AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Karur stampede: తొక్కిసలాట కేసు.. 14 రోజుల జ్యూడీషియల్‌ కస్టడీకి ఆ పార్టీకి చెందిన ఇద్దరు నాయకులు!

కరూర్ తొక్కిసలాట కేసులో తమిళగ వెట్రీ కజగం (టీవీకే)కు చెందిన ఇద్దరు నాయకులను 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీకి పంపారు. నటుడు విజయ్ ర్యాలీ సందర్భంగా జరిగిన ఈ దుర్ఘటనలో 41 మంది మరణించగా, 60 మంది గాయపడ్డారు. కేసు దర్యాప్తుకు ఏకసభ్య కమిషన్‌ను ఏర్పాటు చేయగా, ఎన్‌డిఎ బృందం కూడా పరిశీలన జరిపింది.

Karur stampede: తొక్కిసలాట కేసు.. 14 రోజుల జ్యూడీషియల్‌ కస్టడీకి ఆ పార్టీకి చెందిన ఇద్దరు నాయకులు!
Karur Stamped
SN Pasha
|

Updated on: Sep 30, 2025 | 4:11 PM

Share

తమిళనాడులోని కరూర్ తొక్కిసలాట కేసులో తమిళగ వెట్రీ కజగం (టీవీకే)కు చెందిన ఇద్దరు నాయకులను 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీకి పంపినట్లు పోలీసులు తెలిపారు. నటుడు, రాజకీయ నాయకుడు విజయ్ ర్యాలీ సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో 41 మంది మరణించగా, దాదాపు 60 మంది గాయపడ్డారు. రిమాండ్‌కు గురైన వ్యక్తులు కరూర్ వెస్ట్ జిల్లా కార్యదర్శి వీపీ మథియలగన్, కరూర్ సెంట్రల్ జిల్లా కార్యదర్శి కాశి పౌన్‌రాజ్. పోలీసులు దాఖలు చేసిన ఎఫ్‌ఐఆర్‌లో ఇద్దరి పేర్లను నమోదు చేసి, తరువాత అదుపులోకి తీసుకున్నారు. వారితో పాటు టీవీకే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బుస్సీ ఆనంద్, డిప్యూటీ ప్రధాన కార్యదర్శి నిర్మల్ కుమార్ లపై కూడా కేసు నమోదు అయింది. అయితే వారిని ఇంకా అరెస్టు చేయలేదు.

భారతీయ న్యాయ సంహితలోని సెక్షన్ 105 (హత్యతో సమానం కాని నేరపూరిత నరహత్య), సెక్షన్ 110 (అపరాధ హత్యకు ప్రయత్నించడం), సెక్షన్ 125 (జీవితానికి ముప్పు కలిగించడం), సెక్షన్ 223 (ఆదేశాన్ని పాటించకపోవడం) వంటి అనేక సెక్షన్ల కింద అధికారులు నిందితులపై అభియోగాలు మోపారు. టీవీకే చీఫ్ హాజరైన పార్టీ ర్యాలీలో జరిగిన తొక్కిసలాటకు గల కారణాలు, పరిస్థితులను పరిశోధించడానికి తమిళనాడు ప్రభుత్వం రిటైర్డ్ జడ్జి అరుణా జగదీశన్ నేతృత్వంలో ఏకసభ్య కమిషన్‌ను ఏర్పాటు చేసింది.

తమిళనాడులో ఎన్డీఏ ప్రతినిధి బృందం పర్యటన

తొక్కిసలాటకు గల కారణాలను తెలుసుకోవడానికి బిజెపి ఎంపి హేమ మాలిని నేతృత్వంలోని ఎనిమిది మంది సభ్యుల ఎన్డీఏ ప్యానెల్ మంగళవారం కరూర్ చేరుకుంది. ఈ ప్యానెల్ బాధిత కుటుంబాలను కూడా కలుసుకుని బిజెపి చీఫ్ జెపి నడ్డాకు నివేదికను అందజేస్తుంది. ర్యాలీ జరిగిన ప్రదేశంలో 10,000 మంది మాత్రమే కూర్చోవడానికి అవకాశం ఉన్నప్పటికీ దాదాపు 30,000 మంది తరలివచ్చారని, చాలా లోపాలు ఉన్నాయని హేమ మాలిని అన్నారు. 17 మంది మహిళలు, చిన్న పిల్లలు సహా 41 మంది మరణించడం బాధాకరం అని ఆమె అన్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి