Chilla-I-Kalan: కశ్మీర్‌లో ఈ 40 రోజులు కష్టమే..! చిల్లై కలాన్ ప్రారంభం
ఈ సమయంలో కశ్మీర్లో 40 రోజుల పాటు రాత్రి వేళ అత్యంత చల్లని వాతావారణం కలిగి ఉంటుంది. పగటిపూట ఉష్ణోగ్రతలు ఒక అంకెకే పరిమితమవుతాయి. మరోవైపు ఈ 40 రోజుల్లో అక్కడ కురిసే మంచు ఘనీభవించి ఎక్కువ కాలం ఉంటుంది. ఈ మంచు వేసవి కాలంలో కరిగిపోయి హిమానీనదుల ద్వారా ప్రవహిస్తుంది. నేపథ్యంలోనే బుధవారం కూడా కశ్మీర్‌లోయలోని ప్రముఖ పర్యాటక ప్రదేశం పహల్గామ్‌తో పాటు ఇతర ప్రదేశాల్లోనూ గడ్డకట్టే పరిస్థితులు నెలకొన్నాయి.
ప్రముఖ పర్యాటక ప్రదేశం కశ్మీర్‌లో డిసెంబర్ 21 నుంచి చిల్లై కలాన్ ప్రారంభమైంది. అయితే, అంతకన్నా ఒక రోజు ముందు డిసెంబర్ 20 బుధవారం నుంచే అక్కడి ఉష్ణోగ్రతలు దారుణంగా పడిపోయాయి. కశ్మీర్ వ్యాలీలోని పలు ప్రాంతాల్లో గడ్డకట్టుకుపోయే పరిస్థితుల కన్నా తక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. చిల్లై కలాన్ అంటే కశ్మీర్‌లో 40 రోజుల పాటు ఉండే అత్యంత కఠినమైన శీతాకాలం. ఈ సమయంలో కశ్మీర్ వ్యాలీలోని చాలా ప్రాంతాలు విపరీతమైన మంచుతో గడ్డకట్టుకుపోతాయి. చల్లని గాలులు కశ్మీర్ వ్యాలీని పూర్తిగా ఆక్రమిస్తాయి. ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోతాయి. దీంతో అక్కడి ప్రదేశాలన్నీ మంచులో కూరుకుపోతాయి. ప్రసిద్ధ పర్యాటక ప్రదేశం దాల్ సరస్సుతో పాటు కుళాయిల్లో నీళ్లు కూడా ఘనీభవిస్తాయి.
అలాంటి చిల్లై కలాన్ డిసెంబర్ 21 నుంచే ప్రారంభమైంది. ఇది జనవరి 29 వరకు అంటే 40 రోజుల వరకు ఉంటుంది. అయితే, ఈసారి చిల్లై కలాన్ పరిస్థితులు ఒకరోజు ముందే వచ్చాయని తెలుస్తోంది. బుధవారం కశ్మీర్‌లోని చాలా ప్రాంతాలలో అలాంటి విపరీతమైన చలి నమోదు అయింది. ఈ సమయంలో కశ్మీర్లో 40 రోజుల పాటు రాత్రి వేళ అత్యంత చల్లని వాతావారణం కలిగి ఉంటుంది. పగటిపూట ఉష్ణోగ్రతలు ఒక అంకెకే పరిమితమవుతాయి. మరోవైపు ఈ 40 రోజుల్లో అక్కడ కురిసే మంచు ఘనీభవించి ఎక్కువ కాలం ఉంటుంది. ఈ మంచు వేసవి కాలంలో కరిగిపోయి హిమానీనదుల ద్వారా ప్రవహిస్తుంది.
నేపథ్యంలోనే బుధవారం కూడా కశ్మీర్‌లోయలోని ప్రముఖ పర్యాటక ప్రదేశం పహల్గామ్‌తో పాటు ఇతర ప్రదేశాల్లోనూ గడ్డకట్టే పరిస్థితులు నెలకొన్నాయి. గతరాత్రి అక్కడి ఉష్ణోగ్రతలు ఈ సీజన్‌లోనే అత్యల్పంగా మైనస్ డిగ్రీల సెల్సియస్‌కు పడిపోయినట్లు తెలిసింది.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..