TV9 Network: విజయవంతంగా ముగిసిన ‘లీడర్స్‌ ఆఫ్‌ రోడ్‌ ట్రాన్స్‌పోర్ట్‌ కాంక్లేవ్‌’.. బెంగళూరు వేదికగా..

ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో లాబ్‌ లాజిస్టిక్స్‌ సహ వ్యవస్థాపకుడు సీఈవో వేణు కొండూరు, ఆరెంజ్‌ కోచ్‌ల ఓనర్‌ ప్రశాంత్‌ రామన్‌తో పాటు తదితరులు తమ ఆలోచనలను పంచుకున్నారు. ఈ సందర్భంగా వేణు కొండూరు మాట్లాడుతూ.. భారతీయ లాజిస్టిక్స్‌ విధాన్ని ప్రశంసించారు. గడిచిన కొన్నేళ్లలో భారతదేశంలో మనం చూసిన అతి పెద్ద మార్పుల్లో ఇంటర్నెట్ విస్తరణ ఒకటని, సాంకేతికతను అలవరుచుకోవడానికి...

TV9 Network: విజయవంతంగా ముగిసిన లీడర్స్‌ ఆఫ్‌ రోడ్‌ ట్రాన్స్‌పోర్ట్‌ కాంక్లేవ్‌.. బెంగళూరు వేదికగా..
Tv9 Network

Updated on: Oct 27, 2023 | 3:05 PM

టీవీ9 నెట్‌వర్క్‌ నేతృత్వంలో బెంగళూరు వేదికగా జరిగిన ‘లీడర్స్‌ ఆఫ్‌ రోడ్‌ ట్రాన్స్‌పోర్ట్ కాంక్లేవ్‌’ విజయవంతంగా ముగిసింది. రహదారి భద్రత, టెక్నాలజీ, సుస్థిరత వంటి అంశాలతో కూడిన స్మార్ట్‌ మొబిలిటీ ఎకోసిస్టమ్‌ను రూపొందించడం, దాని గురించి ప్రజల్లో అవగాహన కల్పించడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం. శుక్రవారం బెంగళూరులో జరిగిన ఈ కార్యక్రమంలో రవాణా, లాజిస్టిక్స్‌ రంగానికి చెందిన పలువురు ప్రతినిధులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో లాబ్‌ లాజిస్టిక్స్‌ సహ వ్యవస్థాపకుడు సీఈవో వేణు కొండూరు, ఆరెంజ్‌ కోచ్‌ల ఓనర్‌ ప్రశాంత్‌ రామన్‌తో పాటు తదితరులు తమ ఆలోచనలను పంచుకున్నారు. ఈ సందర్భంగా వేణు కొండూరు మాట్లాడుతూ.. భారతీయ లాజిస్టిక్స్‌ విధాన్ని ప్రశంసించారు. గడిచిన కొన్నేళ్లలో భారతదేశంలో మనం చూసిన అతి పెద్ద మార్పుల్లో ఇంటర్నెట్ విస్తరణ ఒకటని, సాంకేతికతను అలవరుచుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నమాన్నారు. నేషనల్‌ లాజిసిస్టిక్స్‌ పాలసీని సమగ్రంగా అమలు చేస్తున్నామని తెలిపిన వేణు కొండూరు.. ప్రతీ వాహన యాజమానితో పాటు డ్రైవర్‌ ప్రస్తుతం స్మార్ట్ ఫోన్‌లను కలిగి ఉన్నారని, రవాణా రంగాన్ని డిజిటలైజ్‌ చేసేందుకు అన్ని రకాల మౌలిక సదుపాయాలు తమ వద్ద ఉన్నాయని వేణు కొండూరు తెలిపారు.

ఇక ఈ కార్యక్రమంలో భాగంగా టీవీ9 కన్నడ ఛానల్ ఎండీ రాహుల్ చౌదరి, కాంటినెంటల్ సంస్థ సీనియర్ ప్రతినిధి రజనీష్ కొచాగవేలు.. కర్ణాటక ఆర్టసీ డైరెక్టర్‌ డా. నందినీ దేవీని సత్కరించారు. కాంటినెంటల్‌ ఏజీ అనేది జర్మీనికి చెందిన కంపెనీ. ఈ కంపెనీ వివిధ ఆటో విడిభాగాలను తయారు చేస్తుంది. కంపెనీ వాహన టైర్లను రియల్ టైమ్‌లో చెకింగ్ చేయగలిగే కాంటి కనెక్ట్ అనే టెక్నాలజీని కలిగి ఉంది. ఇది టైర్‌తో పాటు వాహన భద్రతను కాపాడుతుంది.

ఇదిలా ఉంటే ఇలాంటి కాంక్లేవ్‌లు ఇది వరకే మూడు చోట్ల జరిగాయి. మొదటగా ఈ కార్యక్రమం ఢిల్లీలో ప్రారంభంకాగా, తర్వాత జైపూర్, ముంబయిలో జరిగింది. ప్రస్తుతం నాల్గవ కాంక్లేన్‌ బెంగళూరులో నిర్వహించారు. కాంటినెంటల్‌ కంపెనీ, టెక్‌ డ్రైవర్‌ కాంటి 3600 ఫ్లీట్‌ సేవల గురించి అవగాహన కల్పించడమే లక్ష్యంగా ఈ ఈవెంట్స్‌ను నిర్వహిస్తున్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..