Kerala Boat Festival: పాత పాటలతో హుషారుగా దూసుకెళ్తుంటే ఆ రిథమ్‌ వేరబ్బా..! కలర్‌ఫుల్‌గా పడవల పండుగ

| Edited By: Ram Naramaneni

Sep 29, 2024 | 10:00 PM

కష్టాలు వస్తాయి.. పోతాయి. కానీ కల్చర్‌ విషయం మాత్రం తగ్గేదే లేదు. సంస్కృతిని కాపాడుకోవడంలో కేరళ మరోసారి తన మార్క్‌ చాటుకుంది. ఇటీవలే ఓనం.. తాజాగా పడవ పోటీల పండుగను కనులపండవుగా జరిపారు.

Kerala Boat Festival: పాత పాటలతో హుషారుగా దూసుకెళ్తుంటే ఆ రిథమ్‌ వేరబ్బా..! కలర్‌ఫుల్‌గా పడవల పండుగ
Boat Race In Punnamada Lake
Follow us on

కష్టాలు వస్తాయి.. పోతాయి. కానీ కల్చర్‌ విషయం మాత్రం తగ్గేదే లేదు. సంస్కృతిని కాపాడుకోవడంలో కేరళ మరోసారి తన మార్క్‌ చాటుకుంది. ఇటీవలే ఓనం.. తాజాగా పడవ పోటీల పండుగను కనులపండవుగా జరిపారు. 70వ నెహ్రూ బోట్‌ ట్రోఫి రేసింగ్‌ ఈసారి కూడా అదిరింది. గాల్లో తేలిపోయినట్టు.. అనే ఫీల్‌ రావాలంటే గాడ్స్‌ ఓన్‌ కంట్రీ కేరళ ఓనం సంబరాలను చూడాలి. ఆ తరువాత జరిగే బోట్‌ ఫెస్టివల్‌ను చూడాలి. ఎప్పట్లానే ఈసారి కూడా అలప్పుజా జిల్లా పున్నమడ సరస్సులో పడవ పోటీల పండగ కనువిందు చేసింది. పాము పడవల పోటీ గురించి చెప్పతరమా..చూసి వాహ్వా అనాల్సిందే..

70 నెహ్రూ బోట్‌ ట్రోఫీనికి కైవసం చేసుకునేందుకు 9 విభాగాల్లో 74 బోట్లు రేసులోకి దిగాయి. ప్రతి దృశ్యం అద్భుతమే. ఇక బోటు ఫెస్టివల్‌కే హైలైట్‌ స్నేక్‌ బోట్‌ రేసు. అచ్చం పాములాగా వుండే పడవలు.. వంద అడుగుల పొడవైన పడవ..అందులో వంద మంది సెయిలర్స్‌.. పరుగెత్తించు నా నావ అంటూ పాత పాటలతో హుషారుగా దూసుకెళ్తుంటే ఆ రిథమ్‌ గురించి ఏం చెప్పగలం… అల్టిమేట్‌ అంతే!

ఈసారి ట్రోఫీ కోసం 19 స్నేక్‌ బోట్స్ బరిలోకి దిగాయి. ఆహ్లాదకరమైన వాతావరణం.. సరస్సులో బోట్లు.. ఒడ్డున ప్రేక్షకుల సందడి… అలలకు ధీటుగా అభిమానుల ఆవాజ్‌…. జలతారల్లా బోట్ల దూకుడు ..ఎటు చూడూ సందడే సందడి. పోటీలో గెలవడం మాత్రమే కాదు లక్ష్యం. తమ సంస్కృతిని చాటి చెప్పడమే బోటు ఫెస్టివల్‌ ఉద్దేశం అంటారు కేరళ వాసులు. అన్ని కష్టాలు..నష్టాలు..ప్రతి బంధకాలు వచ్చినా సరే సంస్కృతి విషయంలో తగ్గేదే ఉండదు. ఎప్పట్లానే ఈసారి కూడా అదే స్పిరిట్‌తో పడవల పండుగ కనులపండువగా సాగింది.

ఉత్సాహాంగా జరిగే ఈ ఉత్సవానికి ఎంతో చారిత్రక నేపథ్యం వుంది. శాంతి సందేశం దాగుంది. అప్పట్లో ఇద్దరు రాజులు యుద్ధానికి బదులు పడవ పోటీలకు సిద్ధమయ్యారట. అలా అప్పటి నుంచి ప్రతియేటా బోట్‌ ఫెస్టివల్‌ ఓ ఆచారంగా సంప్రదాయంగా కొనసాగుతూ వస్తోంది. తొలి ప్రధాని జవహర్‌ లాల్‌ నెహ్రూ ఈ ప్రాంతాన్ని పర్యటించి ముగ్గుడయ్యారట. పాములాంటి పడవ ఆయన్ని బాగా ఆకట్టుకుంది. వెండితో చేసిన పాము పడవను కానుకగా ఇచ్చారు. అందుకు కృతజ్ఞతగా పడవ పోటీలకు నెహ్రూ ట్రోఫిగా నామకరం చేశారు.

నిజానికి 70వ నెహ్రూ బోట్‌ రేస్‌ ట్రోఫీని గత నెల 10న నిర్వహించాల్సి వుంది. కానీ వరద విధ్వంసం.. మంకీ పాక్స్‌ కలకలం నేపథ్యంలో వాయిదా వేశారు. శనివారం సందడిగా సాగిన పడవల పోటీల్లో పలత్తూర్తి జట్టు …..70వ నెహ్రూ ట్రోఫితో పాటు జలరాజటైటిల్‌ను కైవసం చేసుకుంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..