ముక్కులో నిమ్మరసం వేస్తే కోవిడ్ రాకుండా రోగ నిరోధక శక్తి పెరుగుతుందా ?శాస్త్రీయ ఆధారాల్లేవ్ !

కోవిడ్ రాకుండా రోగ నిరోధక శక్తిని పెంచేందుకు ముక్కులో నిమ్మరసం చుక్కలు రెండు వేసుకుంటే చాలునని ఇటీవల కొందరు సోషల్ మీడియా ద్వారా ప్రచారం చేస్తున్నారు. దీనివల్ల అసలు కోవిడ్ దరి చేరదని,..

ముక్కులో నిమ్మరసం వేస్తే కోవిడ్ రాకుండా రోగ నిరోధక శక్తి పెరుగుతుందా ?శాస్త్రీయ ఆధారాల్లేవ్ !
Lemon Thearapy, Video

Edited By: Anil kumar poka

Updated on: May 04, 2021 | 9:02 PM

కోవిడ్ రాకుండా రోగ నిరోధక శక్తిని పెంచేందుకు ముక్కులో నిమ్మరసం చుక్కలు రెండు వేసుకుంటే చాలునని ఇటీవల కొందరు సోషల్ మీడియా ద్వారా ప్రచారం చేస్తున్నారు. దీనివల్ల అసలు కోవిడ్ దరి చేరదని, ఇమ్యూనిటీ పెరుగుతుందని వీరు వీడియోల్లో చాటుకుంటున్నారు. కానీ ఇందుకు శాస్త్రీయ ఆధారాలు లేవని ఓ అధ్యయనంలో తేలింది. నిమ్మ కాయ, లేదా నిమ్మరసం ఆరోగ్యానికి మంచివే కానీ వీటివల్ల కరోనా వైరస్ నశిస్తుందని చెప్పలేమని, ఆ వీడియోలు ఫేక్ అని ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో స్టడీస్ లో తేలింది. సదరు వీడియోలో ఓ వ్యక్తి చేసిన ప్రకటనను నమ్మరాదని ఈ అధ్యయనం వెల్లడించింది.ఈ విధమైన ప్రకటనలు మంచి కన్నా హాని ఎక్కువగా చేస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఆయుర్వేద పరంగా మిరియాలు, పసుపు కలిపిన పాలు, కషాయం వంటివి కోవిద్ అదుపులో సహకరిస్తాయని .ఇంటింటి వైద్యం’ చెబుతున్నాయి. అయితే జలుబు, పొడి దగ్గు వంటి స్వల్ప లక్షణాలను ఇవి కొంతవరకు అదుపు చేయగలుగుతాయి. వంటింటి వైద్యం మంచిదే అయినా నిపుణుల సలహాలు తీసుకోవడం మంచిదని కూడా అంటున్నారు. ఇటీవల ఉత్తరప్రదేశ్ గోరఖ్ పూర్ లో 82 ఏళ్ళ మహిళ కోవిడ్ పాజిటివ్ సోకినప్పటికీ ఆసుపత్రికి వెళ్లకుండా ఇంట్లోనే స్వీయ నియంత్రణలో ఉంటూ 14 రోజులపాటు ఆయుర్వేద చికిత్స తీసుకుందట… పైగా రోజుకు మూడు సార్లు బోర్లా పడుకుంటూ ఉండడం వల్ల ఆమెలో ఆక్సిజన్ లెవెల్ పెరిగిందట.. అలా ఆమె పూర్తిగా ఆరోగ్యవంతురాలైనట్టు , కోలుకున్నట్టు వార్తలు వచ్చాయి. మిరియాలు కలిపిన రసాన్ని పీల్చడం వల్ల కూడా ఆమె ఆరోగ్యం మెరుగు పడిందట..అయితే ఆమె ఇవన్నీ డాక్టర్ల పర్యవేక్షణలో చేసింది.

ఇంటివైద్యమయినా, ఆయుర్వేద మందులతో నైనా ఈ మహమ్మారిని అదుపు చేయగలమనుకుంటే ఇన్ని హాస్పటల్స్, ఐసీయూలు ఎందుకు అనేవారు కూడా ఉన్నారు. అయితే శాస్త్రీయ విధానాల ఆమోదం ఉన్నప్పుడు దేనినైనా స్వీకరించ వచ్చునని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అంతే తప్ప మిడిమిడి జ్ఞానంతో చేసే సూచనలను పట్టించుకోరాదని వీరు ఢంకా బజాయించి చెబుతున్నారు.

మరిన్ని చదవండి ఇక్కడ : ఓటీటీలో దుమ్మురేపుతున్న పవన్ కళ్యాణ్ వీడియో వకీల్ సాబ్ … :Vakeel Saab creates record OTT video.