Viral Video: మాజీ సీఎం సిద్దరామయ్యకు ఊహించని షాక్‌ .. రూ. 2 లక్షలు విసిరికొట్టిన మహిళ

కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు చేదు అనుభవం ఎదురైంది. క్షతగాత్రులకు రూ.2 లక్షలు పరిహారం ఇవ్వగా ఓ ముస్లిం మహిళ.. ఆ డబ్బును ఆయన ఎస్కార్ట్​పైకి విసిరేసింది. పూర్తి వివరాలు తెలుసుకుందాం పదండి.

Viral Video: మాజీ సీఎం సిద్దరామయ్యకు ఊహించని షాక్‌ .. రూ. 2 లక్షలు విసిరికొట్టిన మహిళ
Kerur Violence

Updated on: Jul 15, 2022 | 5:04 PM

Karnataka:  కర్నాటక మాజీ ముఖ్యమంత్రి సిద్దరామయ్య(Former CM Siddaramaiah )కు ఊహించని షాక్‌ తగిలింది. కెరూర్‌ అల్లర్లలో గాయపడినవారికి సిద్దరామయ్య సాయం చేస్తుండగా ఒక మహిళ ఆగ్రహం వ్యక్తం చేసింది. మీరిచ్చే డబ్బులు అవసరం లేదంటూ విసిరికొట్టింది. వివరాల్లోకి వెళ్తే.. కెరూర్ ఘటనలో గాయపడినవారికి పరామర్శించేందుకు ఆయన బాగల్​కోటేలోని హాస్పిటల్‌కు వెళ్లారు. అక్కడ గాయపడ్డ వ్యక్తి  ప్యామిలీకి రూ.2 లక్షల నష్టపరిహారాన్ని ఇచ్చి ఆయన కారు ఎక్కుతుండగా ఓ ముస్లిం మహిళ ఎస్కార్ట్ వాహనంపైకి ఆ డబ్బులను విసిరేసింది. ఆ సమయంలో సదరు మహిళ ఉద్వేగంతో కనిపించింది.  ఎన్నికల సమయంలో మాత్రమే నాయకులు ఓట్లు అడిగేందుకు వస్తారు.. ఇప్పుడు సమస్యలేవీ పట్టించుకోరంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. హిందువులైనా, ముస్లింలైనా అందర్ని సమానంగా చూడాలంటూ వాపోయింది. రాజకీయ నాయకుల ఓదార్పు అవసరం లేదని , ప్రశాంతంగా ఉండనివ్వాలని ఆ మహిళ నినాదాలు చేసింది.  ఏ తప్పు చేయకపోయినా.. కారణం లేకుండా తమ వారిపై దాడి చేశారని బోరుమంది.  గాయపడ్డ వారు ఏడాది పాటు రెస్ట్ తీసుకోవాలని.. డబ్బు తమ సమస్యకు పరిష్కారం కాదని పేర్కొంది. భిక్షాటన చేసి అయినా తన కుటుంబాన్ని పోషించేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపింది.  కెరూర్​లో ఈవ్ టీజింగ్ ఘటనపై స్థానికంగా తీవ్ర ఉద్రిక్తతలు తలెత్తాయి. ఇరువర్గాల మధ్య ఘర్షనలు చెలరేగాయి. మార్కెట్లో దుకాణాలను , వాహనాలు తగులబెట్టారు.  ఆరోపణలు ఎదుర్కొంటున్న ముగ్గురిని కత్తితో పొడిచారు. ఈ ఘటనలో ఇరువర్గాలకు సంబంధించిన 18 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి