IAF Jaguar Crash: IAF పైలట్ లోకేందర్ అంత్యక్రియలు పూర్తి.. తండ్రికి తుది వీడ్కోలు పలికిన నెల రోజుల చిన్నారి..

రాజస్థాన్‌లోని చురు సమీపంలో బుధవారం జరిగిన జాగ్వార్ ఫైటర్ జెట్ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన ఇద్దరు భారత వైమానిక దళ పైలట్లలో ఒకరైన స్క్వాడ్రన్ లీడర్ లోకేందర్ సింగ్ సింధు (32 ఏళ్ల ) ఇటీవలే తండ్రి అయ్యారు. జూన్ 10న కొడుకు జన్మించాడు. ఆ సమయంలో ఇంటికి వెళ్ళిన లోకేందర్ సింగ్ జూన్ 30న తిరిగి విధుల్లో చేరారు. జాగ్వార్ ఫైటర్ జెట్ ప్రమాదంలో మరణించారు.

IAF Jaguar Crash: IAF పైలట్ లోకేందర్ అంత్యక్రియలు పూర్తి.. తండ్రికి తుది వీడ్కోలు పలికిన నెల రోజుల చిన్నారి..
Iaf Jaguar Crash

Updated on: Jul 11, 2025 | 8:38 PM

రాజస్థాన్‌లో జరిగిన జాగ్వార్ ఫైటర్ జెట్ ప్రమాదంలో IAF పైలట్ లోకేందర్ సింగ్ ప్రాణాలు కోల్పోయాడు. IAF పైలట్ లోకేందర్ సింగ్ సింధు అంత్యక్రియలు ఈ రోజు జరిగాయి.తండ్రి లోకేందర్ సింగ్ అంత్యక్రియలకు నెల రోజుల క్రితం పుట్టిన చిన్నారి హాజరయ్యాడు. IAF పైలట్ లోకేందర్ సింగ్ సింధు అంత్యక్రియల సమయంలో అతని భార్య “నేను నిన్ను చూసి గర్వపడుతున్నాను” అంటూ కన్నీరు పెట్టడం అక్కడున్నవారిని సైతం కన్నీరు పెట్టించింది.

రాజస్థాన్‌లోని చురు సమీపంలో బుధవారం జరిగిన జాగ్వార్ ఫైటర్ జెట్ ప్రమాదంలో మరణించిన ఇద్దరు భారత వైమానిక దళం (IAF) పైలట్లలో ఒకరైన స్క్వాడ్రన్ లీడర్ లోకేందర్ సింగ్ సింధు. లోకేందర్ సింగ్ నెల రోజుల క్రితం ఒక మగబిడ్డకు తండ్రి అయ్యాడు. దీంతో అతని కుటుంబం మొత్తం సంబరాలు చేసుకుంది. అయితే లోకేందర్ ఊహించని విధంగా విమాన ప్రమాదంలో మరణించడం మొత్తం కుటుంబాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. లోకేందర్ సింగ్ భార్య ఈరోజు తన భర్త అంత్యక్రియలకు నెల రోజుల కొడుకును తీసుకువచ్చింది. లోకేందర్ సింగ్ సింధు తండ్రి తన మనవడిని ఎత్తుకుని తండ్రి శవపేటికను తాకినప్పుడు భావోద్వేగ క్షణం ఆవిష్కృతమైంది.

ఇవి కూడా చదవండి

హర్యానాలోని రోహ్‌తక్‌లోని ఖేరి సాధ్ గ్రామానికి చెందిన లోకేందర్ సింగ్ సింధు విమాన ప్రమాదానికి కొన్ని గంటల ముందు తన కుటుంబ సభ్యులతో వీడియో కాల్ ద్వారా మాట్లాడారు. అయితే అనుకోని విధంగా ప్రమాదంలో మరణించారు. ఈరోజు లోకేందర్ అంత్యక్రియల సమయంలో భార్య కంట తడి పెట్టింది. కన్నీళ్లతో అతని శవపేటికను ముద్దు పెట్టుకుని, “మేము నిన్ను చూసి గర్విస్తున్నాము” అని చెప్పింది. IAF పైలట్ లోకేందర్ సింగ్ సింధు అంత్యక్రియలు సైనిక గౌరవాలతో జరిగాయి.

 

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..