AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Question Paper Controversy: ప్రత్యేక దేశంగా కశ్మీర్‌.. ఏడో తరగతి పరీక్ష పేపర్‌లోని ప్రశ్నపై ఆ రాష్ట్రంలో రచ్చ..

బీహార్‌లో 2017 లాగే ఈసారి కూడా ప్రశ్నపత్రంలోని ఓ ప్రశ్న వివాదానికి కేంద్ర బిందువుగా మారుతోంది. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం మరోసారి విపక్షాలు రాష్ట్ర ప్రభుత్వాన్ని టార్గెట్‌గా ప్రశ్నలు సంధిస్తున్నాయి.

Question Paper Controversy: ప్రత్యేక దేశంగా కశ్మీర్‌.. ఏడో తరగతి పరీక్ష పేపర్‌లోని ప్రశ్నపై ఆ రాష్ట్రంలో రచ్చ..
Bihar Class 7 Question Paper
Sanjay Kasula
|

Updated on: Oct 19, 2022 | 5:17 PM

Share

బీహార్ విద్యావ్యవస్థ మరోసారి వెలుగులోకి వచ్చింది. ఈసారి 7వ తరగతి ప్రశ్నపత్రమే ఇందుకు కారణంగా మారింది. ఇందులో అడిగిన ఓ ప్రశ్న ఇప్పుడు దేశ వ్యాప్తంగా చర్చకు కారణంగా మారింది. ఈ ప్రశ్నపత్రంపై అన్ని పక్షాల నుంచి విమర్శల దాడులు మొదలయ్యాయి. రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు అన్ని పక్షాలు రెడీ అవుతున్నాయి. అయితే.. బీహార్‌లోని ఒక పాఠశాలలో 7వ తరగతి ప్రశ్నాపత్రంలో వచ్చిన ఓ ప్రశ్న పెద్ద వివాదాన్ని రాజేసింది. కశ్మీర్‌ను భారతదేశం నుంచి వేరుచేసే ప్రశ్నలా ఉందని ఆరోపిస్తూ దుమారం చెలరేగుతోంది. ఈ ఘటన బిహార్‌లోని కిషన్‌గంజ్‌లో గల పాఠశాలలో జరిగింది. బిహార్ ప్రభుత్వ విద్యా శాఖ 1-8 తరగతుల విద్యార్థులకు అక్టోబర్ 12 నుంచి అక్టోబర్ 18 వరకు హాఫ్ ఇయర్లు పరీక్షలను నిర్వహించగా.. ఇంగ్లీష్ ఎగ్జామ్‌లో ఓ  ప్రశ్న అడిగారు. ఇంతకీ ఆ ప్రశ్నలో.. క్రింది దేశాల ప్రజలను ఏమని పిలుస్తారు..? అని పరీక్షలో ప్రశ్న అడిగారు. ఈ ప్రశ్నకు కొన్ని ఆప్షన్స్ కూడా ఇచ్చారు. ఉదాహరణకు చైనా వారిని చైనీస్‌ అని పిలుస్తారు.. నేపాల్, ఇంగ్లాండ్, కశ్మీర్, భారతదేశ ప్రజలను ఏమని పిలుస్తారు..? అంటూ ఆప్షన్ ఇచ్చారు. ఇందులో కశ్మీర్‌ను వేరే దేశంగా పొరపాటున అడగడంతో ఇది కాస్తా పెద్ద వివాదం మారుతోంది.

ఈ ప్రశ్న కాస్తా పొలిటికల్ టర్న్ తీసుకుంటోంది. ఇది పొరపాటున జరిగినది కాదని.. కావాలనే రాష్ట్ర ప్రభుత్వం ఇలా ఇచ్చిందని కిషన్‌గంజ్‌ జిల్లా బీజేపీ ప్రెసిడెంట్‌ సుశాంత్‌ గోపీ ట్వీట్ చేశారు. బీహార్ సర్కారు పిల్లల మనసుల్లో కశ్మీర్‌ను భారత్‌ నుంచి వేరుచేసి చూపించే ప్రయత్నం చేస్తోందని విమర్శించారు.

అయితే ఈ ఘటనపై కిషన్‌గంజ్‌ స్కూల్ హెడ్‌ మాస్టర్ ఎస్‌కె దాస్‌ వివరణ కూడా ఇచ్చారు. ఇది పొరపాటున ఇలా జరిగిందని.. అంతకు మించి ఇంకేం లేదంటూ వివరించారు. ఈ ప్రశ్నాపత్రంలో కశ్మీర్‌ ప్రజలను ఏమని పిలుస్తారు..? అని ఉండటానికి బదులు కశ్మీర్‌ దేశ ప్రజలను ఏమని పిలుస్తారు..? అని రావడం జరిగిందని అన్నారు. జిల్లా విద్యాశాఖాధికారి సుభాష్ కుమార్ గుప్తా మాత్రం మీడియా అడిగిన ప్రశ్నల జవాబు చెప్పేందుకు దాటవేశారు. ఈ విషయాన్ని కావాలనే పెద్దది చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

వాస్తవానికి పరీక్ష ప్రశ్నపత్రంలో చైనా, భారత్, నేపాల్, ఇంగ్లండ్ లతో పాటు కశ్మీర్ ను కూడా ప్రత్యేక దేశంగా పరిగణించారు. అయితే 2017లో కూడా ఇదే తరహా కేసు బీహార్‌లో తెరపైకి వచ్చింది. విద్యావేత్త పంకజ్ ఝా మాట్లాడుతూ ప్రశ్నపత్రం పాఠశాల స్థాయిలో లేదని, బహుశా రాష్ట్ర స్థాయిలో మాత్రమే ఉంటుందని అన్నారు. పొరపాటు జరిగిందని, అయితే కశ్మీర్ భారతదేశంలో అంతర్భాగమని ఉపాధ్యాయులందరూ పిల్లలకు ఎప్పటినుంచో బోధించారని అన్నారు.

ఈ కేసులో ఎన్‌ఐఏ విచారణకు డిమాండ్‌ 

అదే సమయంలో నిషేధిత సంస్థ పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియాకు నితీష్ కుమార్ నేతృత్వంలోని ప్రభుత్వం మద్దతు ఇస్తున్నట్లు ఇలాంటి ప్రశ్నలు కనిపిస్తున్నాయని బీహార్ బీజేపీ అధ్యక్షుడు సంజయ్ జైస్వాల్ ఆరోపించారు. దీనిపై ఎన్‌ఐఏ విచారణ జరిపించాలని డిమాండ్‌ చేశారు. సంజయ్ జైస్వాల్ బీహార్ ఎడ్యుకేషన్ ప్రాజెక్ట్ కౌన్సిల్ తరపున, సీమాంచల్ జిల్లాలలో చైనా, ఇంగ్లండ్, నేపాల్, భారతదేశం, అదే సమయంలో కశ్మీర్ పౌరులను ఏమని పిలుస్తారు..? ప్రభుత్వంలో కూర్చున్న PFI మద్దతుదారులు, RJDలోని PFI మద్దతుదారుల దుర్మార్గపు అనుబంధం ఉందని విమర్శించారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం