Punjab: హైవేపై అందాన్ని ఎరగావేసి దోపీడీ చేస్తోన్న సుందరి.. ఎలా పట్టుబడిందంటే

|

Nov 05, 2024 | 11:04 AM

దారి దోపిడీలను చేయడానికి ఓ యువతి తన అందాన్ని ఎరగా వేస్తోంది. అంతేకాదు ఆ యువతికి మరో ఆరుగురు సహకరిస్తున్నారు. హైవేపై వచ్చే కార్లను ఆపి వారిని నిర్జన ప్రదేశానికి తీసుకుని వెళ్తుంది. అప్పటికే అక్కడ ఉన్న ఆమె సహచరుల సహాయంతో ఆ కారు డ్రైవర్ ని దోచుకుంటారు. సినిమాని తలపిస్తున్న ఈ క్రైం పంజాబ్ లో చోటు చేసుకుంది. ఇన్నాళ్ళకు ఆ యువతి పోలీసులకు చిక్కింది.

Punjab: హైవేపై అందాన్ని ఎరగావేసి దోపీడీ చేస్తోన్న సుందరి.. ఎలా పట్టుబడిందంటే
Mohali Crime News
Follow us on

పంజాబ్‌లోని మొహాలీలో లిఫ్ట్ అడిగే నెపంతో నడిరోడ్డుపై కారు ఆపి దోచుకుంటున్న ఓ మహిళను పోలీసులు అరెస్ట్ చేశారు. హై వెళ్ళేపై వెళ్ళే కార్లను ఆపి డ్రైవర్ తో శారీరక సంబంధం అంటూ తన అందన్ని ఎర వేస్తుంది. డ్రైవర్ ఆమెను కారులో ఎక్కించుకున్న తర్వాత ఆమె అతడిని ఏకాంత ప్రదేశానికి తీసుకువెళుతుంది. అప్పటికే అక్కడ ఉండే సహచరులతో కలిసి ఆ మహిళ ఆ కారు డ్రైవర్‌ను దోచుకుంటుంది. ఈ మహిళ 20 మందికి పైగా కారు డ్రైవర్లను దారి దోపిడీ చేసినట్లు ఆరోపిస్తున్నారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నిందితురాలు కాశ్మీర్ నివాసి. ఆమె పేరు షామా ఖాన్. షామా గ్యాంగ్‌లో మరో ఆరుగురు సహచరులు ఉన్నారు. అందరినీ అరెస్టు చేశారు. నిందితులు ఇచ్చన సమాచారం మేరకు థార్, ఐఫోన్, బంగారు బ్రాస్‌లెట్ తదితర వస్తువులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పంజాబ్‌లోని గోవింద్‌గఢ్‌కు చెందిన ఓ వ్యాపారి నుంచి సదరు మహిళ ఈ వస్తువులను దోచుకుంది. మరొక బాధితుడి నుంచి I-20 కారును దోచుకున్నారు. పోలీసులు దానిని కూడా స్వాధీనం చేసుకున్నారు.

నిందితులను బటిండా నివాసి అర్ష్‌దీప్ సింగ్, జస్పాల్ సింగ్, సోహానా నివాసి విక్రమ్ సింగ్, గురుప్రీత్ సింగ్, చండీగఢ్ సెక్టార్-35లో నివాసం ఉంటున్న అంగద్జోత్ సింగ్.. అతని భాగస్వామి షామా ఖాన్‌గా గుర్తించినట్లు మొహాలీ పోలీసులు వెల్లడించారు. కశ్మీర్‌కు చెందిన నిందితురాలు షామా ఖాన్ మొహాలీలోని మాటౌర్‌లో నివసిస్తోంది. లిఫ్ట్ అడిగే సాకుతో బాటసారులను ఆపి వారిని నిర్జన ప్రదేశానికి తీసుకెళ్లి స్నేహితులకు ఫోన్ చేసేది. అప్పుడు వారందరూ కలిసి బాటసారిని కొట్టి దోచుకునేవారు.

ఇవి కూడా చదవండి

ఎలా పట్టుబడ్డారంటే..

నిందితులు అక్టోబర్ 26న ఒకసారి, నవంబర్ 3న మరొక సారి దారి దోపిడీ చేశారు. ఈ దోపిడీ విషయాన్ని బాధితులు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. రెండు ఘటనల్లో నిందితుల నుంచి థార్, ఐ-20 కారు, స్విఫ్ట్ డిజైర్, 315 బోర్ కంట్రీ మేడ్ పిస్టల్, లైవ్ కాట్రిడ్జ్‌లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసు విషయంపై డీఐజీ మాట్లాడుతూ.. నవంబర్ 3న తెల్లవారుజామున 4 గంటలకు గోవింద్‌గఢ్‌కు చెందిన వ్యాపారవేత్త దీపక్ అగర్వాల్ తన మహిళా స్నేహితురాలితో కలిసి థార్‌లో వెళ్తున్నారు. సెక్టార్-77లోని లైట్ పాయింట్ రాధా స్వామి డేరా బియాస్ దగ్గరికి రాగానే మారుతీ కారు థార్ కారు ముందు ఆగింది. అందులో నుంచి నలుగురు యువకులు దిగి గొడవకు దిగారు. ఆ గొడవని ఆపడానికి వెళ్ళిన దీపక్ అగర్వాల్ దగ్గర నుంచి థార్, ఐఫోన్, బంగారు బ్రాస్‌లెట్‌ని తీసుకుని అక్కడ నుంచి వారు పరారయ్యారు.

డ్రైవర్లను ప్రలోభపెట్టె షామా ఖాన్

ఈ ఘటనపై సోహనా పోలీసు సిబ్బంది గుర్తు తెలియని నిందితులపై కేసు నమోదు చేసింది. నిందితులపై ఇప్పటికే పలు కేసులు నమోదయ్యాయి. డీఐజీ తెలిపిన వివరాల ప్రకారం.. నిందితులు అరెస్టు చేసిన తర్వాత వారిని విచారించగా.. నిందితులు తమ సహచర మహిళ సహాయంతో ఎయిర్‌పోర్ట్ రోడ్డులో గతంలో ఐ-20 కారును దోచుకున్నట్లు వెలుగులోకి వచ్చింది. మహిళ మొదట కారు డ్రైవర్‌కు తన అందాన్ని ఎరగా వేసి నిర్జన ప్రాంతంలో ఆపింది. పథకం ప్రకారం షామా సహచరులు బాధితురాలిని చుట్టుముట్టి కారును దోచుకెళ్లారు. ఈ మేరకు సోహనా పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు.

 

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..