Lock Down: లాక్‌డౌన్‌నే ఛాన్స్‌గా తీసుకున్న దొంగ.. ఏకంగా బస్సునే దొంగిలించాడు.. చివరికి ఏం జరిగిందంటే…

| Edited By: Janardhan Veluru

May 11, 2021 | 11:32 AM

Lock Down: రాష్ట్ర వ్యాప్తంగా లాక్‌డౌన్ ఆంక్షలు కొనసాగుతున్నాయి. మరోవైపు కరోనా దెబ్బతో ఎవరూ బయటకు వెళ్లే పరిస్థితి లేదు.

Lock Down: లాక్‌డౌన్‌నే ఛాన్స్‌గా తీసుకున్న దొంగ.. ఏకంగా బస్సునే దొంగిలించాడు.. చివరికి ఏం జరిగిందంటే...
Follow us on

Lock Down: రాష్ట్ర వ్యాప్తంగా లాక్‌డౌన్ ఆంక్షలు కొనసాగుతున్నాయి. మరోవైపు కరోనా దెబ్బతో ఎవరూ బయటకు వెళ్లే పరిస్థితి లేదు. రోడ్లు, వీధులు అన్నీ నిర్మానుష్యంగా ఉన్నాయి. ఇదే అదునుగా భావించిన ఓ యువకుడు బస్సుకే ఎసరు పెట్టాడు. ఎవరూ లేని సమయం చూసి ఓ ప్రైవేటు బస్సును దొంగలించాడు. దాదాపు నాలుగు జిల్లాలు ప్రయాణించి చివరకు పోలీసులకు పట్టుబడ్డాడు. ఈ ఘటన కేరళలోని కొట్టాయం జిల్లా కుమారకోం లో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కోజికోడ్‌లోని కుట్టియాడీకి చెందిన దీనూప్(30).. శినవారం రాత్రి 7 గంటల సమయంలో కుట్టియాడి కొత్త బస్ స్టాండ్‌ సమీపంలో నిలిపిన పిపి ట్రావెల్స్ బస్సును దొంగిలించాడు. కోజికోడ్ జిల్లా నుంచి మలప్పురం, త్రిస్సూర్, ఎర్నాకుళం, వైకోమ్ గుండా కుమారకోం వెళ్లాడు.

అయితే, కుమారకోం వద్ద పోలీసులు బస్సును ఆపి తనిఖీ చేశారు. వలస కార్మికులను తీసుకువచ్చేందుకు వెళ్తున్నానని దినూప్ చెప్పాడు. అయితే, ధ్రువపత్రాలు చూపాలని కోరగా.. సరైన సమాధానం చెప్పలేదు. దాంతో పోలీసులు తమ స్టైల్‌లో విచారించగా.. అసలు విషయం తెలిసింది. దినూప్.. సదరు బస్సును దొంగిలించి తీసుకువచ్చినట్లు నిర్ధారించుకున్నారు. కాగా నాలుగు జిల్లాలు దాటి వచ్చిన దినూప్.. ప్రతీ చెక్ పోస్ట్ వద్ద వలస కూలీలను తీసుకువచ్చేందుకు వెళ్తున్నట్లుగానే చెప్పినట్లు పోలీసులు తెలుసుకున్నారు. అయితే, ఈ దొంగిలించిన బస్సును దినూప్.. స్క్రాప్‌లా చేసి అమ్మివేయాలని ప్లాన్ చేసినట్లు పోలీసులు గుర్తించారు. బస్సు దొంగిలించినందుకు, కోవిడ్ నిబంధనలను ఉల్లంఘించినందుకు దినూప్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. అతన్ని అదుపులోకి తీసుకుని జైలుకు తరలించారు.

Also read:

Cyber Crime: మందు బాబును బుక్ చేయబోయి అడ్డంగా బుక్కైన సైబర్ నేరగాళ్లు.. నిమిషాల గ్యాప్‌లో షాకింగ్ ట్విస్ట్ ఇచ్చిన పోలీసులు..

కాంగ్రెస్ అధ్యక్ష పదవి ఎన్నికకు ‘అడ్డుపడుతున్న కోవిడ్’, మూడు సార్లు వాయిదా , సోనియా దీర్ఘ కాల అధినేత్రి అవుతారా ?

BSNL Offers: బిఎస్ఎన్ఎల్ అదిరిపోయే ఆఫర్లు.. కేవలం 100 రూపాయలతో మూడు నెలల పాటు..