Heavy Rains in Kerala: కేరళలో భారీ వర్షాలు ఏడు జిల్లాలకు రెడ్ అలెర్ట్.. పర్యాటక ప్రదేశాలకు వెళ్ల వద్దని సూచన

|

Oct 16, 2021 | 3:16 PM

Kerala Red Alert: అరేబియా సముద్రంపై ఏర్పడిన అల్పపీడనం వలన కేరళలో భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. రాష్ట్ర రాజధాని..

Heavy Rains in Kerala: కేరళలో భారీ వర్షాలు ఏడు జిల్లాలకు రెడ్ అలెర్ట్.. పర్యాటక ప్రదేశాలకు వెళ్ల వద్దని సూచన
Kerala Rains
Follow us on

Kerala Red Alert: అరేబియా సముద్రంపై ఏర్పడిన అల్పపీడనం వలన కేరళలో భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. రాష్ట్ర రాజధాని తిరువనంతపురం, కొల్లాం, అలపుజ, పాలక్కాడ్, మలప్పురం, కోజికోడ్,  వయనాడ్ జిల్లాలతో సహా  ఏడు జిల్లాల్లో రెడ్ ఎలెర్ట్ ను జారీ చేసింది.  తిరువనంతపురంలో భారీ వర్షాలు కురుస్తున్నాయనై.. నదులు పొంగి ప్రవహిస్తున్నాయి కనుక పర్యాటక ప్రదేశాలను సందర్శించడానికి నదుల వద్దకు  వెళ్లవద్దని జిల్లా కలెక్టర్ నవజ్యోత్ ఖోసా ప్రజలకు సూచించారు. జిల్లాలోని నెయ్యార్ డ్యాం , అరువుక్కర డ్యామ్ నీటి మట్టం పెరుగుతుందని తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశాలను జారీ చేశారు.  మరోవైపు కొల్లాం , కొట్టాయం జిల్లాలతో సహా అనేక ప్రదేశాలలో రహదారులు నదులను తలపిస్తున్నాయి. భారీ వర్షాలకు కుట్టనాడ్ ప్రాంతంలో జనజీవితం అస్తవ్యస్తమయ్యింది. కుట్టనాడ్ ను కేరళ  ‘రైస్ బౌల్’ అని పిలుస్తారు. కొట్టాయం , కొండ జిల్లా ఇడుక్కిలో  వర్షాలు కురుస్తున్నాయి. దీంతో లోతట్టు ప్రాంతాల ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్ళమని అధికారులు సూచిస్తున్నారు.  సముద్రంలో చేపల వేటకు వెళ్లవద్దని మత్య్సకారులను హెచ్చరించారు.   రాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాలకు జరిగిన నష్టాన్ని అంచనా వేయడానికి  రెవెన్యూ మంత్రి కె రాజన్ ఆన్‌లైన్ ద్వారా జిల్లా కలెక్టర్లతో సమావేశం కానున్నారు.

మీనాచల్ , మణిమాలతో సహా అనేక నదులలో నీటి మట్టం క్రమంగా పెరుగుతోంది. అరేబియా సముద్రంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా రాష్ట్రంలో విస్తారంగా భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించినట్లు ముఖ్యమంత్రి పినరయి విజయన్ తెలిపారు. రానున్న 24 గంటల్లో రాష్ట్ర ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని  విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ఇప్పటికే కొన్ని నదులలో నీటి మట్టం పెరుగుతుందని,  ఇక  ఆనకట్టలు పొంగిపొర్లుతాయని అంచనా వేస్తున్నారు. దీంతో పరివాహక ప్రాంతాల్లో నివసించే ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలని.. అత్యవసర సహాయం అందించడానికి అధికారుల సిద్ధంగా ఉండాలని సీఎం చెప్పారు.

Also Read:  శాపం నుంచి విముక్తి కోసం.. గత 200 ఏళ్లుగా పురుషులు చీరలు ధరించిన గర్భా. ఎక్కడంటే..