JP Nadda: ‘అవును ఆ పని చేసినందుకుమాకు గర్వంగా ఉంది’.. శశిథరూర్‌ వ్యాఖ్యలపై నడ్డా కౌంటర్‌

ఈ క్రమంలోనే కాంగ్రెస్‌ సీనియర్ నాయకులు శశి థరూర్‌ బీజేపీ పార్టీపై సెటైర్లు వేశారు. ఈసారి కేరళలో మెజారిటీ సీట్లు సాధించడమే లక్ష్యంగా బీజేపీ అడుగులు వేస్తోంది. తిరువనంతపురం పార్లమెంట్‌ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో దిగిన శశిథరూర్‌ బీజేపీ కేరళలో ఖాతా తెరవదని, బీజేపీ కేవలం బ్యాంక్‌ అకౌంట్‌ను మాత్రమే ఓపెన్‌ చేస్తుందని..

JP Nadda: అవును ఆ పని చేసినందుకుమాకు గర్వంగా ఉంది.. శశిథరూర్‌ వ్యాఖ్యలపై నడ్డా కౌంటర్‌
Jp Nadda

Updated on: Apr 23, 2024 | 10:18 AM

సార్వత్రిక ఎన్నికలు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. విజయవంతంగా తొలిదశ ఎన్నికలు పూర్తయ్యాయి. ఇదిలా ఉంటే దేశవ్యాప్తంగా ఎన్నికల వేడి రాజుకుంది. ఎన్నికల వేళ పార్టీల నడుమ మాటల యుద్ధం పెరుగుతోంది. ముఖ్యంగా ఈసారిఎలాగైనా అధికారంలోకి రావాలని ప్రయత్నిస్తున్న కాంగ్రెస్‌ పార్టీ, మూడోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని చూస్తున్న బీజేపీల మధ్య ఓ రేంజ్‌లో మాటల యుద్ధం నడుస్తోంది. రెండు పార్టీలకు చెందిన ప్రముఖ నాయకులు ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకుంటున్నారు.

ఈ క్రమంలోనే కాంగ్రెస్‌ సీనియర్ నాయకులు శశి థరూర్‌ బీజేపీ పార్టీపై సెటైర్లు వేశారు. ఈసారి కేరళలో మెజారిటీ సీట్లు సాధించడమే లక్ష్యంగా బీజేపీ అడుగులు వేస్తోంది. తిరువనంతపురం పార్లమెంట్‌ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో దిగిన శశిథరూర్‌ బీజేపీ కేరళలో ఖాతా తెరవదని, బీజేపీ కేవలం బ్యాంక్‌ అకౌంట్‌ను మాత్రమే ఓపెన్‌ చేస్తుందని సెటైర్లు వేశారు. అయితే శశిథరూర్‌పై చేసిన వ్యాఖ్యలపై బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా తనదైన శైలిలో స్పందించారు.

ట్విట్టర్‌ వేదికగా స్పందించిన నడ్డా.. అవమానించడం, అహంకారం ఇది కాంగ్రెస్‌ లక్షణం. అవును మేం పేదల కోసం బ్యాంకు ఖాతాలు తెరిచినందుకు మేం గర్వంగా ఉన్నాము. మా ప్రభుత్వం దేశంలోని పేదలందరికీ బ్యాంకు అకౌంట్‌లను ఓపెన్ చేసింది. కాంగ్రెస్‌ ఎప్పుడూ ఇలాంటి విషయాలు గురించి ఆలోచించలేదు, కేవలం ఓటు బ్యాంకు గురించే ఆలోచించింద కాబట్టే ఇలాంటి విషయాలను పట్టించుకోలేదు. ఇలాంటి వారిని కేరళ ప్రజలు ఈసారి ఓడించనున్నారు’ అంటూ రాసుకొచ్చారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..