Priyanka Gandhi: ప్రియాంక గాధీ మౌన దీక్ష.. కేంద్ర మంత్రి అజయ్ మిశ్రాను తొలగించాలని డిమాండ్..

|

Oct 11, 2021 | 6:49 PM

యూపీలోని లఖింపూర్ ఖేరీ ఘటనపై నిరసనలు వెల్లువెత్తుతూనే ఉన్నాయి. ప్రతిపక్షాలు యోగి సర్కారుపై నిప్పులు చెరుగుతూనే ఉన్నాయి. తాజాగా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ వాద్రా సోమవారం లక్నోలో 'మౌన దీక్ష'కు దిగారు...

Priyanka Gandhi: ప్రియాంక గాధీ మౌన దీక్ష.. కేంద్ర మంత్రి అజయ్ మిశ్రాను తొలగించాలని డిమాండ్..
Priyanka Gandhi
Follow us on

యూపీలోని లఖింపూర్ ఖేరీ ఘటనపై నిరసనలు వెల్లువెత్తుతూనే ఉన్నాయి. ప్రతిపక్షాలు యోగి సర్కారుపై నిప్పులు చెరుగుతూనే ఉన్నాయి. తాజాగా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ వాద్రా సోమవారం లక్నోలో ‘మౌన దీక్ష’కు దిగారు. కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా వెంటనే తొలగించాలని డిమాండ్ చేశారు. గాంధీ విగ్రహం ముందు మౌన దీక్ష మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభమైంది. ఈ దీక్షలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, రాష్ట్ర పార్టీ చీఫ్ అజయ్ కుమార్ లల్లూ, మాజీ ఎంపీలు ప్రమోద్ తివారీ, పీఎల్ పునియా, కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ నాయకురాలు ఆరాధన మిశ్రా ప్రియాంక పాల్గొన్నారు.

ఉత్తర ప్రదేశ్ కొత్త ప్రధాన న్యాయమూర్తి ప్రమాణ స్వీకారం జరగాల్సి ఉన్నందున తమ ధర్నా సమయం, వేదికను మార్చమని పోలీసులు తమను కోరారని ఎంపీ ప్రమోద్ తివారీ తెలిపారు. లఖింపూర్ ఖేరీ ఘటనలో మృతి చెందిన రైతుల కుటుంబాలకు మద్దతుగా ప్రియాంక గాంధీ పోరాటం చేస్తున్నారు. మరణించిన రైతుల కుటుంబాలను కలిసేందుకు వెళుతున్నప్పుడు ప్రియాంకను యూపీ పోలీసులు అరెస్టు చేశారు. ఆదివారం వారణాసిలో జరిగిన ర్యాలీలో ఆమె పాల్గొన్నారు. నిష్పాక్షిక విచారణ జరగాలంటే అజయ్ మిశ్రా తన పదవి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.

ఏం జరిగింది..?

అక్టోబర్ 3న లఖింపూర్ ఖేరీలో వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు నిరసన చేపట్టారు. ఈ సమయంలో ఒక కారు రైతులపై దూసుకుపోయింది. ఈ కారణంగా, నలుగురు రైతులు మరణించారు. దీని తరువాత, చెలరేగిన హింసలో, రైతులు డ్రైవర్‌తో సహా నలుగురిని కొట్టి చంపారు. ఈ హింసలో ఒక జర్నలిస్ట్ కూడా మరణించాడు. ఈ కేసులో కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి అజయ్ మిశ్రా టెని కుమారుడు ఆశిష్ మిశ్రా సహా 14 మందిపై హత్య, నేరపూరిత కుట్ర కేసు నమోదైంది.యూపీ ప్రభుత్వం మృతుల కుటుంబానికి ప్రభుత్వం రూ .45 లక్షల పరిహారాన్ని ప్రకటించింది. అదే సమయంలో మరణించిన వారందరి కుటుంబాల్లో ఒక్కరికి చొప్పున ప్రభుత్వ ఉద్యోగం కూడా ఇస్తామని తెలిపింది.

 

Read Also.. Viral Video: “నేను యాచకుడిని కాదు.. సంగీతంతో మీ ఆత్మను తాకాలని కోరుకుంటున్నా”..