్తు పెట్టుకుంది. ఎన్డీయేకు ఆంధ్రప్రదేశ్ అసాధారణ ఆదేశాన్ని ఇచ్చిందని ప్రధాని మోదీ అన్నారు. రాష్ట్ర ప్రజల ఆశీస్సులకు ధన్యవాదాలు. ఈ ఘనవిజయం సాధించినందుకు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, ఆంధ్రప్రదేశ్ బీజేపీ నాయకత్వానికి అభినందలు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ సర్వతోముఖాభివృద్ధికి పాటుపడతామని, రాబోయే కాలంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అన్ని విధాలుగా అభివృద్ధి చెందేలా కృషి చేస్తామన్నారు.

     

  • 04 Jun 2024 09:17 PM (IST)

    నేను ప్రజలకు కృతజ్ఞుడను – మోడీ

    నేను ప్రజలకు కృతజ్ఞుడను. దేశప్రజలు పూర్తి విశ్వాసాన్ని ప్రదర్శించారు. నేటి విజయం ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యం సాధించిన విజయం. ఇది భారత రాజ్యాంగంపై అభివృద్ధి చెందిన భారతదేశం కోసం సాధించిన విజయం. 140 కోట్ల మంది భారతీయులు గెలిచారు. ఈ రోజు నేను దేశ ఎన్నికల సంఘానికి నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. 100 కోట్ల మంది ఓటర్లు, 11 లక్షల పోలింగ్ కేంద్రాలు, 55 లక్షల ఓటింగ్ మిషన్లు, ఉద్యోగులంతా తీవ్ర వేడిలో విధులు నిర్వర్తించారు. భద్రతా సిబ్బంది కూడా విధుల్లో తీవ్రంగా శ్రమించారు. భారతీయ ఎన్నికల విశ్వసనీయత గురించి భారతీయులు గర్విస్తున్నారు.

  • 04 Jun 2024 09:15 PM (IST)

    కొత్త ఉత్సాహంతో ముందుకు సాగుతాం- మోడీ

    దేశప్రజల ఆకాంక్షలను నెరవేర్చేందుకు కొత్త శక్తి, కొత్త ఉత్సాహం, కొత్త సంకల్పంతో ముందుకు సాగుతామని నేను ప్రజలకు హామీ ఇస్తున్నానని ప్రధాని మోదీ అన్నారు. నేను నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.. వారి అంకితభావం, అవిశ్రాంతంగా పని చేస్తున్న కార్మికులందరికీ అభినందనలు తెలియజేస్తున్నాను అని అన్నారు.

     

  • 04 Jun 2024 09:03 PM (IST)

    తెలంగాణలో మా సీట్ల సంఖ్య రెట్టింపయ్యాయి – మోడీ

    తెలంగాణలో మా సీట్ల సంఖ్య రెట్టింపయ్యాయని ప్రధాని మోడీ అన్నారు. ఛత్తీస్‌గఢ్‌, మధ్యప్రదేశ్‌, ఢిల్లీలో క్లీన్‌స్వీప్‌ చేశాం అని అన్నారు. ఏపీ, ఒడిశా ప్రజలకు నా ప్రత్యేక ధన్యవాదాలు. ఏపీ అభివృద్ధికి పూర్తి సహకారం అందిస్తామన్నారు. ఏపీలో చంద్రబాబు అద్భుతమైన ఫలితాలు సాధించారన్నారు.

  • 04 Jun 2024 08:59 PM (IST)

    ఓటర్లు కొత్త చరిత్ర సృష్టించారు – మోడీ

    జమ్ముకశ్మీర్‌ ఓటర్లు కొత్త చరిత్ర సృష్టించారని ప్రధాని మోడీ అన్నారు. కశ్మీర్‌లో రికార్డు స్థాయిలో ఓటింగ్‌ జరిగిందన్నారు. ఒడిశాలో తొలిసారి బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తోందన్నారు. జగన్నాథుడి ఆశీస్సులతో బీజేపీ గెలిపిందన్నారు. అలాగే కేరళలో తొలిసారి బీజేపీ ఎంపీ సీటును గెలిచిందన్నారు.

  • 04 Jun 2024 08:50 PM (IST)

    భారత ప్రజాస్వామ్యం ప్రపంచానికి ఆదర్శం: మోడీ

    ఎన్నికల సంఘాన్ని అభినందిస్తున్నానని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. సార్వత్రికల ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత దేశ ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. ఎన్నికల ఘట్టాన్ని విజయవంతంగా పూర్తి చేశారని అన్నారు. బీజేపీకి దేశ ప్రజలు అద్భుతమైన విజయాన్ని అందించారన్నారు. మూడో సారి ఎన్డీయే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందన్నారు. భారత ప్రజాస్వామ్యం ప్రపంచానికి ఆదర్శమన్నారు.

  • 04 Jun 2024 08:45 PM (IST)

    ఎన్డీయేపై ప్రజలు విశ్వాసం చూపించారు- ప్రధాని మోడీ

    ఎన్డీయేపై దేశ ప్రజలు విశ్వాసం చూపించారని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. బీజేపీ కార్యాలయానికి చేరుకున్న మోడీ పార్టీ ఆగ్రనేతలతో భేటీ అయిన అనంతరం ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. ఓటర్లకు తాను రుణపడి ఉంటానని అన్నారు. అలాగే ఎన్నికల సంఘానికి కూడా అభినందనలు తెలిపారు.

  • 04 Jun 2024 08:38 PM (IST)

    మోడీ నేతృత్వంలో మూడోసారి అధికారంలోకి- నడ్డా

    మోడీ నేతృత్వంలో మూడోసారి అధికారంలోకి రాబోతున్నామని జేపీ నడ్డా అన్నారు. ఒడిశాలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు కాబోతోందని అన్నారు. స్వార్థపూరిత కూటముల ప్రయత్నాలు ఫలించలేదని అన్నారు. ఎన్డీయే విజయం తర్వాత బీజేపీ కార్యాలయంలో పార్టీ అగ్రనేతలతో ప్రధాని మోడీ భేటీ అయ్యారు.

  • 04 Jun 2024 08:30 PM (IST)

    ప్రజాతీర్పుకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నా: ప్రధాని మోడీ

    లోక్‌సభ ఎన్నికల్లో విజయాన్ని కట్టబెట్టినందుకు ప్రధాని నరేంద్ర మోడీ కీలక ట్వీట్‌ చేశారు. ప్రజాతీర్పుకు శిరస్సు వంచి నమస్కరిస్తు్న్నా.. పదేళ్లలో చేసిన అభివృద్ధిని కొసాగిస్తాని అన్నారు. మూడోసారి ఎన్‌డీఏ కూటమికి దేశ ప్రజలు పట్టం కట్టారని అన్నారు.

     

  • 04 Jun 2024 08:18 PM (IST)

    బీజేపీ పార్టీ కార్యాలయానికి చేరుకున్న ప్రధాని మోడీ

    ప్రధాని నరేంద్ర మోడీ బీజేపీ కార్యాలయానికి చేరుకున్నారు. మోడీ రాక కోసం అమిత్ షా, రాజ్‌నాథ్‌సింగ్‌లు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మోడీ కార్యకర్తలకు అభివాదం చేస్తూ వచ్చారు. ఈ అక్కడ ప్రసంగించనున్నారు.

    Modi

  • 04 Jun 2024 08:12 PM (IST)

    రాయ్‌బరేలీ ప్రజల రుణం తీర్చుకోలేనిది: ప్రియాంక గాంధీ

    లోక్‌సభ ఎన్నికల్లో రాయ్‌బరేలీ స్థానం నుంచి గెలుపొందడంపై ప్రియా గాంధీ మాట్లాడుతూ, రాయ్‌బరేలీ కుటుంబ సభ్యులు, నా ప్రియమైన కార్మిక మిత్రులారా, మీ ప్రేమ, ఆశీర్వాదంతో మీరు మమ్మల్ని మరోసారి ఆశీర్వదించారని, మీ రుణం తీర్చుకోలేనిదని అన్నారు. ప్రజలను చూసి గర్విస్తున్నామని ప్రియాంక ట్వీట్‌ చేశారు.

     

  • 04 Jun 2024 08:08 PM (IST)

    దేశంలోని పేదలు రాజ్యాంగాన్ని కాపాడారు

    కూటమి ఎక్కడ పోరాడినా ఐక్యంగా పోరాడామని, భారత్‌కు కొత్త దర్శనం ఇచ్చామని రాహుల్ గాంధీ అన్నారు. మోడీ, అమిత్ షాలు దేశాన్ని నడపడం తమకు ఇష్టం లేదని దేశం స్పష్టంగా చెప్పింది. ఈ రాజ్యాంగాన్ని కాపాడే పని పేదలు చేశారని రాహుల్ గాంధీ అన్నారు. తాను వారికి కృతజ్ఞతలు చెబుతున్నానని అన్నారు. దేశ ప్రజలకు కాంగ్రెస్‌ అండగా ఉంటుందన్నారు.

    Rahul Gandhi

  • 04 Jun 2024 08:00 PM (IST)

    ఇండోర్‌ బీజేపీ అభ్యర్థి శంకర్‌ లల్వాని రికార్డ్‌

    ఇండోర్‌ బీజేపీ అభ్యర్థి శంకర్‌ లల్వాని రికార్డ్‌ విక్టరీ సృష్టించారు. బీఎస్‌పీ అభ్యర్థి పంజయ్‌పై 12,26,751 ఓట్ల తేడాతో శంకర్‌ ఘన విజయం సాధించారు. ఇండోర్‌ బీఎస్‌పీ అభ్యర్థి సంజయ్‌కు కేవలం 51,659 ఓట్లు పోల్‌ అయ్యాయి. 2019లో ఇండోర్‌ బీజేపీ అభ్యర్థిగా గెలించారు శంకర్‌ లల్వాని.

  • 04 Jun 2024 07:27 PM (IST)

    నరేంద్రమోడీకి నా కృతజ్ఞతలు – స్మృతి ఇరానీ

    ఈరోజు ఎన్నికల్లో గెలిచిన వారికి అభినందనలు. ప్రజ‌ల స‌మ‌స్యల‌ను వినే విధంగా వారు కూడా ప్రజ‌ల కోసం ప‌ని చేస్తార‌ని ఆశిస్తున్నాను. ప్రధాన మంత్రి నరేంద్రకు నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఐదేళ్లపాటు సేవ చేసే అవకాశం కల్పించిన అమేథీ ప్రజలకు మోదీ, ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కృతజ్ఞతలు తెలిపారు.

     

  • 04 Jun 2024 07:22 PM (IST)

    అటల్ జీ మంత్రివర్గంలో ఉన్న నాయకుడే ప్రధాని కావాలి: మమతా బెనర్జీ

    లోక్‌సభ ఎన్నికల ఫలితాల మధ్య మమతా బెనర్జీ కొత్త ప్రధాని అంశాన్ని లేవనెత్తారు. బీజేపీలో మంచి వ్యక్తులు ఉన్నారని, ఈసారి తిరుగుబాటు చేయకుంటే ప్రజాస్వామ్యం ఉండదని ఆర్‌ఎస్‌ఎస్‌ని అభ్యర్థిస్తున్నాను అని మమతా బెనర్జీ అన్నారు. అందుకే అటల్‌జీ మంత్రి వర్గంలో ఉన్న నాయకుడే ఎవరైనా కొత్త ప్రధాని కావాలి అని అన్నారు.

     

  • 04 Jun 2024 06:44 PM (IST)

    పెద్దపల్లి ఎంపీ అభ్యర్థి వంశీకృష్ణ విజయం

    పెద్దపల్లి పార్లమెంటు ఎంపీ అభ్యర్థిగా గడ్డం వంశీకృష్ణ విజయం సాధించారు. బీజేపీ అభ్యర్థి గోమాస శ్రీనివాస్ పై 1,31,364 ఓట్ల తేడాతో విజయం సాధించారు వంశీకృష్ణ. ఇక బీఆర్‌ఎస్‌ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్‌ మూడో స్థానానికి పరిమితమయ్యారు.

  • 04 Jun 2024 06:25 PM (IST)

    రాజ్‌ భవన్‌కు డిప్యూటీ సీఎం విజయ్‌ సిన్హా

    లోక్‌సభ ఎన్నికల ఫలితాల నేపథ్యంలో బీహార్ డిప్యూటీ సీఎం విజయ్ సిన్హా నితీశ్ కుమార్‌ను కలిశారు. ముఖ్యమంత్రి నివాసం నుంచి బయలుదేరిన విజయ్ సిన్హా నేరుగా రాజ్‌భవన్‌కు చేరుకున్నారు.

  • 04 Jun 2024 06:21 PM (IST)

    మీడియా సమావేశంలో ఖర్గే, రాహుల్‌ ఏమన్నారంటే..

    లోక్‌సభ ఫలితాల ప్రకటన అనంతరం ఢిల్లీలోని ఏఐసీసీ కార్యాలయంలో అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ప్రధాని నరేంద్ర మోదీపైనా, బీజేపీపైనా విమర్శలు చేశారు.

  • 04 Jun 2024 06:19 PM (IST)

    ఇది బీజేపీ నైతిక ఓటమి – ఖర్గే

    ఇది ప్రజల విజయం. ప్రజాస్వామ్యం సాధించిన విజయం. ఇది మోడీకి, ప్రజలకు మధ్య జరుగుతున్న యుద్ధం. ఈసారి ప్రజలు ఎవరికీ పూర్తి మెజారిటీ ఇవ్వలేదు. ఇది బీజేపీ నైతిక పరాజయం. ఎన్నికల ప్రచారంలో మోదీ అబద్ధాలు చెప్పారు. అధికార ప్రభుత్వం అడుగడుగునా అడ్డుపడుతోంది. మా పార్టీ బ్యాంకు ఖాతాలను సీజ్ చేశారు. భారత కూటమి విజయానికి కృషి చేసిన వారందరికీ ధన్యవాదాలు తెలిపారు.

  • 04 Jun 2024 06:16 PM (IST)

    వారణాసిలో మోడీ ఘన విజయం

    ఉత్తరప్రదేశ్‌లోని వారణాసి స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థి అజయ్ రాయ్‌పై 152513 ఓట్ల తేడాతో ప్రధాని నరేంద్ర మోదీ విజయం సాధించారు. మోదీకి 612970 ఓట్లు రాగా, రాయ్ 460457 ఓట్లు సాధించారు.

  • 04 Jun 2024 05:52 PM (IST)

    మోదీ మళ్లీ దేశానికి ప్రధాని అవుతారు: ఏక్ నాథ్ షిండే

    ప్రధాని మోదీ మరోసారి దేశానికి ప్రధాని అవుతారని మహారాష్ట్ర సీఎం ఏక్ నాథ్ షిండే అన్నారు. అభివృద్ధి పేరుతో ప్రజలు ఆయనకు పట్టం కట్టారు. చాలా చోట్ల ప్రతిపక్షాలు స్వల్ప ఓట్ల తేడాతో ఓడిపోయాయని అన్నారు. కొంతమంది కలలు కంటున్నారని, వారి కలలు నెరవేరలేదన్నారు.

  • 04 Jun 2024 05:50 PM (IST)

    అఖిలేష్ యాదవ్‌కు రాహుల్ గాంధీ అభినందనలు

    లోక్‌సభ ఎన్నికల ఫలితాల మధ్య రాహుల్ గాంధీ ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్‌కు శుభాకాంక్షలు తెలిపారు. ఇరువురు నేతల మధ్య ఫోన్ సంభాషణ జరిగింది. రేపు భారత కూటమి ప్రధాన సమావేశానికి పిలుపునిచ్చినట్లు చెబుతున్నారు. రేపు అఖిలేష్ యాదవ్ ఇందులో చేరవచ్చు.

  • 04 Jun 2024 05:28 PM (IST)

    యూసుఫ్ పఠాన్ ఘన విజయం..

    క్రికెటర్ యూసుఫ్ పఠాన్ 2024 లోక్‌సభ ఎన్నికల్లో బహరంపూర్ స్థానం నుంచి గెలుపొందారు. తృణమూల్ కాంగ్రెస్ (ఏఐటీసీ) తరపున ఎన్నికల్లో పోటీ చేసిన యూసఫ్ పఠాన్ కాంగ్రెస్ సీనియర్ నేత అధిర్ రంజన్ చౌదరిని ఓడించారు.

  • 04 Jun 2024 05:10 PM (IST)

    ఈటల రాజేందర్ గెలుపు

    • మల్కాజ్‌గిరి లోక్ సభ స్థానంలో 3.86 లక్షల ఓట్లతో  ఈటల రాజేందర్ గెలుపొందారు.‎
    • ఈటలకి బీజేపీకి 977757 ఓట్లు
    • సునీతా రెడ్డి(కాంగ్రెస్) కి- 591499 ఓట్లు
    • లక్ష్మా రెడ్డి (బీఆర్ఎస్ )కు 297636 ఓట్లు
    • కాంగ్రెస్ అభ్యర్థి సునీతా మహేందర్ రెడ్డి పై 3.86లక్షల ఓట్ల మెజారిటీతో ఈటల రాజేందర్ గెలుపొందారు.
  • 04 Jun 2024 04:29 PM (IST)

    వయనాడ్‌ , రాయ్‌బరేలిలో రాహుల్‌కు భారీ మెజారిటీ

    • వయనాడ్‌ , రాయ్‌బరేలిలో రాహుల్‌కు భారీ మెజారిటీ
    • వయనాడ్‌లో 3,61,394 మెజారిటీ
    • యూపీలో అందరి కంటే రాహుల్‌గాంధీ ఎక్కువ మెజారిటీ
    • రాయ్‌బరేలిలో రాహుల్‌గాంధీకి 3,88,615 ఓట్లు
    • ఎవరూ ఊహించని విధంగా రాయ్‌బరేలిలో రాహుల్‌కు భారీ మెజారిటీ
  • 04 Jun 2024 04:25 PM (IST)

    దేశంలోనే అమిత్‌షాకు అత్యంత భారీ మెజార్టీ

    • దేశంలోనే అమిత్‌షాకు అత్యంత భారీ మెజార్టీ
    • గాంధీనగర్‌లో 7 లక్షల 25 వేల ఓట్ల మెజార్టీతో అమిత్‌షా
    • దేశంలోనే రెండో అతిపెద్ద మెజార్టీ నల్గొండ ఎంపీ స్థానం
    • జనారెడ్డి కుమారుడు రఘువీర్‌కి 5 లక్షల 75 వేల ఓట్ల లీడ్‌
  • 04 Jun 2024 04:00 PM (IST)

    మహబూబ్ నగర్‌లో డీకే అరుణ విజయం..

    మహబూబ్ నగర్ ఎంపిగా బీజేపీ అభ్యర్థి డీకే అరుణ విజయం సాధించారు

    సుమారు 3000 మెజారిటీ తో విజయం సాధించినట్లు సమాచారం.

  • 04 Jun 2024 03:28 PM (IST)

    238 స్థానాల్లో బీజేపీ ముందంజ..

    ఎన్నికల సంఘం లెక్కల ప్రకారం.. బీజేపీ 238 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. కాంగ్రెస్ 98 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. ఎస్పీ 35, టీఎంసీ 29, డీఎంకే 21, టీడీపీ 16, జేడీయూ 14 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నాయి.

    • ఎన్డీఏ కూటమి -295
    • ఇండియా కూటమి -231
    • ఇతరులు -17
  • 04 Jun 2024 03:19 PM (IST)

    ఆదిలాబాద్‌లో బీజేపీ విజయం

    ఆదిలాబాద్‌లో బీజేపీ విజయం

    88 వేలకు పైగా ఓట్లతో గోడెం నగేష్‌ గెలుపు

  • 04 Jun 2024 03:12 PM (IST)

    6 లక్షల ఓట్ల ఆధిక్యంలో శివరాజ్ సింగ్ చౌహాన్

    మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ 6 లక్షల ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. విదిష నుంచి ఆయన పోటీచేస్తున్నారు.

  • 04 Jun 2024 03:06 PM (IST)

    రాత్రి 7గంటలకు ప్రసంగించనున్న ప్రధాని మోదీ..

    రాత్రి 7గంటలకు బీజేపీ ప్రధాన కార్యాలయానికి మోదీ రానున్నారు. ఈ సందర్భంగా కార్యకర్తలను ఉద్దేశించి మోదీ ప్రసంగించనున్నారు.

  • 04 Jun 2024 03:01 PM (IST)

    చరణ్‌జిత్ సింగ్ చన్నీ విజయం

    పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ అభ్యర్థి చరణ్‌జిత్ సింగ్ చన్నీ జలంధర్ లోక్‌సభ స్థానం నుంచి గెలుపొందారు. ఆయన బీజేపీ అభ్యర్థి సుశీల్ కుమార్ రింకూపై 1,75,993 ఓట్ల తేడాతో విజయం సాధించారు.

  • 04 Jun 2024 02:57 PM (IST)

    నల్గొండలో కాంగ్రెస్ అభ్యర్థి హవా..

    నల్గొండ పార్లమెంట్ 

    5,51, 168 ఓట్లతో కాంగ్రెస్ అభ్యర్థి కుందూరు రఘువీర్ రెడ్డి అధిక్యం

    • కాంగ్రెస్ – 7,70,512
    • బీజేపీ.. 2,19,344
    • బీఆర్ఎస్.. 2,16,050
  • 04 Jun 2024 02:52 PM (IST)

    రెండు చోట్ల భారీ ఆధిక్యంలో రాహుల్ గాంధీ..

    రెండు చోట్ల భారీ ఆధిక్యంలో రాహుల్ గాంధీ..

    వాయనాడ్ లో 3 లక్షలకు పైగా లీడ్, రాయబరేలిలో 2 లక్షల 33 వేల లీడ్

  • 04 Jun 2024 02:49 PM (IST)

    నాగర్ కర్నూల్‌లో విజయం దిశగా మల్లు రవి..

    నాగర్ కర్నూల్ జిల్లా: నాగర్ కర్నూల్ ఎంపీ స్థానంలో విజయం దిశగా కాంగ్రెస్ అభ్యర్థి మల్లు రవి..

    80వేల పైచిలుకు మెజారిటీతో ముందంజలో ఉన్న మల్లు రవి.

  • 04 Jun 2024 02:42 PM (IST)

    మెదక్‌లో రఘునందన్ రావు 34 వేల ఓట్ల ఆధిక్యం

    మెదక్ పార్లమెంటు నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు 34,132 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు.

    రఘునందన్ రావు (బీజేపీ) – 3,69,653

    నీలం మధు (కాంగ్రెస్)- 3,35,521

    వెంకట్రామిరెడ్డి (బీఆర్ఎస్)- 3,10,779

  • 04 Jun 2024 02:34 PM (IST)

    Karnataka Lok Sabha Election Results: ఓటమి దిశగా ప్రజ్వల్ రేవణ్ణ

    జేడీఎస్ నుంచి సస్పెండ్‌కు గురైన సిట్టింగ్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ ఓటమి దిశగా పయనిస్తున్నారు. కర్ణాటకలోని హాసన్ నియోజకవర్గంలో ఆయన వెనుకంజలో కొనసాగుతున్నారు. పలువురు మహిళలపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు అరోపణలు ఎదుర్కొంటున్న ప్రజ్వల్ రేవణ్ణ.. 43 వేల ఓట్ల తేడాతో వెనుకంజలో ఉన్నారు. కాంగ్రెస్ అభ్యర్థి శ్రేయాస్ పాటిల్ ఆధిక్యంలో కొనసాగుతున్నారు.

  • 04 Jun 2024 02:26 PM (IST)

    సార్వత్రిక సమరం (లేటెస్ట్ ఆప్‌డేట్)

    ఎన్డీయే కూటమి: 292
    (బీజేపీ-238)

    ఇండియా కూటమి: 233
    (కాంగ్రెస్-99, ఎస్పీ-35)

    ఇతరులు: 18

  • 04 Jun 2024 02:25 PM (IST)

    కరీంనగర్‌లో భారీ ఆధిక్యంలో బండి సంజయ్

    కరీంనగర్ లోక్‌సభ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి బండి సంజయ్ ఆధిక్యంలో కొనసాగుతున్నారు. 15 రౌండ్లలో కలిపి బండి సంజయ్‌కి 1,59,535 ఓట్ల మెజార్టీ ఉంది.

    15 రౌండ్లలో కలిపి బిజెపి అభ్యర్థి బండి సంజయ్ కి: 4,09,049 ఓట్లు

    కాంగ్రెస్ అభ్యర్థి రాజేందర్ రావు : 2,49,516

    బిఆర్ఎస్ అభ్యర్థి వినోద్ కుమార్: 1,95,137

     

  • 04 Jun 2024 02:19 PM (IST)

    చేవెళ్లలో లక్షకు పైగా ఓట్ల ఆధిక్యంలో కొండా విశ్వశ్వర్ రెడ్డి(బీజేపీ)

    చేవెళ్లలో 8వ రౌండ్ కి 1,06,494 ఓట్ల ఆధిక్యంలో బిజెపి అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డి.
    కౌంటింగ్ సెంటర్ నుంచి వెళ్లిపోయిన కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి గడ్డం రంజిత్ రెడ్డి.

  • 04 Jun 2024 02:18 PM (IST)

    జహీరాబాద్‌లో సురేష్ షెట్కార్ విజయం

    జహీరాబాద్ లోక్‌సభ స్థానంలో కాంగ్రెస్ అభ్యర్ధి సురేష్ షెట్కార్ విజయం

  • 04 Jun 2024 02:15 PM (IST)

    మహబూబ్ నగర్‌లో డీకే అరుణ ముందంజ

    13వ రౌండ్ ముగిసేసరికి 13,774 ఓట్లతో ముందంజలో బీజేపీ అభ్యర్థి డీకే అరుణ.

    బిజెపి – 3,40,604
    కాంగ్రెస్ – 3,26,830
    బీఆర్ఎస్ – 1,05,523

  • 04 Jun 2024 01:49 PM (IST)

    మోదీ, అమిత్ షాకి చంద్రబాబు ఫోన్..

    బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి మ్యాజిక్ ఫిగర్ దాటి 300 సీట్ల ఆధిక్యంలో కొనసాగుతోంది.. అంతేకాకుండా.. ఏపీలో సైతం టీడీపీ కూటమి ప్రభంజనం సృష్టించింది.. స్పష్టమైన ఆధిక్యంతో అధిక సంఖ్యలో సీట్లలో టీడీపీ, జనసేన, బీజేపీ ఆధిక్యంలో ఉన్నాయి. ఈ తరుణంలో టిడిపి అధినేత చంద్రబాబు.. ప్రధాని మోదీ, అమిత్ షా కి ఫోన్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. వారు కూడా చంద్రబాబుకు శుభాకాంక్షలు తెలియజేశారు.

  • 04 Jun 2024 01:46 PM (IST)

    మహబూబ్ నగర్‌లో బీజేపీ ఆధిక్యం

    మహబూబ్ నగర్ పార్లమెంట్: 12వ రౌండ్ ముగిసేసరికి మొత్తం 8101ఓట్లతో బీజేపీ అభ్యర్థి డీకే అరుణ ముందంజలో ఉన్నారు.

    • బిజెపి – 309644
    • కాంగ్రెస్ – 301543
    • BRS – 98746
  • 04 Jun 2024 01:42 PM (IST)

    జాతీయస్థాయిలో ఎన్డీయే కూటమికి ఆధిక్యం

    • జాతీయస్థాయిలో ఎన్డీయే కూటమికి ఆధిక్యం
    • ఈసారి కీలకంగా మారుతున్న చంద్రబాబు, నితీష్‌
    • ఇద్దరితో ఖర్గే సంప్రదిస్తారంటూ జాతీయ మీడియాలో వార్తలు
    • ఈ ప్రచారాన్ని ఖండించిన జేడీ(యూ)
    • మేం ఎన్డీయేతోనే ఉన్నాం- జేడీ(యూ)
    • చంద్రబాబుకు ఫోన్‌చేసి మాట్లాడిన మోదీ
    • బిహార్‌లో 15 సీట్లలో జేడీ(యూ)కి ఆధిక్యం
    • ఏపీలో 16 ఎంపీ సీట్లలో టీడీపీ ఆధిక్యం
  • 04 Jun 2024 01:38 PM (IST)

    పశ్చిమ బెంగాల్‌లో టీఎంసీ హవా..

    కేరళ, తమిళనాడులో NDA కూటమి ఏమాత్రం ప్రభావం చూపలేదు. పశ్చిమ బెంగాల్‌లో టీఎంసీ 33 సీట్లలో ఆధిక్యం కొనసాగిస్తోంది.

  • 04 Jun 2024 01:37 PM (IST)

    పంజాబ్‌లో కాంగ్రెస్‌ ఆధిక్యం

    పంజాబ్‌లో అధిక స్థానాల్లో కాంగ్రెస్‌ ఆధిక్యం కనబరుస్తోంది. మధ్యప్రదేశ్‌లో మాత్రం 29కి 29 స్థానాల్లో బీజేపీ ఆధిపత్యం స్పష్టమవుతోంది. ఒడిశాలో నవీన్‌ పట్నాయక్‌ జోరుకు బీజేపీ బ్రేక్ వేసి అధికారం దిశగా అడుగులు వేస్తోంది.

  • 04 Jun 2024 01:37 PM (IST)

    కర్నాటకలో ఎన్డీఏ కూటమి ఆధిక్యం

    కర్నాటకలోనూ ఎన్డీఏ కూటమి అభ్యర్థుల ఆధిక్యం కొనసాగుతోంది. అసోంలో 10 స్థానాల్లో బీజేపీ ముందంజలో ఉంది. ఒడిశాలో 79 అసెంబ్లీ స్థానాల్లో బీజేపీ స్పష్టమైన ఆధిక్యం కనబరుస్తోంది.

  • 04 Jun 2024 01:36 PM (IST)

    భారీ ఆధిక్యంలో ప్రధాని మోదీ

    ఉత్తరప్రదేశ్‌ వారణాసిలో ప్రధాని మోదీ మరోసారి భారీ ఆధిక్యంలో కొనసాగుతున్నారు. మొదటి రౌండ్‌లో కాంగ్రెస్‌ అభ్యర్థి లీడ్‌లో ఉన్నా.. ఆ తర్వాత రౌండ్లలో మోదీ హవా కొనసాగుతోంది.

  • 04 Jun 2024 01:31 PM (IST)

    అనూహ్యంగా పుంజుకున్న కాంగ్రెస్..

    దేశవ్యాప్తంగా కొనసాగుతున్న లోక్‌సభ ఎన్నికల ఫలితాల్లో ఎన్డీఏ, ఇండియా కూటమి మధ్య హోరాహోరీ పోరు కొనసాగుతోంది. 2014, 2019 ఎన్నికల ఫలితాలతో పోలిస్తే ఈ సారి కాంగ్రెస్‌ అనూహ్యంగా పుంజుకుంది.

    ప్రస్తుత ట్రెండ్స్ ప్రకారం..

    ఎన్డీఏ కూటమి -292

    ఇండియా కూటమి -233

    ఇతరులు -18

  • 04 Jun 2024 01:23 PM (IST)

    ఖమ్మంలో కాంగ్రెస్‌కు భారీ ఆధిక్యం

    • ఖమ్మంలో కాంగ్రెస్‌కు భారీ ఆధిక్యం
    • భారీ మెజారిటీ దిశగా కాంగ్రెస్‌
    • 3,51,281 ఓట్ల ఆధిక్యంలో రఘురాంరెడ్డి
  • 04 Jun 2024 01:21 PM (IST)

    కాంగ్రెస్‌, బీజేపీ మధ్యే పోటీ

    తెలంగాణ లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌, బీజేపీ మధ్యే ప్రధాన పోటీ నడిచింది. మొత్తం 17 స్థానాల్లో కాంగ్రెస్‌ 8, బీజేపీ 8, MIM ఒక స్థానంలో లీడ్‌లో ఉన్నాయి. ఈ ఎన్నికల ఫలితాల్లో బీఆర్‌ఎస్‌ ఊసే కనిపించడం లేదు.

  • 04 Jun 2024 01:20 PM (IST)

    రాజ్‌భవన్‌కు సీఎం జగన్‌

    • గవర్నర్ అపాయింట్‌మెంట్‌ కోరిన జగన్‌
    • కాసేపట్లో రాజ్‌భవన్‌కు సీఎం జగన్‌
    • రాజీనామా లేఖను గవర్నర్‌కు ఇవ్వనున్న జగన్
  • 04 Jun 2024 01:10 PM (IST)

    కేరళలో బీజేపీ హవా.. రెండు స్థానాల్లో..

    కేరళలో బీజేపీ బోణికొట్టబోతోంది.. త్రిస్సుర్ లోక్ సభ స్థానం నుంచి సురేష్ గోపీ 70వేల ఓట్లతో ముందంజలో ఉండగా.. తిరువనంతపురంలో రాజీవ్ చంద్రశేఖర్ ముందంజలో ఉన్నారు. ఇక్కడ శశిధరూర్ వెనుకంజలో ఉన్నారు.

  • 04 Jun 2024 01:09 PM (IST)

    తమిళనాడు, పుదుచ్చేరిలో డీఎంకే కూటమి హవా

    • తమిళనాడు, పుదుచ్చేరిలో డీఎంకే కూటమి హవా
    • 38 స్థానాల్లో డీఎంకే – కాంగ్రెస్ అభ్యర్థుల ముందంజ
    • ఒక స్థానంలో అన్నాడీఎంకే, బీజేపీ కూటమి లీడ్
  • 04 Jun 2024 12:59 PM (IST)

    ఎన్డీయే 290 స్థానాల్లో ముందంజ

    ఇప్పటి వరకు ఉన్న ట్రెండ్స్ ప్రకారం.. ఎన్డీయే 290 స్థానాల్లో, ఇండి కూటమి  232 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నాయి. ఇతరులు 21 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నారు.

  • 04 Jun 2024 12:41 PM (IST)

    ఎన్డీఏ, ఇండియా కూటమి మధ్య హోరాహోరీ

    • దేశవ్యాప్తంగా పుంజుకున్న కాంగ్రెస్‌
    • కేరళ, తమిళనాడులో ప్రభావం చూపని ఎన్డీఏ
    • పశ్చిమ బెంగాల్‌లో టీఎంసీదే హవా
    • యూపీలో పనిచేయని అయోధ్య మంత్రం
    • యూపీలో ఇండియా కూటమికి పెరిగిన గ్రాఫ్‌
    • మహారాష్ట్రలోనూ ఇండియా కూటమి లీడ్‌
    • రాజస్థాన్‌లో కాంగ్రెస్, బీజేపీ మధ్య హోరాహోరీ
    • పంజాబ్‌లో అధిక స్థానాల్లో కాంగ్రెస్‌ ఆధిక్యం
    • మధ్యప్రదేశ్‌లోని అన్ని స్థానాల్లో బీజేపీ లీడ్
    • ఒడిశాలో నవీన్‌ పట్నాయక్‌ జోరుకు బీజేపీ బ్రేక్‌
    • కర్నాటకలో ఎన్డీఏ కూటమి అభ్యర్థుల ఆధిక్యం
    • అసోంలో 10 స్థానాల్లో బీజేపీ ముందంజ
  • 04 Jun 2024 12:18 PM (IST)

    మెజార్టీ స్థానాలు దిశగా బీజేపీ

    లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ కూటమి మెజార్టీ స్థానాలు సాధించే దిశగా దూసుకెళుతోంది. 290 సీట్లకు పైగా సీట్లలో బీజేపీ కూటమి ముందంజలో ఉంది. ఇక కాంగ్రెస్ కూడ గట్టి పోటీనే ఇస్తోంది. 195 సీట్లల్లో హస్తం కూటమి మెజార్టీలో ఉంది. 56 మంది ఇతరులు ముందంజలో ఉండటం ఉత్కంఠను పెంచుతోంది.

  • 04 Jun 2024 12:10 PM (IST)

    నితీష్, చంద్రబాబు కింగ్ మేకర్లు అవుతారా..?

    నితీష్ కుమార్, చంద్రబాబు కింగ్ మేకర్లు అవుతారా..? అంటే అవుననే అంటున్నాయి.. జాతీయ మీడియా వర్గాలు.. 225 సీట్లకుపైగా ఇండియా కూటమి లీడ్‌ కొనసాగుతుండటంతో .. టీడీపీ, జేడీయూతో కాంగ్రెస్‌ చర్చలు? జరుపుతుందంటూ జాతీయ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. నితీష్ కుమార్, చంద్రబాబుతో కాంగ్రెస్‌ చర్చించే అవకాశమందని విశ్వనీయవర్గాలు చర్చించినట్లు ఊహగానాలు వెలువడతుండటం చర్చనీయాంశంగా మారింది.

  • 04 Jun 2024 12:05 PM (IST)

    తెలంగాణలో అనూహ్య ఫలితాలు

    • చెరో 8 స్థానాల్లో కాంగ్రెస్‌, బీజేపీ
    • హైదరాబాద్‌లో ఎంఐఎం ఆధిక్యం
    • ఎక్కడా ప్రభావం చూపని బీఆర్‌ఎస్‌
  • 04 Jun 2024 11:48 AM (IST)

    నాగర్ కర్నూల్‌లో కాంగ్రెస్ ముందంజ..

    నాగర్ కర్నూల్ ఎంపీ స్థానం: 6వ రౌండ్ ముగిసే సరికి కాంగ్రెస్ అభ్యర్థి మల్లు రవి మొత్తం 17,120 ఓట్లతో ముందంజలో ఉన్నారు..

    • కాంగ్రెస్ (మల్లు రవి) – 1,33619
    • బిజెపి (భరత్ ప్రసాద్)- 1,16,499
    • బీఆర్ఎస్ (ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్)- 1,07662
  • 04 Jun 2024 11:43 AM (IST)

    రాహుల్ గాంధీకే దక్కుతుంది.. సంజయ్ రౌత్ ఏం చెప్పారంటే..

    శివసేన (యూబీటీ) నేత సంజయ్ రౌత్ మాట్లాడుతూ.. దేశవ్యాప్తంగా భారత కూటమికి వస్తున్న ఖ్యాతి రాహుల్ గాంధీకే దక్కుతుందని అన్నారు. రాహుల్ గాంధీ నాయకత్వంలో కాంగ్రెస్ 150 సీట్లకు ఎగబాకిందన్నారు.. ఇది పెద్ద విషయమని.. ఇండియా కూటమి మెజారిటీ దిశగా దూసుకుపోతోందని తెలిపారు.

  • 04 Jun 2024 11:22 AM (IST)

    ఏ రాష్ట్రంలో ఏ పార్టీ ముందుంది..? ఏ పార్టీ వెనుకంజలో ఉంది.. ఫుల్ డిటైల్స్..

    • తెలంగాణ – కాంగ్రెస్ 8, బీజేపీ 7, బీఆర్ఎస్ 1, ఎంఐఎం 1
    • ఆంధ్రప్రదేశ్- టీడీపీ 15, వైఎస్సార్సీపీ 3, బీజేపీ 3
    • ఢిల్లీ- బీజేపీ 6, కాంగ్రెస్ 1..
    • బీహార్- జేడీయూ 12, బీజేపీ 9, ఎల్జేపీ 5, ఆర్జేడీ 3, కాంగ్రెస్ 2
    • ఛత్తీస్‌గఢ్- బీజేపీ 9, కాంగ్రెస్ 2 గోవా- బీజేపీ, కాంగ్రెస్ 1
    • గుజరాత్- బీజేపీ 25, కాంగ్రెస్ 1
    • హర్యానా- కాంగ్రెస్ 5, బీజేపీ 4, ఆప్ 1
    • హిమాచల్ ప్రదేశ్- బీజేపీ 4
    • జమ్మూ కాశ్మీర్- NC 2, బీజేపీ 2
  • 04 Jun 2024 11:16 AM (IST)

    ఏ పార్టీ ఎన్ని స్థానాల్లో ముందంజలో ఉందంటే..

    • బీజేపీ 226 స్థానాల్లో ముందంజలో ఉంది
    • కాంగ్రెస్ 98 స్థానాల్లో ముందంజలో ఉంది
    • ఎస్పీ 34 స్థానాల్లో ముందంజలో ఉంది
    • టీఎంసీ 24 స్థానాల్లో ముందంజలో ఉంది
    • డీఎంకే 19 స్థానాల్లో ముందంజలో ఉంది
    • టీడీపీ 15 స్థానాల్లో ముందంజలో ఉంది
    • జేడీయూ 13 స్థానాల్లో ముందంజలో ఉంది
  • 04 Jun 2024 11:10 AM (IST)

    తెలంగాణ లోక్‌సభ ఎన్నికలు.. భారీ మెజార్టీ దిశగా ఆ నేతలు..

    • ఆదిలాబాద్‌: గోడం నగేశ్‌ (బీజేపీ) 38,283 ఆధిక్యం
    • భువనగిరి: చామల కిరణ్‌ కుమార్‌ రెడ్డి (కాంగ్రెస్) 48,622 ఓట్ల ఆధిక్యం
    • చేవెళ్ల: కొండా విశ్వేశ్వర్‌ రెడ్డి (బీజేపీ) 33,086 ఆధిక్యం
    • హైదరాబాద్‌: అసదుద్దీన్‌ ఓవైసీ (ఎంఐఎం) 33,009 ఓట్ల ఆధిక్యం
    • కరీంనగర్: బండి సంజయ్ (బీజేపీ) 64,408 ఆధిక్యం
    • ఖమ్మం: రామసహాయం రఘురామ్‌ రెడ్డి (కాంగ్రెస్) 1,48,091 ఆధిక్యం
    • మహబూబాబాద్‌: బలరాం నాయక్‌ (కాంగ్రెస్) 82,286 ఆధిక్యం
    • మహబూబ్‌ నగర్‌: డీకే అరుణ (బీజేపీ) 5,652 ఆధిక్యం
    • మల్కాజిగిరి: ఈటల రాజేందర్ (బీజేపీ) 1,05,472 ఆధిక్యం
    • మెదక్‌: 799 ఓట్ల ముందంజలో బీఆర్ఎస్ అభ్యర్థి వెంకట్ రాంరెడ్డి..
    • నాగర్‌ కర్నూల్‌: మల్లు రవి (కాంగ్రెస్) 18,655 ఆధిక్యం
    • నల్గొండ: కుందురు రఘువీర్‌ రెడ్డి (కాంగ్రెస్) 1,42,695 ఆధిక్యం
    • నిజామాబాద్‌: ధర్మపురి అర్వింద్ (బీజేపీ) 17,832 ఆధిక్యం
    • పెద్దపల్లి: గడ్డం వంశీ కృష్ణ (కాంగ్రెస్) 27, 283 ఓట్ల ఆధిక్యం
    • సికింద్రాబాద్: జి కిషన్‌ రెడ్డి (బీజేపీ) 34,076 ఓట్ల ఆధిక్యం
    • వరంగల్‌: కడియం కావ్య (కాంగ్రెస్) 48,790 ఓట్ల ఆధిక్యం
    • జహీరాబాద్‌: సురేశ్‌ షెట్కార్ (కాంగ్రెస్) 12,368 ఓట్ల ఆధిక్యం
    • వరంగల్: 54,728 ఓట్ల ఆధిక్యంలో కాంగ్రెస్ అభ్యర్థి కడియం కావ్య..
  • 04 Jun 2024 11:01 AM (IST)

    Malkajgiri Election Result: మల్కాజ్‌గిరిలో బీజేపీ అభ్యర్థి ఈటలకు భారీ ఆధిక్యం

    • మల్కాజ్‌గిరిలో బీజేపీ అభ్యర్థి ఈటలకు భారీ ఆధిక్యం
    • నాలుగోరౌండ్‌ ముగిసేటప్పటికి ఈటలకు లక్షా 447 ఓట్ల లీడ్‌
    • కరీంనగర్‌లో 4వ రౌండ్‌లో బండి సంజయ్‌కి 51,770 ఓట్ల ఆధిక్యం
    • వరంగల్‌ కాంగ్రెస్‌ అభ్యర్థి కడియం కావ్యకు ఆధిక్యం
    • మూడోరౌండ్లో కావ్యకు 34,522 ఓట్ల లీడింగ్‌
    • మహబూబాబాద్‌ 2వ రౌండ్‌లో కాంగ్రెస్‌ బలరాంనాయక్‌ ముందంజ
    • 2వ రౌండ్‌లో బలరాం నాయక్‌కు 32,558 ఓట్ల ఆధిక్యం
    • భువనగరిలో 3వ రౌండ్‌లో చామల కిరణ్‌ (కాంగ్రెస్‌)కు 26,083 ఓట్ల ఆధిక్యం
    • చేవెళ్లలో 2వ రౌండ్‌ : విశ్వేశ్వర్‌రెడ్డి (బీజేపీ)కి 16,442 ఓట్ల ఆధిక్యం
  • 04 Jun 2024 10:59 AM (IST)

    మహారాష్ట్ర లోక్ సభ ఎన్నికలు లేటెస్ట్ ట్రెండ్స్..

    మహారాష్ట్ర లోక్ సభ ఎన్నికల్లో మహావికాస్ అఘాడీ కూటమి పైచేయి సాధించింది. మహారాష్ట్రలోని 48 లోక్‌సభ నియోజకవర్గాల్లో.. NDA 20 స్థానాల్లో, ఇండియా కూటమి 27 స్థానాల్లో ముందంజలో ఉన్నాయి. ఎంఐఎం ఒకస్థానంలో ఉంది..

  • 04 Jun 2024 10:58 AM (IST)

    Varanasi Election Result: వారణాసిలో మోదీ ఆధిక్యం..

    వారణాసిలో 33వేల ఆధిక్యంలో ప్రధాని మోదీ కొనసాగుతున్నారు.

  • 04 Jun 2024 10:56 AM (IST)

    లక్ష ఓట్ల ఆధిక్యంలో రాహుల్ గాంధీ..

    వాయనాడ్‌లో రాహుల్ గాంధీ దూసుకెళ్తున్నారు. లక్ష ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కే సురేంద్రన్ 5వేల ఓట్లను మాత్రమే సాధించారు.

    రాయ్ బరేలిలో రాహుల్ గాంధీ 50వేల ఆధిక్యంలో ఉన్నారు.

  • 04 Jun 2024 10:39 AM (IST)

    యూపీ లోక్ సభ ఎన్నికలు లేటెస్ట్ ట్రెండ్స్..

    యూపీ లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ అంచనాలు తలకిందులయ్యాయి. రాష్ట్రంలో 60కి పైగా స్థానాల్లో గెలుపొందాలని ఆపార్టీ లక్ష్యంగా పెట్టుకుంది.. అయితే.. అక్కడ బీజేపీకి సమాజ్ వాది పార్టీ గట్టిపోటీనిస్తోంది. తాజా ట్రెండ్స్ ను పరిగణలోకి తీసుకుంటే.. యూపీలో 39 స్థానాల్లో బీజేపీ ఆధిక్యంలో ఉండగా.. ఎస్పీ 30, కాంగ్రెస్ 7, ఆర్ఎల్డీ 2 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నాయి.

  • 04 Jun 2024 10:36 AM (IST)

    ఏ సీటులో ఎవరు ముందంజ.. ఎవరు వెనుకంజలో ఉన్నారంటే..?

    • తూత్తుకుడిలో కనిమొళి ఆధిక్యం
    • అమేథీ నుంచి కాంగ్రెస్ అభ్యర్థి కిషోరి లాల్ శర్మ ఆధిక్యం. స్మృతి ఇరానీ వెనుకంజ
    • పాట్లీపుత్ర నుంచి మిసా భారతి 2329 ఓట్ల ఆధిక్యం
    • కతిహార్‌లో జేడీయూ అభ్యర్థి 8240 ఓట్ల ఆధిక్యం
    • శివహర్‌పై లవ్లీ ఆనంద్‌ 6119 ఓట్ల ఆధిక్యం
    • గౌతమ్ బుద్ధ నగర్ లోక్‌సభ స్థానం నుంచి మహేశ్ శర్మ ఆధిక్యం
    • 6579 హిసార్‌లో బీజేపీకి చెందిన రంజిత్ సింగ్ ముందంజ
    • సుల్తాన్‌పూర్ లో మేనకా గాంధీ వెనుకంజ
    • కురుక్షేత్రలో ఆప్ అభ్యర్థి సుశీల్ గుప్తా ముందంజ
    • బెంగళూరు రూరల్ డీకే సురేష్ వెనుకంజ
    • బెంగళూరు సౌత్ తేజస్వీ సూర్య (బీజేపీ) ఆధిక్యం
    • మాండ్య హెచ్‌డీ కుమారస్వామి ఆధిక్యం
    • త్రిసూర్ లో సురేష్ గోపి (బీజేపీ) ఆధిక్యం
    • అమరావతిలో నవనీత్ కౌర్ (బీజేపీ) వెనుకంజ
    • కోటాలో బీజేపీ ఓంబిర్లా ఆధిక్యం
    • బారామతి ఎన్సీపీ (శరద్ పవార్) సుప్రియా సూలే ఆధిక్యం
    • లక్నో నుంచి రాజ్‌నాథ్ సింగ్ ముందంజ
    • మండి నుంచి కంగనా రనౌత్ ముందంజ
    • బహరంపూర్ లో అధిర్ రంజన్ చౌదరి (కాంగ్రెస్) వెనుకంజ.. యూసఫ్ పఠాన్ (టీఎంసీ) ఆధిక్యం..
    • క్రిష్ణనగర్ టీఎంసీ మహువా మొయిత్రా వెనుకంజ
  • 04 Jun 2024 10:27 AM (IST)

    చెన్నై సౌత్‌లో తమిళిసై వెనుకంజ

    చెన్నై సౌత్‌లో బీజేపీ అభ్యర్థి తమిళిసై సౌందరరాజన్ వెనుకంజలో ఉన్నారు

  • 04 Jun 2024 10:25 AM (IST)

    లోక్ సభ ఎన్నికల ఫలితాలు.. లైవ్ వీడియో

    లోక్ సభ ఎన్నికల ఫలితాలను లైవ్ వీడియోలో వీక్షించండి..

  • 04 Jun 2024 10:19 AM (IST)

    Karimnagar Election Result: కరీంనగర్‌లో బండి సంజయ్ లీడ్..

    రెండో రౌండ్ పూర్తి అయ్యేసరికి 25వేల పై చిలుకు లీడ్ లో బిజెపి అభ్యర్థి బండి సంజయ్ కుమార్ కొనసాగుతున్నారు.

  • 04 Jun 2024 10:18 AM (IST)

    ఏపీలో లీడ్‌లో దూసుకెళ్తున్న టీడీపీ కూటమి అభ్యర్థులు.. లిస్ట్ ఇదే..

    • అనకాపల్లి – బీజేపీ సీఎం రమేష్‌ లీడ్‌
    • మచిలీపట్నం – జనసేన బాలశౌరి లీడ్‌
    • నరసరావుపేట – టీడీపీ లావు శ్రీకృష్ణదేవరాయలు లీడ్‌
    • బాపట్ల – టీడీపీ టి.కృష్ణప్రసాద్‌ లీడ్‌
    • ఒంగోలు – వైసీపీ చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి లీడ్‌
    • కర్నూల్‌ – టీడీపీ పంచలింగాల నాగరాజు లీడ్‌
    • హిందూపూర్‌ – టీడీపీ బీకే పార్థసారథి లీడ్‌
    • ఏలూరు – వైసీపీ కారుమూరు సునీల్‌ లీడ్‌
    • అమలాపురం ఎంపీ – టీడీపీ హరీష్‌ లీడ్‌
    • అరకు ఎంపీ – వైసీపీ తనూజారాణి లీడ్‌
    • విశాఖ ఎంపీ – భరత్‌ టీడీపీ లీడ్‌
    • కాకినాడ ఎంపీ – జనసేన లీడ్‌
    • శ్రీకాకుళం ఎంపీ – టీడీపీ లీడ్‌ (రామ్మోహన్‌ నాయుడు)
    • రాజమండ్రి ఎంపీ – పురందరేశ్వరి 1973 ఓట్లతో లీడ్
    • నెల్లూరు ఎంపీ – వేమిరెడ్డి ప్రభాకర్‌ రెడ్డి లీడ్‌
    • నరసాపురం ఎంపీ – బీజేపీ శ్రీనివాస వర్మ లీడ్‌
    • గుంటూరు ఎంపీ – టీడీపీ లీడ్‌ పెమ్మసాని
    • రాజంపేట ఎంపీ – వైసీపీ మిథున్‌ రెడ్డి లీడింగ్‌
    • విజయవాడ ఎంపీ – కేశినేని చిన్నీ లీడింగ్‌
    • చిత్తూరు ఎంపీ – టీడీపీ డి.ప్రసాదరావు లీడ్‌
    • తిరుపతి ఎంపీ – వైసీపీ గురుమూర్తి లీడ్‌
    • అనంతపురం ఎంపీ -టీడీపీ లీడ్‌
    • కడప పార్లమెంట్‌ – వైసీపీ లీడింగ్‌
    • విజయనగరం – టీడీపీ లీడింగ్‌ (అప్పలనాయుడు)
  • 04 Jun 2024 10:13 AM (IST)

    ఒడిశాలో బీజేపీ సత్తా..

    ఒడిశాలో బీజేపీ అధికారం దిశగా దూసుకెళ్తోంది.. 147 స్థానాలు ఉండగా.. ప్రస్తుత ట్రెండ్స్ ప్రకారం.. బీజేపీ దూసుకెళ్తోంది..

    • బీజేపీ 33
    • బీజేడీ 14
    • కాంగ్రెస్ 5
    • ఇతరులు 1
  • 04 Jun 2024 10:07 AM (IST)

    తెలంగాణ ఎంపీ స్థానాల్లో బీజేపీ ఆధిక్యం

    • ఎనిమిది స్థానాల్లో బీజేపీ ముందంజ
    • ఏడు స్థానాల్లో కాంగ్రెస్‌ ఆధిక్యం
    • చెరో స్థానంలో బీఆర్‌ఎస్‌, ఎంఐఎం
    • మల్కాజ్‌గిరి, చేవెళ్ల, సికింద్రాబాద్‌, కరీంనగర్, మహబూబ్‌నగర్‌, నాగర్‌కర్నూల్‌..నిజామాబాద్, ఆదిలాబాద్‌లో బీజేపీ ఆధిక్యం
    • నల్గొండ, భువనగిరి, ఖమ్మం, జహీరాబాద్‌, పెద్దపల్లి.. మహబూబాబాద్, వరంగల్‌లో కాంగ్రెస్‌ ఆధిక్యం
    • హైదరాబాద్‌లో ఎంఐఎం, మెదక్‌లో బీఆర్‌ఎస్‌ లీడ్
  • 04 Jun 2024 10:02 AM (IST)

    ప్రధాని మోదీ ముందంజ

    వారణాసిలో ప్రధాని మోదీ ముందంజలో ఉన్నారు. తొలి ట్రెండ్స్ లో కాంగ్రెస్‌ అభ్యర్థి అజయ్‌రాయ్‌ మోదీపై లీడింగ్‌లో ఉండగా.. తరవ్ాత లీడ్ లోకి వచ్చారు. ప్రస్తుతం 436 ఓట్ల లీడ్ తో మోదీ ముందంజలో ఉన్నారు.

  • 04 Jun 2024 09:53 AM (IST)

    అనూహ్య పరిణామం..

    లోక్‌సభ ట్రెండ్స్‌లో ఎన్డీయే మ్యాజిక్‌ ఫిగర్‌ దాటింది. ఈ క్రమంలో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. వారణాసిలో ప్రధాని మోదీ వెనుకంజలో ఉన్నారు. ఆరువేల పైలుకు ఓట్లతో మోదీ వెనుకంజలో కొనసాగుతున్నారు. కాంగ్రెస్‌ అభ్యర్థి అజయ్‌రాయ్‌ మోదీపై లీడింగ్‌లో ఉన్నారు. వయనాడ్, రాయబరేలిలో రాహుల్‌గాంధీ ఆధిక్యంలో కొనసాగుతున్నారు.

  • 04 Jun 2024 09:45 AM (IST)

    లోక్‌సభ ట్రెండ్స్‌లో మ్యాజిక్‌ ఫిగర్‌ దాటిన ఎన్డీయే

    • లోక్‌సభ ట్రెండ్స్‌లో మ్యాజిక్‌ ఫిగర్‌ దాటిన ఎన్డీయే
    • వారణాసిలో ప్రధాని మోదీ వెనుకంజ
    • ఆరువేల పైలుకు ఓట్లతో మోదీ వెనుకంజ
    • మోదీపై లీడింగ్‌లో ఉన్న కాంగ్రెస్‌ అభ్యర్థి అజయ్‌రాయ్‌
    • వయనాడ్, రాయబరేలిలో రాహుల్‌గాంధీ ఆధిక్యం
    • కోయంబత్తూరులో బీజేపీ అభ్యర్థి వెనుకంజ
  • 04 Jun 2024 09:43 AM (IST)

    వారణాసిలో ప్రధాని మోదీ వెనుకంజ

    • వారణాసిలో ప్రధాని మోదీ వెనుకంజ
    • 6223 ఓట్ల వెనుకంజలో ప్రధాని మోదీ
    • మోదీపై కాంగ్రెస్‌ అభ్యర్థి అజయ్‌రాయ్‌ ఆధిక్యం
  • 04 Jun 2024 09:42 AM (IST)

    బెంగాల్‌లో బీజేపీ ముందంజ..

    పశ్చిమ బెంగాల్‌లో బీజేపీ 21 స్థానాల్లో, టీఎంసీ 19 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నాయి. కాంగ్రెస్‌ 2 సీట్లలో ఆధిక్యంలో ఉంది. 

  • 04 Jun 2024 09:40 AM (IST)

    ఢిల్లీలో హోరాహోరీ పోటీ

    ఢిల్లీలోని 7 లోక్‌సభ స్థానాలకు గట్టి పోటీ నెలకొంది. ఎన్డీయే 3 స్థానాల్లో ఆధిక్యంలో ఉండగా, ఇండి కూటమి 4 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది.

  • 04 Jun 2024 09:39 AM (IST)

    ప్రస్తుత ట్రెండ్స్ ఇవే..

    ఎన్డీయే మెజారిటీ మార్క్ దిశగా దూసుకెళ్తోంది.. ఎన్డీఏ 275 సీట్లలో ఆధిక్యంలో కొనసాగుతుండగా.. ఇండియా కూటమి 201 సీట్లలో లీడ్ లో ఉన్నాయి.

  • 04 Jun 2024 09:34 AM (IST)

    యూపీలో పెను సంచలనం

    యూపీలో లోక్ సభ ఫలితాలు సంచలనంగా మారుతున్నాయి. ఎస్పీ భారీ ఆధిక్యంలో కొనసాగుతోంది.. ఎస్పీ.. బీజేపీ మధ్య టఫ్ ఫైట్ కొనసాగుతోంది.. ఎస్పీ 32 స్థానాల్లో, బీజేపీ 25 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నాయి.

  • 04 Jun 2024 09:28 AM (IST)

    అవినాష్ రెడ్డి వెనుకంజ..

    కడపలో వైసీపీ అభ్యర్థి అవినాష్ రెడ్డి వెనుకంజ..

  • 04 Jun 2024 09:25 AM (IST)

    భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్లు..

    సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏ, ఇండియా కూటముల మధ్య టఫ్ ఫైట్ కొనసాగుతుండటంతో.. దేశీ స్టాక్ మార్కెట్లు దెబ్బకు కుదేలయ్యాయి. సెన్సెక్స్ 1900 పాయింట్లు నష్టపోయి.. కొనసాగుతుండగా.. నిఫ్టీ 600 పాయింట్లు నష్టపోయాయి.

  • 04 Jun 2024 09:24 AM (IST)

    కుప్పకూలిన స్టాక్‌మార్కెట్లు

    • కుప్పకూలిన స్టాక్‌మార్కెట్లు
    • 600 పాయింట్ల నష్టంలో నిఫ్టీ
    • 2 వేల పాయింట్ల నష్టంలో సెన్సెక్స్‌
  • 04 Jun 2024 09:18 AM (IST)

    ఏపీలో ముందంజలో ఉన్నది వీరే..

    • నెల్లూరులో టీడీపీ ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ముందంజ
    • విజయవాడ టీడీపీ ఎంపీ అభ్యర్థి చిన్ని ఆధిక్యం
    • నరసరావుపేట టీడీపీ అభ్యర్థి కృష్ణదేవరాయలు లీడ్
    • నంద్యాలలో టీడీపీ అభ్యర్థి బైరెడ్డి శబరి ఆధిక్యం
    • రాజమండ్రి బీజేపీ అభ్యర్థి పురంధేశ్వరి ఆధిక్యం
    • తిరుపతి బీజేపీ ఎంపీ అభ్యర్థి వరప్రసాద్ ఆధిక్యం
    • కడప వైసీపీ ఎంపీ అభ్యర్థి అవినాష్‌రెడ్డి ఆధిక్యం
    • హిందూపురంలో టీడీపీ అభ్యర్థి పార్థసారథి ఆధిక్యం
    • అనంతపురంలో టీడీపీ ఎంపీ అభ్యర్థి లక్ష్మీనారాయణ లీడ్
  • 04 Jun 2024 09:15 AM (IST)

    YS Jagan Election Result: పులివెందులలో సీఎం జగన్‌ ఆధిక్యం

    పులివెందులలో సీఎం జగన్‌ ఆధిక్యంలో కొనసాగుతున్నారు. తొలిరౌండ్‌లో 1888 ఓట్ల ఆధిక్యం..

  • 04 Jun 2024 09:12 AM (IST)

    ఒడిశాలో..

    • ఒడిశాలో బీజేపీ 5,
    • బీజేడీ 4 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నాయి.
  • 04 Jun 2024 09:03 AM (IST)

    మహబూబాబాద్‌లో కాంగ్రెస్ ఆధిక్యం..

    మహబూబాబాద్ పార్లమెంట్ లో కాంగ్రెస్ అభ్యర్థి బలరాం నాయక్ ముందంజలో ఉన్నారు.

  • 04 Jun 2024 09:03 AM (IST)

    Nizamabad Election Result: నిజామాబాద్‌లో బీజేపీ ముందంజ

    నిజామాబాద్ పోస్టల్ బ్యాలెట్ లెక్కింపులో బిజెపి అభ్యర్థి అరవింద్ ముందంజలో ఉన్నారు.

Follow us on