Kerala Blast: కేరళలో వరస పేలుళ్లు.. ఒకరు మృతి, 35మందికి గాయాలు.. దర్యాప్తులో పలు ఆధారాలు లభ్యం..

|

Oct 29, 2023 | 3:41 PM

వరస పేలుళ్ల ఘటనపై ఎన్‌ఐఏ బృందం విచారణ జరుపుతోంది. క్షతగాత్రులు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. గాయపడిన వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు స్థానిక అధికారులు తెలిపారు. సెంటర్‌లో మూడు రోజుల నుంచి క్రైస్తవుల సదస్సు జరుగుతోంది. పేలుడు సంభవించినప్పుడు వందలాది మంది సెంటర్‌లో ఉన్నారు. ఈ పేలుడులో దాహక పరికరాన్ని ఉపయోగించినట్లు ఎన్ఐఏ ప్రాథమిక దర్యాప్తులో తేలింది. ఈ పరికరం ఏమిటో..  ఇది ఎంత ప్రమాదకరమైనదో తెలుసుకుందాం.. 

Kerala Blast: కేరళలో వరస పేలుళ్లు.. ఒకరు మృతి, 35మందికి గాయాలు.. దర్యాప్తులో పలు ఆధారాలు లభ్యం..
Kerala Blast
Follow us on

కేరళలో ఘోర ప్రమాదం జరిగింది. రాష్ట్రంలోని ఎర్నాకులంలోని కలమస్సేరిలోని కన్వెన్షన్ సెంటర్‌లో ఈరోజు అక్టోబర్ 29వ తేదీన వరుస బాంబు పేలుళ్లు సంభవించాయి. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, 35 మంది గాయపడ్డారు. ఈ సెంటర్‌లో ప్రార్థనలు జరుగుతున్న సమయంలో పేలుడు సంభవించింది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో అలర్ట్‌ ప్రకటించారు. సెంటర్‌లో ఒకదాని తర్వాత ఒకటిగా మొత్తం 5 పేలుళ్లు సంభవించాయి. ఈ పేలుడులో దాహక పరికరాన్ని ఉపయోగించినట్లు ఎన్ఐఏ ప్రాథమిక దర్యాప్తులో తేలింది. ఈ పరికరం ఏమిటో..  ఇది ఎంత ప్రమాదకరమైనదో తెలుసుకుందాం..

వరస పేలుళ్ల ఘటనపై ఎన్‌ఐఏ బృందం విచారణ జరుపుతోంది. క్షతగాత్రులు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. గాయపడిన వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు స్థానిక అధికారులు తెలిపారు. సెంటర్‌లో మూడు రోజుల నుంచి క్రైస్తవుల సదస్సు జరుగుతోంది. పేలుడు సంభవించినప్పుడు వందలాది మంది సెంటర్‌లో ఉన్నారు.

ఇవి కూడా చదవండి

కేరళ పేలుళ్ల పై దర్యాప్తు

 

దాహక పరికరం అంటే ఏమిటంటే?

ఈ వరస పేలుళ్లకు దహన పరికరాన్ని ఉపయోగించినట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలింది. వాస్తవానికి వీటిని వాడుక భాషలో బాంబులుగా పిలుస్తున్నా ఇవి పేలుడు పదార్థాలు కావు. ఇది ఒక ID లాంటిది. ఇది చిన్న పేలుడుకు కారణమమై.. భారీగా అగ్నిని వెదజల్లుతుంది. ఘటనా స్థలంలో పేలుడుకు ఉపయోగించిన వైర్లు, బ్యాటరీలు, ఇతర అనుమానాస్పద వస్తువులను కూడా పోలీసులు గుర్తించారు.

మీడియా నివేదికల ప్రకారం ఈ దాహక పరికరాన్ని నాపామ్, థర్మైట్, మెగ్నీషియం పౌడర్, క్లోరిన్ ట్రిఫ్లోరైడ్ లేదా సారూప్య పదార్థాలను ఉపయోగించి తయారు చేయబడిందని తెలుస్తోంది. ఇటువంటి ఆయుధాలు మొదటి ప్రపంచ యుద్ధం, రెండవ ప్రపంచ యుద్ధంలో కూడా ఉపయోగించబడ్డాయి.

టిఫిన్‌ బాక్స్ లో పరికరం ఉన్నట్లు అనుమానం..

మూలాల ప్రకారం పేలుడు జరిగిన ఘటనా స్థలం నుంచి అనేక సాక్ష్యాలను పోలీసులు, ఏఎన్ఐ బృందం కనుగొంది. ఈ కేసులో కుట్ర కోణం ఉన్నట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. టిఫిన్ బాక్స్ వంటి పెట్టె కూడా లభ్యమైందని.. ఈ పెట్టెలోనే పేలుడు పరికరం ఉంచి ఉండొచ్చని అనుమానిస్తున్నారు. అయితే ప్రస్తుతం ఘటనా స్థలం నుంచి దర్యాప్తు సంస్థ పలు ఆధారాలను సేకరిస్తోంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..