Social Media: ఆన్‌లైన్‌లో పరిచయం.. ఓ విద్యార్ధిని నిండు జీవితం బలి! అసలేం జరిగిందంటే..

|

Jan 30, 2024 | 9:24 AM

ఓ యువకుడి వేధింపులకు 16 ఏళ్ల విద్యార్థిని బలైపోయింది. సోషల్ మీడియాలై మొదలైన వీరి పరిచయం క్రమంగా వేధింపులకు దారి తీసింది. దీంతో విషయం తాగి విద్యార్ధిని బలవన్మరణానికి పాల్పడింది. ఈ సంఘటన కేరళలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కేరళలోని బడియడ్కకు చెందిన హైస్కూల్‌ విద్యార్థిని (16) గత మంగళవారం తన ఇంట్లో విషయం సేవించి అపస్మారక స్థితిలోకి వెళ్లింది. గమనించిన కుటుంబ సభ్యులు..

Social Media: ఆన్‌లైన్‌లో పరిచయం.. ఓ విద్యార్ధిని నిండు జీవితం బలి! అసలేం జరిగిందంటే..
Kerala Teenage Girl Ends Life
Follow us on

కాసరగోడ్‌, జనవరి 30: ఓ యువకుడి వేధింపులకు 16 ఏళ్ల విద్యార్థిని బలైపోయింది. సోషల్ మీడియాలై మొదలైన వీరి పరిచయం క్రమంగా వేధింపులకు దారి తీసింది. దీంతో విషయం తాగి విద్యార్ధిని బలవన్మరణానికి పాల్పడింది. ఈ సంఘటన కేరళలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కేరళలోని బడియడ్కకు చెందిన హైస్కూల్‌ విద్యార్థిని (16) గత మంగళవారం తన ఇంట్లో విషయం సేవించి అపస్మారక స్థితిలోకి వెళ్లింది. గమనించిన కుటుంబ సభ్యులు హుటాహుటిన బెంగుళూరులోని ఓ ఆసుపత్రికి తరలించారు. అక్కడ ఆమె ఆరోగ్యం మెరుగుపడటక పోవడంతో అక్కడి నుంచి మంగళూరులోని మరో ఆస్పత్రికి తరలించారు.

అక్కడ 6 రోజుల పాటు మృత్యువుతో పోరాడి సోమవారం తెల్లవారుజామున 2 గంటల ప్రాంతంలో బాలిక ప్రాణాలు విడిచింది. పోలీసులు బాలిక మృతదేహానికి పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోస్టుమార్టం అనందరం మృతదేహాన్ని కుటుంబసభ్యులకు అప్పగించారు. సోషల్‌ మీడియాలో పరిచయమైన అన్వర్‌ (24) అనే యువకుడి వల్లనే తన కూతురు విషయం తాగిందని బాలిక బంధువులు ఆరోపించారు. అన్వర్‌ తరచూ పాఠశాలకు వెళ్లేదారిలో బాలిక వెంటపడి వేధింపులకు గురిచేసేవాడని, వేధింపులు తాళలేక ఆత్మహత్య చేసుకున్నట్లు బాలిక తండ్రి ఆరోపించారు. తన కుమార్తె ఫోన్‌లో మాట్లాడుతున్నట్లు గుర్తించిన తండ్రి, అన్వర్‌కు పలుమార్లు వార్నింగ్‌ ఇవ్వడమే కాకుండా కూతురి ఫోన్‌లో అతడి మొబైల్‌ నంబర్‌నూ బ్లాక్‌ చేశామని పేర్కొన్నారు.

దీంతో మరింత రెచ్చిపోయిన అన్వర్‌ అప్పటి నుంచి తన కుమార్తె స్కూల్‌కు వెళ్తున్న మార్గంలో అడ్డగించి వేధిస్తుండేవాడని తెలిపారు. అంతేకాకుండా తమ కుటుంబంలో జరగాల్సిన ఓ పెళ్లిని కూడా అడ్డుకున్నాడని, తనకు హాని తలపెడతానని హెచ్చరించాడని బాలిక తండ్రి ఫిర్యాదులో పేర్కొన్నారు. అతడిని పలుమార్లు హెచ్చరించినా వినలేదని, గతంలో అతడిపై పోలీసులకు ఫిర్యాదు కూడా చేశామన్నారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడితో పాటు మరో యువకుడిని బెంగళూరులో అరెస్టు చేసినట్లు కుంబ్లా పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తు ప్రారంభించామని పోలీసులు తెలిపారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.