KTR – Shashi Tharoor: కరోనా ఔషధాల పేర్లపై.. కేటీఆర్ ఫన్నీ ట్విట్.. శశి థరూర్ ఏమన్నారో తెలుసా..?

|

May 22, 2021 | 6:04 AM

Shashi Tharoor - KTR: తెలంగాణ మంత్రి కేటీఆర్ చేసిన సరదా ట్వీట్‌కు కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ స్పందించారు. మంత్రి ట్విట్‌కు శశిథరూర్ ఇచ్చిన కౌంటర్ ట్విట్ ప్రస్తుతం అంతటా

KTR - Shashi Tharoor: కరోనా ఔషధాల పేర్లపై.. కేటీఆర్ ఫన్నీ ట్విట్.. శశి థరూర్ ఏమన్నారో తెలుసా..?
Ktr, Shashi Tharoor
Follow us on

Shashi Tharoor – KTR: తెలంగాణ మంత్రి కేటీఆర్ చేసిన సరదా ట్వీట్‌కు కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ స్పందించారు. మంత్రి ట్విట్‌కు శశిథరూర్ ఇచ్చిన కౌంటర్ ట్విట్ ప్రస్తుతం అంతటా చర్చనీయాంశంగా మారింది. అసలు మంత్రి కేటీఆర్ ఎందుకు, ఏం ట్విట్ చేశారు.. శశిథరూర్ ఏమని స్పందించారు.. ఇవన్నీ ఇప్పుడు చూద్దాం.. కరోనావైరస్ ప్రారంభం నాటి నుంచి ఎప్పుడూ వినని పదాలను కూడా అందరం వింటున్నాం. ముఖ్యంగా కరోనా చికిత్సలో వాడే ఔషధాల పేర్లు నోరుతిరగనంత కష్టంగా ఉన్న సంగతి తెలిసిందే. అయితే.. దీనిపై ఇలాంటి అభిప్రాయాన్నే తెలంగాణ మునిసిపల్ మంత్రి కేటీఆర్ కూడా వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన ట్విట్ చేస్తూ.. శశిథరూర్‌కి ట్యాగ్ చేశారు. ఈ పేర్లు పెట్టడంలో శశిథరూర్ పాత్ర ఉండొచ్చంటూ ఆయన ఫన్నీ ట్విట్ చేశారు.
పోసాకోనాజోల్, క్రెసెంబా, టోసిలిజుమాబ్, రెమ్ డెసివివర్, బారిసిటినిబ్, ఫ్లావిపిరావిర్, మోల్నుపిరావిర్, లిప్సోమాల్ ఆంఫోటెరెసిన్ వంటి ఔషధాల పేర్లను కేటీఆర్ ఉదహరిస్తూ… ఇలాంటి కఠిన పేర్లను ఔషధాలకు ఎందుకు పెడతారంటూ ప్రశ్నించారు. అయితే.. ఇంతటి క్లిష్టమైన పేర్లను ఔషధాలకు పెట్టడంలో శశిథరూర్ పాత్ర ఉండొచ్చంటూ కేటీఆర్ ఫన్నీగా ట్వీట్ చేశారు.

అయితే.. ఇంగ్లీష్‌పై ఎంతో పట్టున్న కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ కేటీఆర్ ట్విట్‌కు సరదాగా స్పందించారు. ఔషధాలకు పేర్లు పెట్టడంలో తప్పేమీలేదు… అయినా ఇలాంటి విషయాలు మీకెందుకు? నేను చూసుకుంటాగా నాకు వదిలేయండి.. అంటూ ట్వీట్ చేశారు. ‘‘కరోనిల్, కరోజీరో, గో కరోనా గో’’… అంటూ ఆనందంగా పిలుచుకుంటాను.. అంటూ పేర్కొన్నారు. ఈ క్రమంలో థరూర్ తనదైన శైలిలో floccinaucinihilipilification టంగ్ ట్విస్టర్ పదాన్ని ప్రయోగించారు.

Also Read:

Air India: ఎయిర్ ఇండియా సర్వర్లు హ్యాక్.. ప్రపంచ వ్యాప్తంగా 45 లక్షల మంది డేటా చోరీ..

హీరో శర్వానంద్.. ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని ఇద్దరూ చుట్టాలే… వీరి మధ్య ఉన్న రిలేషన్ ఎంటో తెలుసా..