కేరళ రాజకీయాలను కుదిపేస్తున్న లైఫ్‌ మిషన్‌ స్కామ్‌.. మాజీ ప్రిన్సిపల్‌ సెక్రటరీ అరెస్ట్‌..

|

Feb 15, 2023 | 9:06 PM

Life Mission case: లైఫ్‌ మిషన్‌ స్కామ్‌ కేసులో కేరళ మాజీ ప్రిన్సిపల్‌ సెక్రటరీ ఎం శివశంకర్‌ను ఈడీ అరెస్ట్‌ చేసింది. త్రిస్సూర్‌ లోని వడకంచేరి ప్రాంతంలో 140 కుటుంబాలను ఇళ్ల నిర్మాణం కోసం విడుదల చేసిన నిధులను

కేరళ రాజకీయాలను కుదిపేస్తున్న లైఫ్‌ మిషన్‌ స్కామ్‌.. మాజీ ప్రిన్సిపల్‌ సెక్రటరీ అరెస్ట్‌..
Kerala Life Mission case
Follow us on

Life Mission case: లైఫ్‌ మిషన్‌ స్కామ్‌ కేసులో కేరళ మాజీ ప్రిన్సిపల్‌ సెక్రటరీ ఎం శివశంకర్‌ను ఈడీ అరెస్ట్‌ చేసింది. త్రిస్సూర్‌ లోని వడకంచేరి ప్రాంతంలో 140 కుటుంబాలను ఇళ్ల నిర్మాణం కోసం విడుదల చేసిన నిధులను గోల్‌మాల్‌ చేసినట్టు ఆరోపణలు రావడంతో శివశంకర్‌ను మంగళవారం అరెస్ట్‌ చేసిన ఈడీ కొచ్చి పీఎంఎల్‌ఏ కోర్టులో ప్రవేశపెట్టింది.

శివశంకర్‌ సీఎం విజయన్‌కు అత్యంత సన్నిహితుడని, సీఎం కార్యాలయం పర్యవేక్షణలోనే ఈ స్కాం జరిగిందని కేరళ విపక్షాలు ఆరోపిస్తున్నాయి. దీనికి వామపక్ష ప్రభుత్వం వివరణ ఇవ్వాలంటూ కాంగ్రెస్, బీజేపీ డిమాండ్ చేస్తున్నాయి. గోల్డ్‌ స్మగ్లింగ్‌ స్కామ్‌తో పాటు లైఫ్‌ మిషన్‌ స్కామ్‌లో శివశంకర్‌ ప్రధాన పాత్ర పోషించారని ఆరోపిస్తున్నారు.

యూఏఈ ప్రభుత్వం లైఫ్‌ మిషన్‌ స్కీము కింద వరద బాధితులకు ఇళ్ల నిర్మాణం కోసం రూ.18.50 కోట్ల సాయం చేసింది. ఈ నిధుల్లో దాదాపు ఐదు కోట్ల రూపాయలను నిందితులు స్వప్న సురేశ్‌, సరిత్‌ దుర్వినియోగం చేసినట్టు ఈడీ అభియోగాలు నమోదు చేసింది. నిందితులు ఇచ్చిన స్టేట్‌మెంట్‌ ఆధారంగా అప్పటిక కేరళ ప్రభుత్వం ప్రిన్సిపల్‌ సెక్రటరీ శివకుమార్‌ను కూడా ఈడీ అరెస్ట్‌ చేసింది.

ఇవి కూడా చదవండి

కాగా, స్థానిక కోర్టు శివశంకర్‌కు ఐదురోజుల ఈడీ కస్టడీ విధించింది. అయితే కస్టడీలో ప్రతి 2 గంటలకు ఓసారి ఆయనకు విశ్రాంతి ఇవ్వాలని సూచించింది.

మరిన్ని జాతీయ వార్తల కోసం..