Breaking: కర్ణాటక సీఎం యడ్యూరప్పకు కరోనా పాజిటివ్.. మణిపాల్ హాస్పిటల్‌కు తరలింపు..

|

Apr 16, 2021 | 2:45 PM

ఇప్పటికే యూపీ సీఎం ఆదిత్యనాధ్, కేరళ సీఎం పినరాయి విజయన్‌తో సహా పలువురు పొలిటికల్ లీడర్స్‌కు కరోనా పాజిటివ్ తేలగా..

Breaking: కర్ణాటక సీఎం యడ్యూరప్పకు కరోనా పాజిటివ్.. మణిపాల్ హాస్పిటల్‌కు తరలింపు..
కర్ణాటక బీజేపీ సీనియర్‌ నేత, పార్టీకి ఎంతో నమ్మకస్తుడైన బీఎస్‌ యెడియూరప్ప సీఎం పదవిని నాలుగుసార్లు చేపట్టారు. అయితే ఏ ఒక్కసారి కూడా పూర్తి కాలం ముఖ్యమంత్రి పదవిలో ఆయన కొనసాగలేదు. యడియూరప్ప సీఎం పదవికి నాలుగుసార్లు రాజీనామా చేయడానికి దారితీసిన కారణాలను పరిశీలిస్తే.. 2007లో.. ఎనిమిది రోజులు సీఎంగా యెడ్డీ.. 2006 జనవరిలో కాంగ్రెస్‌ ప్రభుత్వానికి జేడీ(ఎస్‌) తన మద్దతు ఉపసంహరించింది. ఆ ప్రభుత్వం కూలిపోవడంతో జేడీ(ఎస్‌), బీజేపీ కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి.
Follow us on

దేశంలో కరోనా వైరస్ సెకండ్ వేవ్ విలయతాండవం సృష్టిస్తోంది. రోజురోజుకూ పాజిటివ్ కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతూపోతోంది. సామాన్యుల నుంచి రాజకీయ నాయకుల వరకు అందరూ కోవిడ్ బారిన పడ్డారు. ఇప్పటికే యూపీ సీఎం ఆదిత్యనాధ్, కేరళ సీఎం పినరాయి విజయన్‌తో సహా పలువురు పొలిటికల్ లీడర్స్‌కు కరోనా పాజిటివ్ తేలగా.. తాజాగా ఆ లిస్టులోకి కర్ణాటక సీఎం యడ్యూరప్ప కూడా చేరారు. ఇటీవల ఆయన కరోనా టెస్ట్ చేయించుకోగా.. పాజిటివ్ నిర్ధారణ అయింది. మెరుగైన చికిత్స నిమిత్తం ఆయనను రామయ్య మెమోరియల్ హాస్పిటల్‌ నుంచి మణిపాల్ హాస్పిటల్‌కు తరలిస్తున్నట్లు కర్ణాటక సీఎంవో ట్విట్టర్ వేదికగా పేర్కొంది.

కర్ణాటక సీఎంవో ట్వీట్ ఇదే…

Also Read: 

తెలంగాణలో టెన్త్ పరీక్షలు రద్దు.. కీలక నిర్ణయం తీసుకున్న సర్కార్..

ఒకే అమ్మాయిని నాలుగు సార్లు పెళ్లి చేసుకున్నాడు.. రీజన్ తెలిస్తే ఫ్యూజులు ఎగిరి పోవాల్సిందే.!

ఇంటర్ ఫస్టియర్ పరీక్షలు రద్దు.. ద్వితీయ సంవత్సరం ఎగ్జామ్స్‌ వాయిదా..