పెంపుడు కుక్క చనిపోవడాన్ని చూసి జీర్ణించుకోలేని ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన కర్ణాటకలో వెలుగు చూసింది. బెంగళూరు ఉత్తర తాలూకాలోని హెగ్గదేవన్‌పూర్ గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. తన పెంపుడు కుక్కను ఎంతో ఇష్టపడే ఓ వ్యక్తి ఇటీవల మృతి చెందాడు. అల్లారు ముద్దుగా పెంచుకున్న కుక్క మరణంతో ఆ బాధను దిగమింగులేక ఆత్మహత్యకు పాల్పడినట్లు చెబుతున్నారు.
తన పెంపుడు కుక్క మరణాన్ని తట్టుకోలేక రాజశేఖర్(33) అనే వ్యక్తి బలవన్మరానికి పాల్పడ్డట్లు పోలీసులు తెలిపారు. బెంగళూరు నగరంలోని హెగ్గడదేవనపురలో ఉండే ఇతను కొంత కాలంగా జర్మన్ షెపర్డ్ జాతికి చెందిన కుక్కకు బౌన్సీ అని పేరు పెట్టి పెంచుకుంటున్నాడు. అయితే అది అనారోగ్యంతో చనిపోగా ఖననం చేసిన అనంతరం ఇంటికి వచ్చిన రాజశేఖర్.. బాధతో కుక్కకు ఉపయోగించిన చైన్‌తోనే ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.
35 ఏళ్ల రాజశేఖర్ మృతిని కుటుంబసభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. గత 9 సంవత్సరాలుగా పెంచుకున్న ప్రియమైన కుక్క 2024 చివరి రోజు డిసెంబర్ 31న మరణించింది. దీంతో మనస్తాపానికి గురైన రాజశేఖర్ బుధవారం(జనవరి 1) ఉదయం ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. రాజశేఖర్ నెట్‌వర్క్ మార్కెటింగ్‌లో పనిచేస్తున్నాడు. 1కుక్క చనిపోవడంతో తీవ్ర బాధగా ఉందని స్థానికులు తెలిపారు. కాగా, ఈ ఘటనకు సంబంధించి మదనాయకనహళ్లి పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది.
మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..