Pinarayi Vijayan: కేరళ ముఖ్యమంత్రిపై అనుచిత వ్యాఖ్యలు.. సచివాలయ ఉద్యోగిపై సస్పెన్షన్‌ వేటు..

కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ (Pinarayi Vijayan) పై ఆ రాష్ట్ర సచివాలయ ఉద్యోగి ఒకరు సోషల్‌ మీడియా వేదికగా అనుచిత వ్యాఖ్యలు చేశారు.

Pinarayi Vijayan: కేరళ ముఖ్యమంత్రిపై అనుచిత వ్యాఖ్యలు.. సచివాలయ ఉద్యోగిపై సస్పెన్షన్‌ వేటు..
Pinarayi Vijayan

Updated on: Feb 06, 2022 | 1:01 PM

కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ (Pinarayi Vijayan) పై ఆ రాష్ట్ర సచివాలయ ఉద్యోగి ఒకరు సోషల్‌ మీడియా వేదికగా అనుచిత వ్యాఖ్యలు చేశారు. దీనికి స్పందించిన సీఎం కార్యాలయ(CMO)  సిబ్బంది సదరు ఉద్యోగిని విధుల నుంచి తొలగిస్తూ ఉత్వర్వులు జారీ చేశారు. పూర్తి వివరాల్లోకి వెళితే.. కేరళ (Kerala)  రాష్ట్రంలో పెట్టుబడుల ఆకర్షణే ప్రధాన లక్ష్యంగా ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ ఇటీవల విదేశాల్లో పర్యటించారు. అందులో భాగంగా కొన్ని రోజుల క్రితం దుబాయ్‌ పర్యటనకు వెళ్లారు. అక్కడి విదేశీ వాణిజ్య మంత్రిత్వ శాఖ, మానవ వనరుల అభివృద్ధి శాఖ అధికారులతో సమావేశమయ్యారు. తమ రాష్ట్రంలో పరిశ్రమల స్థాపనకు ఉన్న అవకాశాలను వివరించారు.

అనంతరం తన దుబాయ్‌ పర్యటనకు సంబంధించి అక్కడి మంత్రులు, అధికారులతో కలిసి దిగిన ఫొటోలను తన ట్విట్టర్‌ ఖాతాల్లో షేర్‌ చేశారు విజయన్‌. ఇందులో సీఎం బ్లాక్‌ కలర్‌ సూట్‌ ధరించి ఉన్నారు. కాగా ఏ. మణికట్టన్‌ అనే సచివాలయ ఉద్యోగి సీఎం ఫొటోలను తన వాట్సాప్ గ్రూపుల్లో షేర్ చేశాడు. దీనికి ‘గూండాలు రకరకాల దుస్తులు, వేర్వేరు వేషధారణలో ఉన్నారు’ అంటూ అభ్యంతకరంగా కామెంట్లు పెట్టాడు. ఈ విషయాన్నీ కొందరు సచివాలయ అధికారులు సీఎం కార్యాలయం దృష్టికి తీసుకెళ్లారు. దీనికి స్పందించిన సీఎంవో సిబ్బంది మణికుట్టన్ ను విధుల నుంచి తప్పించారు. కాగా మణికుట్టన్ కాంగ్రెస్ అనుకూల సచివాలయ ఉద్యోగుల సంఘంలో సభ్యుడిగా ఉన్నాడు.

Also Read:Lata Mangeshkar-Durrani: లతాతో పిచ్చి చేష్టలు చేసి తగిన ఫలితం అనుభవించిన గాయకుడు దుఱ్రాని

Lata Mangeshkar: లతాజీ మరణానికి కారణమిదే.. ఆమెకు చికిత్సనందించిన డాక్టర్‌ ఏమన్నారంటే..

Coronavirus: కరోనా నుంచి ఊరట.. దేశంలో తగ్గుతోన్న కొత్త కేసులు, మరణాలు.. నిన్న ఎంతమంది వైరస్‌ బారిన పడ్డారంటే..

 

 

Follow Us