AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

చిక్కుల్లో కర్ణాటక కాంగ్రెస్ ఎమ్మెల్సీ.. అసెంబ్లీలో అశ్లీల చిత్రాలను చూస్తూ బుక్కైన ప్రకాశ్‌ రాథోడ్‌..!

కర్నాటక రాజకీయాల్లో ఇప్పుడు కాంగ్రెస్ నేత, ఎమ్మెల్సీ ప్రకాష్ రాథోడ్ చర్చనీయాంశంగా మారారు. మొబైల్ ఫోన్లో అశ్లీల చిత్రాలు చూస్తూ అడ్డంగా బుక్కయ్యారు.

చిక్కుల్లో కర్ణాటక కాంగ్రెస్ ఎమ్మెల్సీ.. అసెంబ్లీలో అశ్లీల చిత్రాలను చూస్తూ బుక్కైన ప్రకాశ్‌ రాథోడ్‌..!
Balaraju Goud
|

Updated on: Jan 30, 2021 | 1:33 PM

Share

MLC watching obscene videos in Assembly : ప్రజా సమస్యలపై పోరాటం చేయాల్సిన చోట ఓ ఎమ్మెల్సీ చేసిన పని.. అందరిని తల దించుకునేలా చేసింది. తాజాగా కర్ణాటక రాష్ట్రంలోని అసెంబ్లీలో ఓ శాసనమండలి సభ్యుడు మొబైల్ ఫోన్లో అశ్లీల చిత్రాలు చూస్తూ అడ్డంగా బుక్కయ్యారు. దీంతో కర్నాటక రాజకీయాల్లో ఇప్పుడు కాంగ్రెస్ నేత, ఎమ్మెల్సీ ప్రకాష్ రాథోడ్ చర్చనీయాంశంగా మారారు. గతంలోనూ ముగ్గురు ఎమ్మెల్యేలు కర్ణాటక శాసనభలో పోర్న్‌ వీడియోలు చూస్తూ కెమెరాలకు చిక్కడం గమనార్హం.

వివరాల్లోకి వెళితే.. కర్ణాటక అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు గురువారం ప్రారంభమయ్యాయి. తొలిరోజు ప్రభుత్వం 11 బిల్లుల్ని సభలో ప్రవేశపెట్టింది. వీటిపై రెండో రోజు శుక్రవారం అసెంబ్లీ, మండలిలో కీలక చర్చ కొనసాగుతుంది. అయితే, బిల్లులపై చర్చ జరుగుతున్న సమయంలో కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ ప్రకాశ్‌ రాథోడ్‌ పోర్న్‌ వీడియో చూస్తూ కెమెరాలకు అడ్డంగా దొరికిపోయారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. ఇది సభ మర్యాదను భంగపరచినట్లు అవుతుందని, అందుకే తక్షణం ప్రకాష్ రాథోడ్ రాజీనామా చేయాలని బీజేపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు.

అయితే, దీనిపై స్పందించిన రాథోడ్.. తనపై వచ్చిన ఆరోపణలను ఆయన ఖండించారు. అసభ్య దృశ్యాలను చూడలేదన్నారు. తన ఫోను స్టోరోజ్ నిండిపోయిందని, తాను ఒక ఫైల్ డౌన్‌లోడ్ చేయాల్సి వుందని అన్నారు. అయితే ఫోనులో స్పేస్ లేకపోవడంతో ఫైల్ డౌన్ లోడ్ కాలేదని తెలిపారు. తాను సభలో ఒక ప్రశ్నను డౌన్‌లోడ్ చేసుకునేందుకు మొబైల్ వాడుతున్నానన్నారు. తాను చెప్పే నిజాన్ని గుర్తించాలని ఆయన కోరారు. ఈ సందర్భంగా బీజేపీ ప్రతినిధి ఎస్ ప్రకాష్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ ఎమ్మెల్సీ ప్రకాష్ రాథోడ్‌ను ఆ పార్టీ బహిష్కరించాలని డిమాండ్ చేశారు.

Read Also… హైదరాబాద్ ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో చోరి కలకలం.. మైనంపల్లి ఇంటికి కన్నం వేసిన దొంగలు.. రంగంలోకి పోలీసు ఉన్నతాధికారులు..!