పరీక్షలో మార్కుల తక్కువగా వచ్చాయని కిడ్నాప్ డ్రామా ఆడిన బాలిక.. చివరికి ఏం జరిగిందంటే

పరీక్షల్లో మార్కులు తక్కువగా వచ్చాయని తల్లిదండ్రులు తిడతారనే భయంతో కూతురు వేసిన నాటకం నెట్టింటా చర్చనీయాంశమవుతోంది. వివరాల్లోకి వెళ్తే పశ్చిమ బెంగాల్‌‌లో పదో తరగతి పరీక్షలు గత శుక్రవారం విడుదలయ్యాయి. అయితే దక్షిణ కోల్‌కతాలోని బన్స్‌ద్రోణి ప్రాంతానికి చెందిన 16 ఏళ్ల బాలికకు ఆ పరీక్షల్లో 31 శాతం మార్కులు వచ్చాయి.

పరీక్షలో మార్కుల తక్కువగా వచ్చాయని కిడ్నాప్ డ్రామా ఆడిన బాలిక.. చివరికి ఏం జరిగిందంటే
Girl

Updated on: May 21, 2023 | 4:05 AM

పరీక్షల్లో మార్కులు తక్కువగా వచ్చాయని తల్లిదండ్రులు తిడతారనే భయంతో కూతురు వేసిన నాటకం నెట్టింటా చర్చనీయాంశమవుతోంది. వివరాల్లోకి వెళ్తే పశ్చిమ బెంగాల్‌‌లో పదో తరగతి పరీక్షలు గత శుక్రవారం విడుదలయ్యాయి. అయితే దక్షిణ కోల్‌కతాలోని బన్స్‌ద్రోణి ప్రాంతానికి చెందిన 16 ఏళ్ల బాలికకు ఆ పరీక్షల్లో 31 శాతం మార్కులు వచ్చాయి. తల్లిదండ్రులు తిడతారనే భయంతో ఆమె కిడ్రాప్ డ్రామా అల్లింది. తన మార్కులు చూసుకునేందుకు ఇంటర్నెట్ సెంటర్‌కు వెళ్తానని చెప్పి.. తనతో పాటు ఆరెళ్ల చెల్లెనీ కూడా తీసుకెళ్లింది. అయితే వారు చాలా సేపటి వరకు ఇంటికి తిరిగి రాలేదు. దీంతో కంగారుపడిన తల్లిదండ్రులు చివరికి పోలీసులు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆ అక్కాచెల్లిల్ల కోసం వెతకడం మొదలుపెట్టారు.

అయితే ఆ సమయంలో బాలిక తండ్రికి ఓ గుర్తు తెలియని నెంబరు నుంచి మెసెజ్ వచ్చింది. తన కూతుర్లిద్దరిని కిడ్నాప్ చేశామని.. రూ.కోటి ఇస్తేనే విడిచిపెడతామని అందులో ఉంది. పోలీసులు ఆ నెంబర్ ఆధారంగా దర్యాప్తు చేపట్టారు. చివరకు నదియా జిల్లాలోని ఓ నర్సింగ్ హోం ఎదుట బాలికను గుర్తించి కాపాడారు. అయితే వారిని విచారణ చేపట్టిన పోలీసులకు ఇదంతా ఓ డ్రామా అని తెలియడంతో ఒక్కసారిగా అవక్కయ్యారు. తమ తల్లిదండ్రులకు భయపడి తానే ఈ కిడ్నాప్‌ నాటకమాడినట్లు ఆ బాలిక ఒప్పుకుంది. తండ్రికి రూ.కోటి ఇవ్వాలని మెసేజ్‌ చేసినట్లు పేర్కొంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి