Karnataka Elections 2023: సీఎం కారును ఆపేసి తనిఖీ చేసిన పోలీసులు.. కర్నాటకలో అమల్లోకి ఎన్నికల కోడ్‌..

ముఖ్యమంత్రి కారునే ఆపేశారు. తనిఖీ చేసి పంపించేశారు. ఇంతకీ ఎక్కడా ? ఎందుకు ? ఇప్పుడు తెలుసా..

Karnataka Elections 2023: సీఎం కారును ఆపేసి తనిఖీ చేసిన పోలీసులు.. కర్నాటకలో అమల్లోకి ఎన్నికల కోడ్‌..
Karnataka Cm Basavaraj's Car Checked

Updated on: Mar 31, 2023 | 10:12 PM

కర్నాటకలో ఎన్నికల కోడ్‌ అమల్లోకి రావడంతో పోలీసులు ఏకంగా ముఖ్యమంత్రి కారునే చెక్‌ చేశారు. దొడ్డబళ్లాపూర్‌లోని ఆలయానికి వెళుతుండగా పోలీసులు CM బొమ్మైకారును ఆపారు. కారులో తనిఖీలు చేపట్టారు. ఆ తర్వాత కారు వెళ్లడానికి అనుమతించారు. కర్నాటకలో ఎన్నికల హీట్‌ పెరిగింది. మే 10న కర్నాటకలో పోలింగ్‌ జరుగుతుంది. మే 13న కౌంటింగ్‌ ఉంటుంది. కర్నాటక అసెంబ్లీ ఎన్నికలపై చీఫ్‌ ఎలక్షన్‌ కమిషనర్‌ బుధవారం ప్రకటించిన దగ్గరి నుంచే ఎలక్షన్‌ కోడ్‌ ఆ రాష్ట్రంలో అమల్లోకి వచ్చింది. దీంతో పోలీసులు, ఎలక్షన్‌ ఫ్లయిండ్‌ స్క్వాడ్‌ ఆ రాష్ట్రంలో ఆకస్మికంగా తనిఖీలు నిర్వహిస్తోంది.

ఇందులో భాగంగా శుక్రవారం కూడా తనిఖీలు చేపట్టారు. అయితే దొడ్డబల్లాపూర్‌లోని శ్రీఘాటి సుబ్రహ్మణ్యస్వామి ఆలయాన్ని సందర్శించేందుకు సీఎం వెళుతుండగా, ఆయన కారుని ఆపి మరీ తనిఖీ చేశారు ఎలక్షన్‌ ఫ్లయిండ్‌ స్క్వాడ్‌. కర్నాటకలోని 224 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ప్రస్తుతం బీజేపీకి 119 మంది ఎమ్మెల్యేలు ఉండగా, కాంగ్రెస్‌కు 75, జేడీఎస్‌కు 29 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు.

అయితే బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీలు ఎన్నికల్లో గెలుపు కోసం హోరాహోరీగా ప్రచారం చేస్తున్నాయి. అటు జేడీఎస్‌ కూడా అంతే స్థాయిలో ప్రచారం కొనసాగిస్తోంది. దీంతో ఎన్నికల్లో ఏ పార్టీ విజయం సాధిస్తుందనేది ఉత్కంఠ రేపుతోంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం