Lok Sabha Election: కాంగ్రెస్ మరో అభ్యర్థుల జాబితా విడుదల.. ఎవరెవరికి టికెట్ ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా?

|

Apr 06, 2024 | 12:14 PM

లోక్‌సభ ఎన్నికల అభ్యర్థుల జాబితాను కాంగ్రెస్ విడుదల చేసింది. ఈ జాబితాలో గోవా, మధ్యప్రదేశ్, దాదర్‌లోని 6 స్థానాలకు అభ్యర్థుల పేర్లను ప్రకటించారు. మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌ నుంచి ప్రవీణ్‌ పాఠక్‌కు, మొరెనా నుంచి సత్యపాల్‌ సింగ్‌ సికర్వార్‌కు టికెట్‌ దక్కింది. ఇప్పటి వరకు 13 జాబితాలు విడదల చేసిన కాంగ్రెస్ తాజాగా 6 అభ్యర్థులతో 14వ జాబితాను ప్రకటించింది.

Lok Sabha Election: కాంగ్రెస్ మరో అభ్యర్థుల జాబితా విడుదల.. ఎవరెవరికి టికెట్ ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా?
Kharge Rahul Gandhi
Follow us on

లోక్‌సభ ఎన్నికల అభ్యర్థుల జాబితాను కాంగ్రెస్ విడుదల చేసింది. ఈ జాబితాలో గోవా, మధ్యప్రదేశ్, దాదర్‌లోని 6 స్థానాలకు అభ్యర్థుల పేర్లను ప్రకటించారు. మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌ నుంచి ప్రవీణ్‌ పాఠక్‌కు, మొరెనా నుంచి సత్యపాల్‌ సింగ్‌ సికర్వార్‌కు టికెట్‌ దక్కింది. ఇప్పటి వరకు 13 జాబితాలు విడదల చేసిన కాంగ్రెస్ తాజాగా 6 అభ్యర్థులతో 14వ జాబితాను ప్రకటించింది.

2024 లోక్‌సభ ఎన్నికలకు గానూ కాంగ్రెస్ అభ్యర్థుల 13వ జాబితాను గురువారం (ఏప్రిల్ 4, 2024) విడుదల చేసింది. ఈ జాబితాలో ముగ్గురు అభ్యర్థుల పేర్లు ప్రకటించారు. ఈ ముగ్గురు అభ్యర్థులు గుజరాత్‌లోని సురేంద్రనగర్, జునాగఢ్, వడోదర లోక్‌సభ నియోజకవర్గాలకు అభ్యర్థుల పేర్లను ఖరారు చేసింది కాంగ్రెస్. సురేంద్రనగర్ నుంచి రిత్విక్ భాయ్ మక్వానా, జునాగఢ్ నుంచి హీరా భాయ్ జోత్వా, వడోదర నుంచి జస్పాల్ సింగ్ పాధియార్‌లకు పార్టీ టిక్కెట్లు ఇచ్చింది.

కాంగ్రెస్ ఇప్పటివరకు 241 మంది అభ్యర్థుల ప్రకటన

కాంగ్రెస్ తన 14 జాబితాల్లో మొత్తం 241 మంది అభ్యర్థుల పేర్లను ప్రకటించింది. 14వ జాబితా విడుదలకు ముందు, 13 వేర్వేరు జాబితాల్లో 235 మంది అభ్యర్థులను ప్రకటించిన పార్టీ, శుక్రవారం మరో 6 మంది అభ్యర్థుల పేర్లను వెల్లడించింది. దీంతో ఈ సంఖ్య 241కి పెరిగింది. దేశంలో 18వ లోక్‌సభకు సార్వత్రిక ఎన్నికలు ఏప్రిల్ 19 నుంచి ప్రారంభం కానున్నాయి. ఏప్రిల్ 26, మే 7, మే 13, మే 20, మే 25, జూన్ 1 తేదీల్లో మరో ఏడు దశల్లో ఓటింగ్ నిర్వహించి, ఓట్ల లెక్కింపు జూన్ 4, 2024న జరుగుతుంది. మరోవైపు ఎన్నికల సమయం దగ్గరపడుతున్న కొద్దీ అశావాహుల్లో టెన్షన్ నెలకొంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…