సీడీ తో ఇక ఇంటికే !కర్నాటకలో రాసలీలల మంత్రి రమేష్ జర్కిహోళి రాజీనామా,
కర్నాటకలో జల వనరుల శాఖ మంత్రి రమేష్ జర్కిహోళి రాజీనామా చేశారు.ఇతని రాసలీలల యవ్వారాన్ని బీజేపీ సీరియస్ గా పరిగణించింది.
కర్నాటకలో జల వనరుల శాఖ మంత్రి రమేష్ జర్కిహోళి రాజీనామా చేశారు.ఇతని రాసలీలల యవ్వారాన్ని బీజేపీ సీరియస్ గా పరిగణించింది. ఈ మంత్రి సెక్స్ స్కాండల్ సీడీ బయటపడిన నేపథ్యంలో ఇతని రాజీనామాకు విపక్షాలు గట్టిగా పట్టు పట్టాయి. కాగా అంతకు ముందు వచ్చిన వార్తల ప్రకారం చట్టప్రకారం రమేష్ జర్కిహోళిపై చర్య తీసుకుంటామని రాష్ట్ర హోమ్ మంత్రి బసవరాజ్ బొమ్మై తెలిపారు. కాగా దినేష్ కలహళ్లి అనే సోషల్ యాక్టివిస్ట్ మీడియాకు రమేష్ రాసలీలల తాలూకు వీడియోను విడుదల చేశారు. కర్నాటక ట్రాన్స్ మిషన్ కార్యాలయంలో ప్రభుత్వ ఉద్యోగం ఇప్పిస్తానని ఆశ చూపి ఓ యువతిని రమేష్ లొంగదీసుకున్నాడని ఆయన చెప్పారు. తమకు న్యాయం జరిగేలా చూడాలంటూ ఈ యువతి కుటుంబం తనను ఇటీవల కలిసిందన్నారు. ఈ వీడియోలో రమేష్ జర్కిహోళి.. సిద్దరామయ్య గుడ్ అని, ఎడ్యూరప్ప అవినీతిపరుడని, ప్రహ్లాద్ జోషీ సీఎం అవుతారని అనడం వినిపించిందట .
అటు-తనపై వచ్చిన ఆరోపణలు నిరాధారమని, దీనిపై సమగ్ర దర్యాప్తు అవసరమని రమేష్ అన్నారు. నైతిక కారణాలపై తాను రాజీనామా చేస్తున్నానన్నారు. ఇలా ఉండగా ఈ వ్యవహారంపై సీబీఐ దర్యాప్తు జరిపించాలని ఈయన సోదరుడు, బీజేపీ ఎమ్మెల్యే బాలచంద్ర జర్కిహోళి కోరారు. ఎవరో ఫేక్ వీడియోను విడుదల చేశారని, ఇందుకు కారకులైనవారిపై రూ. 100 కోట్ల దావా వేస్తానని ఆయన హెచ్చరించారు. ఈ వీడియోలో చూపిన మహిళ ఎవరో తెలియదని, ఆమె బంధువులంటూ ఎవరో ఫిర్యాదు చేస్తే మరెవరో దీన్ని విడుదల చేస్తారా అని ఆయన ప్రశ్నించారు. నిజానికి ఈ ఫిర్యాదే తప్పుడు ఫిర్యాదని అన్నారు. కర్ణాటక అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు గురువారం నుంచి ప్రారంభం కాబోతున్న తరుణంలో ఈ మొత్తం వ్యవహారం సీఎం ఎడ్యూరప్ప ప్రభుత్వానికి ఇరకాట పరిస్థితిని తెఛ్చిపెట్టింది. గోకక్ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న రమేష్ లోగడ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. రాష్ట్రంలో…. గతంలో కాంగ్రెస్-జేడీ-ఎస్ సంకీర్ణ కూటమి ప్రభుత్వ పతనానికి కారకులైన వారిలో రమేష్ జర్కిహోళి కూడా ఉన్నారు.
మరిన్ని చదవండి ఇక్కడ :