కర్నాటక అసెంబ్లీ ఎన్నికలకు ముహుర్తం సమీపించింది. రేపు ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరగనుంది. కర్నాటక అసెంబ్లీలోని 224 స్థానాలకు ఒకే విడతలో పోలింగ్ నిర్వహిస్తున్నారు. బరిలో 16 పార్టీలు ఉన్నా ప్రధాన పోటీ మాత్రం బీజేపీ, కాంగ్రెస్, జేడీఎస్ మధ్యే నెలకొంది. మొత్తం 2,615 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఈసారి పోటీ చేస్తున్న వారిలో మహిళల సంఖ్య చాలా తక్కువుంది. మొత్తం 224 స్థానాల్లో బీజేపీ పోటీ చేస్తోంది. కాంగ్రెస్ పార్టీ 223 స్థానాల్లో అభ్యర్థులను నిలిపింది. ఒక స్థానంలో సర్వోదయ పార్టీ అభ్యర్థికి కాంగ్రెస్ మద్దతు ప్రకటించింది. కర్నాటక వ్యాప్తంగా 58,545 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేశారు.
గడిచిన 38 ఏళ్లుగా కర్నాటకలో అధికారంలో ఉన్న ఏ పార్టీ కూడా తిరిగి అధికారంలోకి రాలేదు. ఈసారి ఆ ట్రెండ్‌ను మార్చేందుకు బీజేపీ ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగా ప్రధాని మోదీ కర్నాటక ఓటర్లకు బహిరంగ లేఖ రాశారు. ఈసారి బీజేపీకి అధికారాన్ని ఇవ్వాలని ఆ లేఖలో కర్నాటక ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. పెట్టుబడులు, పరిశ్రమలు, ఇన్నోవేషన్‌లో కర్నాటకను అగ్రస్థానంలో నిలపాలన్నది తమ ఆకాంక్ష అని కన్నడ ఓటర్లకు ప్రధాని తెలిపారు. విద్యా, ఉద్యోగాలు, ఔత్సాహిక పారిశ్రామిక రంగంలోనూ నెంబర్ వన్ స్థానంలో కర్నాటకను నిలుపుతామని అన్నారు.
బుధవారం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 వరకు పోలింగ్ జరుగనుంది. ఇప్పటికే ఈవీఎంలను తీసుకొని పోలింగ్ కేంద్రాలకు బయలుదేరారు ఎన్నికల సిబ్బంది. మొత్తం 224 స్థానాలకు ఒకే విడతలో ఎన్నికలు జరుగనున్నాయి. బరిలో మొత్తం 2,615 మంది అభ్యర్థులు ఉన్నారు. ఇక పోటీ చేస్తున్న వారిలో మహిళలు కేవలం 184 మంది మాత్రమే ఉన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో అధికారంలో ఉన్న బీజేపీ మొత్తం 224 స్థానాల్లో పోటీ చేస్తుండగా.. కాంగ్రెస్ పార్టీ 223 స్థానాల్లో అభ్యర్థులను నిలిపింది. ఇక జేడీఎస్ 209 స్థానాల్లో పోటీ చేస్తోంది. 209 స్థానాల్లో ఆప్, 133 స్థానాల్లో బీఎస్పీ పోటీ చేస్తున్నాయి. అయినప్పటికీ.. కాంగ్రెస్, బీజేపీ, జేడీఎస్ మధ్యే ప్రధాన పోటీ ఉండనుంది.
ఇక ఎన్నికల బరిలో 918 మంది ఇండిపెండెంట్లు నిలిచారు. కర్నాటక అసెంబ్లీ బరిలో తొలిసారి ట్రాన్స్‌జెండర్ పోటీ చేస్తున్నారు. దేశ్ ప్రేమ పార్టీ తరపున కాంప్లి నుంచి పోటీ చేస్తున్నారు రామక్క. కర్నాటకలో మొత్తం ఓటర్లు 5,31,33,054 ఉన్నారు. వీరిలో తొలిసారి ఓటు వేస్తున్న వారు 11,71,558. కర్నాటక వ్యాప్తంగా 58,545 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేశారు అధికారులు. ఇక బందోబస్తు విధుల్లో ఏపీ నుంచి 1,000 మంది పోలీసులు, 1,000 మంది హోం గార్డులు పాల్గొంటున్నారు. తెలంగాణ నుంచి 516 మంది పోలీసులు, 684 మంది హోంగార్డులు పాల్గొంటున్నారు. ఈ నెల 13న ఓట్ల లెక్కింపు ఉంటుంది.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..