BS Yeddyurappa: మాజీ ముఖ్యమంత్రికి బెదిరింపు కాల్స్.. జెడ్ కేటగిరీ భద్రత కల్పించిన కేంద్రం

కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకుడు బిఎస్ యడ్యూరప్పకు జెడ్ కేటగిరీ భద్రత కల్పించింది కేంద్ర ప్రభుత్వం. సెంట్రల్ ఇంటెలిజెన్స్ బ్యూరో ఇటీవల బెదిరింపు హెచ్చరిక జారీ చేసిన నేపథ్యంలో కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఈ నిర్ణయం తీసుకుంది.

BS Yeddyurappa: మాజీ ముఖ్యమంత్రికి బెదిరింపు కాల్స్.. జెడ్ కేటగిరీ భద్రత కల్పించిన కేంద్రం
Yediyurappa Security
Follow us
Balaraju Goud

|

Updated on: Oct 26, 2023 | 2:17 PM

కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకుడు బిఎస్ యడ్యూరప్పకు జెడ్ కేటగిరీ భద్రత కల్పించింది కేంద్ర ప్రభుత్వం. సెంట్రల్ ఇంటెలిజెన్స్ బ్యూరో ఇటీవల బెదిరింపు హెచ్చరిక జారీ చేసిన నేపథ్యంలో కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఈ నిర్ణయం తీసుకుంది. కర్నాటకలో పనిచేస్తున్న ఛాందసవాద గ్రూపుల నుంచి ముప్పు పొంచి ఉన్న దృష్ట్యా, IB ఇటీవల యడ్యూరప్ప భద్రతపై కేంద్రానికి నివేదిక సమర్పించింది. IB నివేదికలో అతని భద్రత గురించి ఆందోళన వ్యక్తం చేసింది. కేంద్ర హోం మంత్రిత్వ శాఖకు నివేదిక సమర్పించింది. ఆ తర్వాత వారి భద్రతను పెంచడానికి నిర్ణయం తీసుకుంది కేంద్ర ప్రభుత్వం.

సీఆర్‌పీఎఫ్ కమాండోలకు భద్రత బాధ్యతలు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ సూచనల మేరకు సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సీఆర్‌పీఎఫ్) కమాండోలకు చెందిన సాయుధ సిబ్బంది యడియూరప్ప భద్రతను చూసుకుంటారు. యడియూరప్ప భద్రత కోసం మొత్తం 33 మంది సీఆర్‌పీఎఫ్‌ సిబ్బందిని మోహరించనున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. అదనంగా, అతని నివాసం వద్ద 10 మంది సాయుధ స్టాటిక్ గార్డులు, ఆరుగురు వ్యక్తిగత భద్రతా అధికారులతో రౌండ్-ది-క్లాక్ భద్రతను నియమించారు.

డ్రైవర్ల బృందాన్ని కూడా భద్రతా వలయం శిక్షణ పొందిన నైపుణ్యం కలిగిన డ్రైవర్లను కూడా వారి కాన్వాయ్‌లో చేర్చారు. ప్రమాదంలో ఉన్న సమయంలో యడూరప్ప సురక్షితంగా తరలించగలరు. 12 మంది సాయుధ ఎస్కార్ట్ కమాండోలను మూడు షిఫ్టుల్లో మోహరించింది. ఉగ్రవాదుల బెదిరింపులకు వ్యతిరేకంగా నిరంతరం నిఘా ఉంచుతారు. నిరంతరం నిఘా ఉంచేందుకు, షిఫ్టుల వారీగా ఇద్దరు పరిశీలకులను నియమిస్తారు. వీరిలో యడియూరప్ప ఎల్లప్పుడూ రెండు అంచెల భద్రతను కలిగి ఉంటారు.

యడ్యూరప్పకు బెదిరింపులు యడ్యూరప్ప భద్రత కోసం మోహరించిన కమాండోలు మార్షల్ ఆర్ట్స్‌లో ప్రావీణ్యం కలవారు. ఆయుధాలు లేకపోయినా పోరాడడంలో నిష్ణాతులని హోం శాఖ వర్గాలు చెప్పినట్లు సమాచారం. వారికి మెషిన్ గన్‌లు, అత్యాధునిక కమ్యూనికేషన్ పరికరాలను రౌండ్ ది క్లాక్ అమర్చారు. యడ్యూరప్ప కుటుంబానికి చెందిన చాలా మంది రాజకీయాల్లో క్రియాశీలకంగా ఉన్నారు. గత కొంతకాలంగా తీవ్రవాద గ్రూపుల నుండి యడేూరప్పకు బెదిరింపులు వస్తున్నాయి. ఆ తర్వాత హోం మంత్రిత్వ శాఖ ఈ ముఖ్యమైన చర్య తీసుకుంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…