మహిళలను రాత్రి సమయాల్లో పనిచేయడానికి అనుమతించవద్దు.. సంచలన వ్యాఖ్యలు చేసిన బీజేపీ ఎమ్మెల్సీ

|

Sep 23, 2021 | 1:21 PM

మహిళలపై దేశవ్యాప్తంగా అరాచకాలు పెట్రేగుతున్నాయి. నిత్యం మానసిక, శరీరక హింసకు గురవుతున్నారు. ఈ నేపథ్యంలో ఓ మహిళ ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా పెద్ద దుమారమే రేపుతున్నాయి.

మహిళలను రాత్రి సమయాల్లో పనిచేయడానికి అనుమతించవద్దు.. సంచలన వ్యాఖ్యలు చేసిన బీజేపీ ఎమ్మెల్సీ
Bjp Mlc Bharati Shetty
Follow us on

BJP MLC Bharati Shetty: మహిళలపై దేశవ్యాప్తంగా అరాచకాలు పెట్రేగుతున్నాయి. నిత్యం మానసిక, శరీరక హింసకు గురవుతున్నారు. ఈ నేపథ్యంలో ఓ మహిళ ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా పెద్ద దుమారమే రేపుతున్నాయి.
కర్ణాటక బీజేపీ ఎమ్మెల్సీ భారతి శెట్టి తాజాగా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మహిళా ఉద్యోగినుల భద్రత కోసం రాత్రి వేళల్లో ఓవర్ టైం పనిచేయడానికి అనుమతించరాదని భారతిశెట్టి సూచించారు. రాత్రివేళల్లో పనిచేస్తున్న మహిళలు లక్ష్యంగా నేరాలు జరుగుతున్నాయని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఓవర్ టైం పనిచేసేందుకు వారిని అనుమతించరాదని భారతి కోరారు. మరోవైపు, నేరస్థుల పట్ల కఠినంగా వ్యవహరించడానికి న్యాయవ్యవస్థకు కోరలు లేవని, అందువల్ల నేరాలు ఎక్కువగా జరుగుతున్నాయని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు.

నేరాలను నిర్మూలించడానికి కఠినతరమైన కొత్త చట్టాలు అవసరమని ఎమ్మెల్సీ భారతిశెట్టి అభిప్రాయపడ్డారు. దేశవ్యాప్తంగా మహిళల భద్రత పట్ల ప్రభుత్వాలు మరింత కఠిన చట్టాలు తీసుకురావల్సిన అవసరముందన్నారు. కాగా, భారతిశెట్టి చేసిన వ్యాఖ్యలు మహాత్మాగాంధీ కల రామరాజ్య స్ఫూర్తితో లేవని, మహిళల భద్రత అన్ని సమయాల్లో ఉండేలా చూడాలని ప్రతపక్ష నేత ఎస్ఆర్ పాటిల్ సూచించారు. భారతి చేసిన సూచన ఆచరణ సాధ్యం కాదని కాంగ్రెస్ చీఫ్ విప్ ఎం నారాయణస్వామి పేర్కొన్నారు.

Read Also…  Aloo Tikki Recipe: రెగ్యులర్ స్నాక్స్‌తో బోర్ కొట్టిందా రెస్టారెంట్ స్టైల్‌లో ఈజీగా ‘ఆలూ టిక్కా’ తయారీ మీకోసం..

Kerala BJP: కేరళ బీజేపీలో కుదుపు.. సురేంద్రన్ స్థానంలో పార్టీ అధినేతగా సురేష్ గోపి.. కారణం అదేనా..?