Lok Sabha Election: రాహుల్ గాంధీ స్థానంలో అమేథీ నుంచి కేఎల్ శర్మ..? పార్టీ సంప్రదాయాన్ని బ్రేక్ చేస్తుందా?

|

May 02, 2024 | 1:36 PM

ఉత్తరప్రదేశ్‌లోని రాయ్‌బరేలీ, అమేథీ స్థానాల్లో కాంగ్రెస్ ఎవరికి టికెట్ ఇస్తుందనే దానిపై సస్పెన్స్ కొనసాగుతోంది. ఐదో దశలో ఈ రెండు లోక్‌సభ స్థానాలకు ఎన్నికలు జరగనుండగా, నామినేషన్‌కు ఒక్కరోజు మాత్రమే మిగిలి ఉంది.

Lok Sabha Election: రాహుల్ గాంధీ స్థానంలో అమేథీ నుంచి కేఎల్ శర్మ..? పార్టీ సంప్రదాయాన్ని బ్రేక్ చేస్తుందా?
Sonia Rahul Kharge
Follow us on

ఉత్తరప్రదేశ్‌లోని రాయ్‌బరేలీ, అమేథీ స్థానాల్లో కాంగ్రెస్ ఎవరికి టికెట్ ఇస్తుందనే దానిపై సస్పెన్స్ కొనసాగుతోంది. ఐదో దశలో ఈ రెండు లోక్‌సభ స్థానాలకు ఎన్నికలు జరగనుండగా, నామినేషన్‌కు ఒక్కరోజు మాత్రమే మిగిలి ఉంది. నెహ్రూ-గాంధీ కుటుంబానికి కంచుకోటగా భావించే రెండు లోక్‌సభ నియోజకవర్గాలు ఉత్తరప్రదేశ్‌లోని అమేథీ, రాయ్‌బరేలీ స్థానాల నుంచి కాంగ్రెస్ ఎవరిని నిలబెడుతుందనే దానిపై అధికారిక ప్రకటన లేదు. అయితే రెండు పేర్లు మాత్రం బలంగా వినిపిస్తున్నాయి. ఈ రెండు స్థానాల్లో అభ్యర్థులు దాదాపు ఖరారు అయ్యినట్లేనని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి.

రాయ్‌బరేలీ నుంచి రాహుల్‌ గాంధీని, అమేథీ నుంచి కేఎల్‌ శర్మను కాంగ్రెస్‌ బరిలోకి దించవచ్చని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. అయితే రాయ్‌బరేలీ నుంచి ప్రియాంక గాంధీ పేరుపై కూడా చర్చలు జరుగుతున్నాయి. అమేథీలో భారతీయ జనతా పార్టీ సిట్టింగ్ ఎంపీ స్మృతి ఇరానీకి నెహ్రూ కేఎల్ శర్మ ఏమేరకు పోటీ ఇవ్వగలరన్నదీ చర్చనీయాంశంగా మారింది. కేఎల్ శర్మ పూర్తి పేరు కిషోరి లాల్ శర్మ. అతను గాంధీ కుటుంబానికి అత్యంత సన్నిహితుడు. గాంధీ కుటుంబం నుంచి ఎవరైనా ఎన్నికల్లో పోటీ చేస్తారని ప్రజలు ఆశిస్తున్నారని, పార్టీ అధిష్టానం ఏనిర్ణయం తీసుకున్న కట్టుబడి ఉంటామన్నారు కేఎల్ శర్మ. నామినేషన్ దాఖలుకు చివరి తేదీ మే 3 కాబట్టి, మేము సిద్ధంగా ఉన్నామన్నారు.

పార్టీ సంప్రదాయాన్ని బ్రేక్ చేస్తుందా?

పార్టీ కేఎల్ శర్మకు టిక్కెట్ ఇస్తే, దశాబ్దాల తర్వాత కాంగ్రెస్ తన పాత ఆలోచనలకు స్వస్తి పలికున్నట్లు అనిపిస్తోంది. 1991లో అప్పటి ప్రధాని రాజీవ్ గాంధీ మరణించినప్పుడు గాంధీ కుటుంబానికి చెందని సతీష్ శర్మ అమేథీ నుంచి ఎన్నికల్లో పోటీ చేసి గెలిచారు. 1998లో సోనియాగాంధీ ఇక్కడ నుంచి ఎన్నికల్లో పోటీ చేయగా, 2004లో రాహుల్ గాంధీ ఇక్కడి నుంచే తన రాజకీయ ఇన్నింగ్స్‌ను ప్రారంభించారు. రాహుల్ ఇప్పటికే ఎన్నికల్లో విజయం సాధించారు. 2019 వరకు రాహుల్ ఇక్కడి నుంచి ఎంపీగా ఉన్నారు. అయితే ఆ ఏడాది జరిగిన ఎన్నికల్లో బీజేపీ తరుఫున పోటీ చేసి స్మృతి ఇరానీ 55 వేల ఓట్ల తేడాతో విజయం సాధించారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..