AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఎంత దారుణం.! భవనం పైకప్పుకు సొంత బిడ్డను వేలాడదీసిన తల్లి.. ఆ తర్వాత..!

గుజరాత్‌లోని రాజ్‌కోట్‌లో జరిగిన ఒక దిగ్భ్రాంతికరమైన సంఘటన వెలుగులోకి వచ్చింది. సోమవారం(మే 26) సాయంత్రం 7:30 గంటల ప్రాంతంలో రాజ్‌కోట్‌లోని గోకుల్ధామ్ సొసైటీలోని ఒక భవనం పైకప్పు నుండి ఒక తల్లి తన బిడ్డ వేలాడిస్తూ కనిపించింది. ఇరుగు పొరుగు వారితో గొడవలు జరుగుతున్నాయన్న కోపంతో.. ఆ తల్లి ఈ దారుణానికి పాల్పడ్డట్లు పోలీసులు తెలిపారు.

ఎంత దారుణం.! భవనం పైకప్పుకు సొంత బిడ్డను వేలాడదీసిన తల్లి.. ఆ తర్వాత..!
Rajkot Viral News
Balaraju Goud
|

Updated on: May 27, 2025 | 7:53 PM

Share

గుజరాత్‌లో జరిగిన ఒక దిగ్భ్రాంతికరమైన సంఘటన వెలుగులోకి వచ్చింది. సోమవారం(మే 26) సాయంత్రం 7:30 గంటల ప్రాంతంలో, రాజ్‌కోట్‌లోని గోకుల్ధామ్ సొసైటీలోని ఒక భవనం పైకప్పు నుండి ఒక తల్లి తన బిడ్డ వేలాడుతూ కనిపించింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నగరంలో తీవ్ర కలకలం రేగింది. ఈ మొత్తం సంఘటన గురించి తెలిసి స్థానికులు ఆగ్రహంతో రగిలిపోతున్నారు.

వైరల్ అవుతున్న వీడియోలో కోపంతో ఉన్న తల్లి తన బిడ్డను భవనం పైకప్పు నుండి తలక్రిందులుగా వేలాడదీసింది. ఆ పిల్లవాడి తండ్రికి ఈ మొత్తం సంఘటన గురించి తెలియగానే, అతను వెంటనే బిల్డింగ్‌పైకి వెళ్లి వేలాడుతున్న పిల్లవాడిని లాగి అతని ప్రాణాలను కాపాడుకున్నాడు. అందిన సమాచారం ప్రకారం, ఆ మహిళ తన పొరుగువారితో ఏదో విషయంలో వాగ్వాదానికి దిగింది. దీంతో ఆ పిల్లవాడిని భయపెట్టడానికే ఇలా ప్రవర్తించినట్లు తెలుస్తోంది.

ఈ మహిళ కుటుంబం ఒక సంవత్సరం నుండి ఈ ఇంట్లో నివసిస్తున్నారు. వారు అద్దెకు ఉంటున్నారు. వలస వచ్చినట్లు పోలీసులు గుర్తించారు. కాగా, భార్యాభర్తల మధ్య వివాదంపై పోలీసు దర్యాప్తు చేపట్టారు. మాలవీయనగర్ పోలీసులు భార్యాభర్తల వాంగ్మూలాలను కూడా నమోదు చేశారు. ఈ సంఘటనతో పొరుగువారు కూడా షాక్ అయ్యారు. ఆ సంఘటన తర్వాత, ఇంటి యజమాని అయిన మహిళ కూడా పరిగెత్తుకుంటూ వచ్చింది. ఆ మహిళకు ఇల్లు ఖాళీ చేయమని నోటీసు ఇచ్చారు.

గొడవ భార్యాభర్తల మధ్య అయినా, పొరుగువారితో అయినా, ఆపై పిల్లవాడు తప్పుగా ప్రవర్తించినా, తల్లికి కోపం రావడం సహజం. కానీ ఈ విధంగా ఒకరి స్వంత బిడ్డ జీవితాన్ని ప్రమాదంలో పడేయడం ఎప్పటికీ సరైనది కాదు. కాగా, సంఘటన మొత్తాన్ని ఈ వీడియో వైరల్ అయిన తర్వాత, నెటిజన్లు ఆ తల్లిపై దుమ్మెత్తిపోస్తున్నారు. మరోవైపు, ఈ విషయం గురించి కెమెరా ముందు చెప్పడానికి మహిళ కుటుంబం నిరాకరించింది.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..