Kishan Reddy: పొటాష్ మైనింగ్ వైపు భారత్ అడుగులు.. కిషన్ రెడ్డి కీలక ప్రకటన

క్లిష్టమైన, వ్యూహాత్మక ఖనిజ బ్లాకుల ఐదో విడత వేలం జనవరి 28న మొదలు కాగా.. తాజాగా అది విజయవంతంగా ముగిసిందని కేంద్ర గనుల శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డి ప్రకటించారు. వేలానికి ఉంచిన 15 బ్లాకులలో 10 బ్లాకుల వేలం విజయవంతంగా ముగిసింది. ఈ 10 బ్లాకులలో గ్రాఫైట్, ఫాస్ఫరైట్, ఫాస్ఫేట్ వంటి కీలక ఖనిజాలు ఉన్నాయి.

Kishan Reddy: పొటాష్ మైనింగ్ వైపు భారత్ అడుగులు.. కిషన్ రెడ్డి కీలక ప్రకటన
Union Coal Minister G Kishan Reddy

Updated on: May 27, 2025 | 9:13 PM

ఖనిజ సంపదలో కీలకమైన మైలురాయిను విజయవంతంగా అధిగమించింది భారత ప్రభుత్వం. తొలిసారిగా పొటాష్ బ్లాక్ వేలం నిర్వహించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో భారత్ ఖనిజాల అన్వేషణ విజయవంతంగా అడుగులు వేస్తోందని కేంద్ర గనుల మంత్రిత్వ శాఖ మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. విదేశీ దిగుమతులపై ఆధారపడకుండా, స్వయం సమృద్ధిని సాధిస్తున్నామని మంత్రి తెలిపారు.

కేంద్ర గనుల శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన క్లిష్టమైన ఖనిజ బ్లాకుల ఐదో విడత వేలం విజయవంతంగా ముగిసింది. వేలానికి ఉంచిన 15 బ్లాకులలో 10 బ్లాకుల వేలం విజయవంతంగా జరిగింది. ఈ 10 బ్లాకులలో గ్రాఫైట్, ఫాస్ఫరైట్, ఫాస్ఫేట్, అరుదైన భూమి మూలకాలు(REE), వనాడియం వంటి కీలకమైన, వ్యూహాత్మక ఖనిజాలు ఉన్నాయి. మొదటిసారిగా, ఛత్తీస్‌గఢ్, కర్ణాటక, మధ్యప్రదేశ్, ఒడిశా, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్‌లలో విస్తరించి ఉన్న పొటాష్, హాలైట్ ఉన్నాయి. దీనితో, కేంద్ర ప్రభుత్వం వేలం వేసిన మొత్తం బ్లాకుల సంఖ్య 34కి చేరుకుంది.

భారత సర్కార్ తొలిసారిగా పొటాష్ బ్లాక్ వేలం నిర్వహించింది. ఇది దేశీయ పొటాష్ వనరులను వెలికితీయడంలో ఒక ప్రధాన ముందడుగుగా నిలుస్తుంది. దీంతో దేశంలో పొటాష్ మైనింగ్‌ను ఉత్ప్రేరకపరచడం, దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించడం, వ్యవసాయ రంగానికి మద్దతును బలోపేతం చేస్తుందని భావిస్తున్నారు. ఈ మైలురాయి రాజస్థాన్ రాష్ట్రంలో కీలకమైన, వ్యూహాత్మక ఖనిజ బ్లాక్ యొక్క మొట్టమొదటి విజయవంతమైన వేలాన్ని కూడా సూచిస్తుంది.

దేశంలో కీలకమైన ఖనిజాల అన్వేషణపై కూడా కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి ఆధ్వర్యంలోని గనుల మంత్రిత్వ శాఖ దృష్టి సారించింది. దేశంలో కీలక ఖనిజాలలో స్వయం సమృద్ధిని పెంపొందించడానికి ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగా కీలక ఖనిజ బ్లాకులను క్రమం తప్పకుండా వేలం వేస్తోంది. ఇప్పటివరకు వేలానికి ఉంచిన 55 కీలక ఖనిజ బ్లాకులలో 5 విడతలుగా మొత్తం 34 బ్లాకులను విజయవంతంగా వేలం పూర్తి చేశారు.

మఖ్యమైన అంశం ఏమంటే, దేశంలో కీలకమైన ఖనిజ పర్యావరణ వ్యవస్థ అభివృద్ధి కోసం నేషనల్ క్రిటికల్ మినరల్ మిషన్‌ను ప్రారంభించింది. కీలక ఖనిజాలలో స్వయం సమృద్ధిని పెంపొందించడానికి వేలంపాటలలో పరిశ్రమ వాటాదారుల విలువైన భాగస్వామ్యం, ఇతర చొరవలను మంత్రిత్వ శాఖ గుర్తించింది. కాగా, ఈ నేపధ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో భారత్ ఖనిజాల అన్వేషణ అంశంపై విజయవంతంగా అడుగులు వేస్తోందని కేంద్ర గనుల మంత్రిత్వ శాఖ మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..