కర్నాటక ఎన్నికల ప్రచారాన్ని మరింత వేగవంతం చేసింది బీజేపీ . ఒకేరోజు పార్టీ తరపున ప్రధాని మోదీ , అమిత్‌షా , జేపీ నడ్డా ప్రచారాన్ని ముమ్మరం చేశారు. కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గేకు చురకలు వేశారు మోదీ . నన్ను తిట్టేందుకు సమయం కేటాయించే బదులు.. గుడ్‌గవర్నర్స్‌పై దృష్టి పెట్టి ఉంటే కాంగ్రెస్‌కు ఇలాంటి దయనీయ స్థితి వచ్చేది కాదన్నారు మోదీ. కర్నాటక అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా హుమ్నాబాద్ ప్రచార సభలో ప్రధాని ఈ కామెంట్స్ చేశారు. హుమ్నాబాద్ తరువాత విజయపురలో ప్రచారం చేశారు మోదీ.
బెంగళూర్‌లో ప్రధాని మోదీ మెగా రోడ్‌షో నిర్వహించారు. 5 కిలోమీటర్ల మేర మోదీ రోడ్‌షో సాగింది. 9 నియోజకవర్గాల మీదుగా రోడ్‌షో నిర్వహించారు. రెండు రోజుల పాటు రాష్ట్రంలో మోదీ టూర్ సాగనుంది. బెంగళూర్ నార్త్ , బెంగళూర్ సెంట్రల్ ప్రాంతాల్లో రోడ్‌షోకు మంచి స్పందన లభించింది. మోదీపై పూలవర్షం కురిపించారు జనం. ఒకే రోజు ఐదు సభల్లో మోదీ ప్రసంగించారు.
మంగళూర్‌లో అమిత్‌షా భారీ రోడ్‌షో నిర్వహించారు. ఉదయం కొడగు జిల్లా మడికెరిలో కూడా రోడ్‌షో నిర్వహించారు అమిత్‌షా. కర్నాటకలో అభివృద్ది డబుల్ ఇంజన్ సర్కార్ తోనే సాధ్యమన్నారు అమిత్‌షా..
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..