Nipah Virus: నిఫా వైరస్ కలకలం.. పాఠశాలలు, కార్యాలయాలు మూసివేత

|

Sep 13, 2023 | 1:32 PM

కేరళలో నిఫా వైరస్ మరోసారి వెలుగుచూసిన సంగతి తెలిసిందే. అయితే ఈ వైరస్ సోకడంతో ఇప్పటికే కోజికోడ్ జిల్లాలోని ఇద్దరు వ్యక్తులు ప్రాణాలు కోల్పోవడం కలకలం రేపింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం వెంటనే అప్రమత్తమైంది. జిల్లా వ్యాప్తంగా హెల్త్ అలర్ట్‌ను జారీ చేసింది. అలాగే మరణించిన వారితో సన్నిహితంగా ఉన్న వారితో పాటు మరో 130 మంది బ్లడ్ సాంపిల్స్‌ను సేకరించింది. అనంతరం వాటిని పుణెలోని వైరాలజీ ల్యాబ్‌కు పంపించింది. అలాగే కోజికోడ్‌లో ప్రత్యేకంగా ఐసోలేషన్ వార్డును ఏర్పాటు చేసింది.

Nipah Virus: నిఫా వైరస్ కలకలం.. పాఠశాలలు, కార్యాలయాలు మూసివేత
Kerala
Follow us on

కేరళలో నిఫా వైరస్ మరోసారి వెలుగుచూసిన సంగతి తెలిసిందే. అయితే ఈ వైరస్ సోకడంతో ఇప్పటికే కోజికోడ్ జిల్లాలోని ఇద్దరు వ్యక్తులు ప్రాణాలు కోల్పోవడం కలకలం రేపింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం వెంటనే అప్రమత్తమైంది. జిల్లా వ్యాప్తంగా హెల్త్ అలర్ట్‌ను జారీ చేసింది. అలాగే మరణించిన వారితో సన్నిహితంగా ఉన్న వారితో పాటు మరో 130 మంది బ్లడ్ సాంపిల్స్‌ను సేకరించింది. అనంతరం వాటిని పుణెలోని వైరాలజీ ల్యాబ్‌కు పంపించింది. అలాగే కోజికోడ్‌లో ప్రత్యేకంగా ఐసోలేషన్ వార్డును ఏర్పాటు చేసింది. ఇదిలా ఉండగా మరోవైపు కోజికోడ్ జిల్లాలోని ఏడు గ్రామ పంచాయతీలైన.. తిరువళ్లూర్‌, కుట్టియేడి, కయక్కోడి, విల్లయపల్లి, కవిలుంపర, అయన్‌చేరి, మరుతోంకర ప్రాంతాలను రాష్ట్ర ప్రభుత్వం కంటైన్‌మెంట్ జోన్లుగా ప్రకటించేంది. ఈ గ్రామాల్లోని ప్రభుత్వ, ప్రైవేటు స్కూల్లను, కార్యాలయాలను అధికారులు మూసివేశారు.

ఆయా ప్రాంతాల్లో నిఫా వైరస్ ఇన్‌ఫెక్షన్ వ్యాప్తి చెందకుండా ఉండేందుకు పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నారు. అంతేకాదు నిఫా వైరస్ వెలుగు చూసిన నేపథ్యంలో పుణెలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ (ఎన్‌ఐవి) బృందాలు ఇప్పటికే కేరళకు చేరుకున్నాయి. అయితే ఇప్పుడు కోడికోడ్ వైద్య కళాశాలలో మొబైల్ ల్యాబ్‌ను కూడా ఏర్పాటు చేశారు. ప్రస్తుతం అక్కడ నిఫా పరీక్షలు చేస్తున్నారు వైద్యులు. ఇదిలా ఉండగా సౌత్ ఇండియాలో తొలిసారిగా నిఫా వైరస్ కేసు మే 19, 2018లో కోజికోడ్ జిల్లాలో వెలుగుచూసింది. అయితే ఈ వైరస్ వల్ల 2018, 2021 సంవత్సరంలో మరణాలు కూడా నమోదయ్యాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం చూసుకుంటే.. జంతువుల నుంచి ప్రజలకు ఈ వైరస్ వ్యాపిస్తోంది. అంతేకాదు.. కలుషితమైన ఆహారం నుంచి అలాగే ఈ వ్యాధి బారినపడిన వారి నుంచి ఇది నేరుగా ఇతర వ్యక్తికి కూడా సంక్రమిస్తుంది.

అంతేకాదు తుంపర్లు, ముక్కు, నోటి నుంచే వంచ్చే ద్రవాల వల్ల కూడా సోకుతుంది ఈ నిఫా వైరస్. ఇక్కడ మరో విషయం ఏంటంటే ఈ వైరస్ లక్షణాలు వెంటనే బయట పడవు. అయితే ఈ వైరస్ కొంతమందిలో మెదడు వాపు వచ్చేందుకు కారణమవుతుంది. ఒకసారి ఈ వైరస్ శరీరంలోకి ప్రవేశించినట్లేతే సాధారణంగా తొమ్మిది రోజులు లేదా 4 నుంచి 15 రోజుల్లో లక్షణాలు కనిపిస్తాయి. అలాగే ఈ వైరస్ సోకిన వారికి జ్వరం, తలనొప్పి, దగ్గు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది లాంటి అనేక సమస్యలు వస్తున్నాయి. అయితే వైరస్ సోకిన వారిలో దాదాపుగా 75 శాతం మంగి మరణించే అవకాశం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ఈ చికిత్సకు ప్రత్యేకమైన చికిత్స, ఔషధాలు లేవు. అందుకోసమే మాస్కులు ధరించాలని వైద్య నిపుణులు చెతున్నారు. అలాగే చేతులు శుభ్రంగా కడుక్కోవడం, పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని సూచనలు చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..