జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి.. ఎనిమిది మందికి తీవ్ర గాయాలు.. ముగ్గురి పరిస్థితి విషమం

|

Feb 21, 2021 | 4:42 PM

జాతీయ రహదారులపై రోడ్డు ప్రమాదాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. అతివేగంగా వెళ్తున్న వాహనాల కారణంగా అమాయకులు బలవుతున్నారు. రోడ్డు ప్రమాదాలను అరికట్టేందుకు .

జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి.. ఎనిమిది మందికి తీవ్ర గాయాలు.. ముగ్గురి పరిస్థితి విషమం
Jangaareddygudem road accident..
Follow us on

జాతీయ రహదారులపై రోడ్డు ప్రమాదాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. అతివేగంగా వెళ్తున్న వాహనాల కారణంగా అమాయకులు బలవుతున్నారు. రోడ్డు ప్రమాదాలను అరికట్టేందుకు పోలీసులు ఎన్ని చర్యలు చేపట్టినా.. ఏ మాత్రం ఆగడం లేదు.

తాజాగా కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. హసన్‌ జిల్లాలో ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు దుర్మరణం పాలయ్యారు. కాంచట్టల్లి గ్రామ సమీపంలో బెంగళూరు-మంగళూరు జాతీయ రహదారి-75పై వేగంగా వెళ్తున్న రెండు కార్లు ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో నలుగురు మృతి చెందగా, మరో ఎనిమిది మందికి తీవ్ర గాయాలయ్యాయి. కాగా, కోలార్‌ జిల్లాలోని ముల్బగల్‌ ప్రాంతానికి చెందిన కొందరు టాటా సుమోలో ధర్మస్థలలోని మంజునాథ స్వామి ఆలయ దర్శనానికి బయలుదేరారు.

కాంచట్టపల్లి వద్దకు రాగానే డ్రైవర్‌ అకస్మాత్తుగా బ్రేక్‌ వేయడంతో వెనుక నుంచి వేగంగా వస్తున్న టాయోటా క్వాలిస్‌ వాహనం ఢీకొట్టడంతో సుమోలో ప్రయాణిస్తున్న సునీల్‌ కుమార్‌ (25), చంద్రశేఖర్‌ (27)), నవీన్‌ కుమార్‌ (30), ప్రదీప్‌ కుమార్‌ (26)లు ఘటన స్థలంలోని మృతి చెందారు. ఇరు వాహనాల్లో ఉన్న ఎనిమిది మందికి గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతున్న వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. హసన్‌ జిల్లా ఎస్పీ శ్రీనివాసగౌడ ఘటన స్థలాన్ని పరిశీలించారు. ప్రమాదం జరిగిన తీరును స్థానికులను అడిగి తెలుసుకున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు.

Also Read: వికారాబాద్ జిల్లాలో విషాదం.. విధుల్లో ఉన్న గురుకుల ఉపాధ్యాయుడికి గుండెపోటు.. ఆస్పత్రికి తరలించేలోపే మృతి