Chhattisgarh Election: ‘నోటా ఎంపికను రద్దు చేయాలి’.. ఛత్తీస్‌గఢ్ సీఎం భూపేష్ బఘేల్ సంచలన డిమాండ్
Chhattisgarh Assembly Election 2023: ఛత్తీస్‌గఢ్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు, ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి భూపేష్ బఘెల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఓటర్ల కోసం ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్ (EVM)పై ఉన్న నోటా 'నన్ ఆఫ్ ది ఎబౌ'ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు.
ఛత్తీస్‌గఢ్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు, ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి భూపేష్ బఘెల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఓటర్ల కోసం ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్ (EVM)పై ఉన్న నోటా ‘నన్ ఆఫ్ ది ఎబౌ’ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. రాయ్‌పూర్ విమానాశ్రయంలో విలేకరులతో మాట్లాడిన బఘెల్.. నోటాకు గెలుపు ఓటము కంటే ఎక్కువ ఓట్లు వచ్చినట్లు చాలాసార్లు చూశామని అన్నారు. అనవరసమైన నోటా తొలగించడం ఉత్తమమని సూచించారు.
ఛత్తీస్‌గడ్ రాష్ట్రంలో 2018 అసెంబ్లీ ఎన్నికల్లో నోటాకు రెండు లక్షలకు పైగా ఓట్లు వచ్చాయని, ఈ ఎంపిక ఎన్నికలను ఎలా ప్రభావితం చేస్తుందని అడిగినప్పుడు, ఎన్నికల సంఘం దీనిని గుర్తించాలని బఘేల్ అన్నారు. ఇద్దరు అభ్యర్థుల మధ్య గెలుపు ఓటముల తేడా కంటే నోటాకు ఎక్కువ ఓట్లు వచ్చాయని చాలాసార్లు చూశామన్నారు. నోటో విషయం లో కేంద్ర ఎన్నికల సంఘం పునరాలోచన చేయాల్సిన అవసరముందన్నారు.
చాలా మంది ప్రజలు పైకి లేదా క్రిందికి నొక్కాలని భావించి ఎటూ తేల్చుకోలేక నోటా బటన్‌ను నొక్కడం జరుగుతుందని ఛత్తీస్‌గఢ్ సీఎం భూపేష్ బఘేల్ అభిప్రాయపడ్డారు. కాబట్టి నోటాను రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. 90 మంది సభ్యులున్న ఛత్తీస్‌గఢ్ అసెంబ్లీకి నవంబర్ 7, 17 తేదీల్లో రెండు దశల్లో ఓటింగ్ జరగనుంది. నవంబర్ 3న ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలతో పాటే ఛత్తీస్‌గఢ్ రిజల్ట్స్ వెలువడనున్నాయి.
ఇదిలావుంటే సెప్టెంబరు 2013లో సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఎన్నికల సంఘం ఈవీఎంలలో అభ్యర్థుల జాబితాలో చివరి ఆప్షన్‌గా నోటా బటన్‌ను చేర్చింది. ఛత్తీస్‌గఢ్‌లో 2018 అసెంబ్లీ ఎన్నికల్లో 76.88 శాతం ఓటింగ్ నమోదైంది. ఇందులో మొత్తం 1,85,88,520 మంది ఓటర్లలో 1,42,90,497 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ ఎన్నికల్లో 2,82,738 మంది ఓటర్లు నోటాను ఎంచుకున్నారు.
అదేవిధంగా 2019 లోక్‌సభ ఎన్నికల్లో 11 పార్లమెంట్ స్థానాలున్న ఛత్తీస్‌గఢ్‌లో 1.96 లక్షలకు పైగా నోటా ఓట్లు పోలయ్యాయి. 2019లో, బస్తర్, సుర్గుజా, కాంకేర్, మహాసముంద్, రాజ్‌నంద్‌గావ్‌లలో ఐదు పార్లమెంటరీ నియోజకవర్గాలలో నోటా మూడవ స్థానంలో నిలిచింది. ఈనేపథ్యంలో నోటాపై కేంద్ర ఎన్నికల సంఘం పునరాలోచన చేయాలని డిమాండ్ చేస్తున్నారు ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి భూపేష్ బఘెల్.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…