ప్లాస్టిక్ డబ్బా మింగేసిన  కోబ్రా.. సర్జరీ చేసి తొలగించిన వైద్యులు.. 

|

Jun 23, 2023 | 10:16 AM

ప్లాస్టిక్​ డబ్బాను మింగేసిన నాగుపాముకు ఆపరేషన్‌ చేసి దాని ప్రాణాలు కాపాడాడో పశు వైద్యుడు. కర్ణాటక రాష్ట్రంలోని మంగళూరులో ఈ సంఘటన జరిగింది. మంగళూరులోని బంట్వాళ సమీపంలోని సాలుమరాడ తిమ్మక్క పార్కు సమీపంలోని గుంతలో..

ప్లాస్టిక్ డబ్బా మింగేసిన  కోబ్రా.. సర్జరీ చేసి తొలగించిన వైద్యులు.. 
Surgery To Cobra
Follow us on

బెంగళూరు: ప్లాస్టిక్​ డబ్బాను మింగేసిన నాగుపాముకు ఆపరేషన్‌ చేసి దాని ప్రాణాలు కాపాడాడో పశు వైద్యుడు. కర్ణాటక రాష్ట్రంలోని మంగళూరులో ఈ సంఘటన జరిగింది. మంగళూరులోని బంట్వాళ సమీపంలోని సాలుమరాడ తిమ్మక్క పార్కు సమీపంలోని గుంతలో ఓ నాగు పాము గాయాలతో కనిపించింది. గమనించిన కమలపాడు గ్రామ పంచాయతీ సభ్యురాలు వసంతి కుటుంబ సభ్యులు జూన్‌ 6న పశు వైద్యుడు స్నేక్ కిరణ్‌కు సమాచారం అందించారు. వెంటనే కిరణ్​ ఘటనాస్థలికి చేరుకుని పాముకు చికిత్స అందిచాడు. తల కింది భాగంలో గాయాలైనట్లు గుర్తించిన కిరణ్‌.. మంగళూరు వెటర్నరీ ఆసుపత్రి పశు వైద్యాధికారి డా యశస్వి నారవి వద్దకు తీసుకెళ్లాడు.

పాము కడుపు ఉబ్బి ఉండడాన్ని గమనించి పాముకు ఎక్స్‌రే తీశారు. పాము కడుపులో ప్లాస్టిక్‌ పదార్ధం ఉండటాన్ని గమనించారు. గుడ్డును మింగే క్రమంలో ప్లాస్టిక్‌ కంటైనర్‌ను మింగేసి ఉంటుందని వైద్యులు భావించారు. వెంటనే నాగుపాముకు సర్జరీ చేసి, దాని కడుపులోని ప్లాస్టిక్ డబ్బాను తొలగించారు. శస్త్ర చికిత్స అనంతరం 15 రోజులపాటు వైద్యుల పర్యవేక్షణలో ఉంచారు. పాము కోలుకున్నాక ఫారెస్ట్ అధికారుల సూచన మేరకు అటవీ ప్రాంతంలో దానిని విడిచిపెట్టినట్లు స్నేక్ కిరణ్​మీడియాకు వెల్లడించాడు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.