KRMB on RDS Project: తెలంగాణ ఫిర్యాదుపై స్పందించిన కృష్ణా నదీ యాజమాన్య బోర్డు.. రాయలసీమ ఎత్తిపోతల పనులు ఆపాలని ఏపీకి ఆదేశం

|

Jun 24, 2021 | 9:00 AM

తెలంగాణ ఫిర్యాదుపై కృష్ణా నది మేనేజ్‌మెంట్‌ బోర్డ్‌ స్పందించింది. సీడబ్ల్యూసీ అనుమతి లేకుండా ముందుకు వెళ్లకూడదని ఏపీని ఆదేశించింది.

KRMB on RDS Project: తెలంగాణ ఫిర్యాదుపై స్పందించిన కృష్ణా నదీ యాజమాన్య బోర్డు..  రాయలసీమ ఎత్తిపోతల పనులు ఆపాలని ఏపీకి ఆదేశం
శ్రీశైలానికి ఎడమ వైపు తెలంగాణ... కుడి వైపు రాయలసీమ. రెండు వైపులా ఈ కృష్ణా నీళ్లే కీలకం. రెండు ప్రాంతాలకు తాగు, సాగునీటికి శ్రీశైలమే ఆధారం. వరదలు వచ్చినప్పుడు ఏ సమస్యా ఉండదు. ఎవరికి ఎంత కావాలన్నా వాడుకోవచ్చు. నీటి ప్రవాహలు తగ్గినప్పుడే అసలు సమస్య. అదే ఇప్పుడు తెలుగు రాష్ట్రాల మధ్య అగ్గి రాజేస్తోంది.
Follow us on

Krishna River Ownership Board responds: తెలంగాణ ఫిర్యాదుపై కృష్ణా నది మేనేజ్‌మెంట్‌ బోర్డ్‌ స్పందించింది. రాయలసీమ ఎత్తిపోతల పథకం నిర్మాణం ఆపాలని తెలంగాణ ప్రభుత్వం లేఖ రాసింది. దీనిపై బోర్డ్‌ స్పందించింది. సీడబ్ల్యూసీ అనుమతి లేకుండా ముందుకు వెళ్లకూడదని ఏపీని ఆదేశించింది. దీనిపై డీపీఆర్‌ సమర్పించాలని కృష్ణా మేనేజ్‌మెంట్‌ బోర్డ్‌ సూచించింది. తెలంగాణ ప్రభుత్వం రాసిన లేఖ, ఫొటోలను దీనికి జత చేసింది బోర్డ్‌.

ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి బోర్డు లేఖ రాసింది. ఏపీ జలవనరుల శాఖ కార్యదర్శికి బోర్డు సభ్య కార్యదర్శి హరికేశ్ మీనా లేఖ రాశారు. డీపీఆర్ ఇవ్వకుండా, అత్యున్నత మండలి ఆమోదం లేకుండా రాయలసీమ ఎత్తిపోతల పనులు చేపట్టరాదన్న బోర్డు ఆదేశించింది. ప్రాజెక్టు ప్రాంతంలో బోర్డు బృందం పర్యటనకు ఏపీ సహకరించలేదన్న హరికేశ్ మీనా ఆరోపించారు. ఎన్జీటీ ఆదేశాల ఉల్లంఘన జరుగుతుందా లేదా అన్న విషయాన్ని తేల్చేందుకు బోర్డుకు ఏపీ సహకరించలేదన్నారు మీనా.

Read Also… Old Currency: పాత, చిరిగిన నోట్లను బ్యాంకుల్లో మారుస్తున్నారా? అయితే ఈ విషయాలు తెలుసుకోండి!