Karnataka: స్కూల్‌ విద్యార్థులతో టాయిలెట్లు శుభ్రం చేయించిన ప్రిన్సిపల్‌.. ఇదే నెలలో మూడో ఘటన!

|

Dec 29, 2023 | 12:38 PM

పాఠశాల విద్యార్థులతో మరుగుదొడ్లు శుభ్రం చేయిస్తున్న వీడియో వెలుగులోకి రావడంతో ప్రభుత్వ పాఠశాల ప్రిన్సిపల్‌ గురువారం (డిసెంబర్‌ 28) సస్పెండ్ అయ్యాడు. కర్ణాటకలో విద్యార్ధులతో మరుగుదోడ్లు శుభ్రం చేయించిన ఘటనలు వెలుగులోకి రావడం ఈ నెలలో ఇది మూడోసారి కావడం విశేషం. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. శివమొగ్గ జిల్లా భద్రావతి తాలూకాలోని ఓ ప్రభుత్వ పాఠశాలలో శనివారం ఈ ఘటన జరిగినట్లు అధికారులు..

Karnataka: స్కూల్‌ విద్యార్థులతో టాయిలెట్లు శుభ్రం చేయించిన ప్రిన్సిపల్‌.. ఇదే నెలలో మూడో ఘటన!
Govt School Principal Suspended
Follow us on

బెంగళూరు, డిసెంబర్‌ 29: పాఠశాల విద్యార్థులతో మరుగుదొడ్లు శుభ్రం చేయిస్తున్న వీడియో వెలుగులోకి రావడంతో ప్రభుత్వ పాఠశాల ప్రిన్సిపల్‌ గురువారం (డిసెంబర్‌ 28) సస్పెండ్ అయ్యాడు. కర్ణాటకలో విద్యార్ధులతో మరుగుదోడ్లు శుభ్రం చేయించిన ఘటనలు వెలుగులోకి రావడం ఈ నెలలో ఇది మూడోసారి కావడం విశేషం. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. శివమొగ్గ జిల్లా భద్రావతి తాలూకాలోని ఓ ప్రభుత్వ పాఠశాలలో శనివారం ఈ ఘటన జరిగినట్లు అధికారులు వెల్లడించారు. పాఠశాల విద్యార్థులు టాయిలెట్లను శుభ్రం చేయడం, స్క్రబ్బింగ్ చేయడం వీడియోలో చూడవచ్చు. దీనిపై విద్యార్ధుల తల్లిదండ్రుల నిరసన వ్యక్తం చేస్తున్నారు.

ఆరో తరగతి చదువుతున్న విద్యార్థులకు మరుగుదొడ్లు శుభ్రం చేయాలని పాఠశాల అధికారులు ఆదేశాలు జారీ చేశారు. దీంతో చిన్నారులు టాయిలెట్లు శుభ్రం చేసినట్లు తెలుస్తోంది. విద్యార్థులు టాయిలెట్లను శుభ్రం చేస్తున్నట్టు చూపుతున్న 10 సెకన్ల వీడియో బుధవారం తమ వాట్సప్‌కు వచ్చినట్లు విద్యాశాఖ సీనియర్ అధికారి ఒకరు మీడియకు తెలిపారు. వెంటనే దీనిపై సమగ్ర విచారణ జరపాల్సిందిగా సంబంధిత అధికారులను ఆదేశించినట్లు పేర్కొన్నారు. బ్లాక్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ సమర్పించిన నివేదిక ఆధారంగా ప్రధానోపాధ్యాయుడు శంకరప్పపై క్రమశిక్షణా చర్య తీసుకున్నట్లు వెల్లడించారు. దీనిపై ప్రిన్సిపాల్‌ మాట్లాడుతూ.. విద్యార్థులను కేవలం నీళ్లు పోయమని మాత్రమే చెప్పానని, మరుగుదొడ్లు శుభ్రం చేయమని విద్యార్థులను ఆదేశించలేదన్నారు. గత వారం పాఠశాలలో జరిగిన సంఘటనకు సంబంధించి ప్రిన్సిపల్‌ను సస్పెండ్ చేసినట్లు స్పష్టం చేశారు.

కాగా ఈ నెలలో కర్నాటకలో ఇది మూడో ఘటన కావడం గమనార్హం. బెంగుళూరు, కోలారు జిల్లాల్లోనూ ఇలాంటి ఘటనలే చోటుచేసుకున్నాయి. బెంగళూరు, కోలారు జిల్లాల్లో ఘటనలు మరువక ముందే శివమొగ్గలో విద్యార్ధులతో మరుగుదొడ్లు శుభ్రం చేయించడం కలకలం రేపింది. కోలార్ జిల్లాలో దళిత విద్యార్థులు సెప్టిక్ ట్యాంక్‌లను శుభ్రం చేస్తున్న వీడియో బయటకు రావడంతో రెసిడెన్షియల్ పాఠశాల ప్రిన్సిపాల్‌తోపాటు మరో ఇద్దరు సిబ్బందిని కూడా సస్పెండ్ చేశారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.