Dilapidated House: ఆ ఇంటి తలుపు వద్ద మనిషి పుర్రె.. అనుమానంతో తలుపు తెరిచి చూడగా ఒక్కసారిగా షాక్‌!

ఓ కుటుంబానికి ఐదురురు గత ఐదేళ్లుగా బయటి ప్రపంచానికి కనబడలేదు. తాజా నగర శావారులోని వారి ఇంటి తలుపు వద్ద ఓ మనిషి పుర్రె ఉంటడం గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు వచ్చి చూడగా ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఐదు అస్థిపంజరాలు కనిపించాయి. వివరాల్లోకెళ్తే.. కర్ణాటకలోని చిత్రదుర్గ జిల్లా చల్లకెరె గేట్ సమీపంలోని జైలు రోడ్డులోని శిథిలావస్థలో ఉన్న ఓ ఇంట్లో ఐదు అస్థిపంజరాలు లభ్యమయ్యాయి...

Dilapidated House: ఆ ఇంటి తలుపు వద్ద మనిషి పుర్రె.. అనుమానంతో తలుపు తెరిచి చూడగా ఒక్కసారిగా షాక్‌!
Dilapidated House

Updated on: Dec 31, 2023 | 1:39 PM

చిత్రదుర్గ, డిసెంబర్ 29: ఓ కుటుంబానికి ఐదురురు గత ఐదేళ్లుగా బయటి ప్రపంచానికి కనబడలేదు. తాజా నగర శావారులోని వారి ఇంటి తలుపు వద్ద ఓ మనిషి పుర్రె ఉంటడం గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు వచ్చి చూడగా ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఐదు అస్థిపంజరాలు కనిపించాయి. వివరాల్లోకెళ్తే.. కర్ణాటకలోని చిత్రదుర్గ జిల్లా చల్లకెరె గేట్ సమీపంలోని జైలు రోడ్డులోని శిథిలావస్థలో ఉన్న ఓ ఇంట్లో ఐదు అస్థిపంజరాలు లభ్యమయ్యాయి. ఈ విషయమై పవన్ కుమార్ అనే వ్యక్తి చిత్రదుర్గ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ ఇంట్లో పవన్‌కుమార్‌ బంధువు జగన్నాథ్‌రెడ్డి, అతని కుటుంబం నివాసం ఉండేవారు. జగన్నాథరెడ్డి, భార్య ప్రేమక్క, కుమార్తె త్రివేణి, కుమారుడు కృష్ణారెడ్డి, నరేంద్రరెడ్డిలు నివాసముంటున్నారు. స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు శిథిలావస్థలో ఉన్న ఇంటిని పరిశీలించగా ఈ అస్థిపంజరాలు బయటపడ్డాయి. డిప్యూటీ ఎస్పీ పి అనిల్ కుమార్ ఘటనా స్థలాన్ని సందర్శించి పరిశీలించారు. మృతులు ఆత్మహత్య చేసుకున్నారా? లేదా హత్య చేశారా? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. మృతుల వివరాలను గుర్తించేందుకు అస్థిపంజరాలను ఎఫ్‌ఎస్‌ఎల్‌ పరీక్షకు పంపించారు.

ఆ అస్తిపంజరాలు వారివేనా..?

జగన్నాథరెడ్డి బంధువు పవన్ కుమార్ మాట్లాడుతూ.. జగన్నాథరెడ్డి (80) రిటైర్డ్ ఇంజనీర్. జగన్నాథరెడ్డి కుటుంబం గత కొన్నేళ్లుగా నాతో టచ్‌లో లేడు. వాళ్లు మా ఇంటికి రాలేదు. మేము వాళ్ల ఇంటికి వెళ్లలేదు. అసలు 2019 నుంచి జగన్నాథ్ రెడ్డి, అతని కుటుంబం కనిపించడం లేదు. జగన్నాథరెడ్డి ఇంట్లో దొరికిన అస్థిపంజరం ఆయనదే కావచ్చు. అతను 5 సంవత్సరాల క్రితం ఇంట్లో చనిపోయి ఉంటాడు అని తెలిపాడు. ఈ క్రమంలో బుధవారం (డిసెంబర్ 27) దొంగలు శిధిలావస్థలో ఉన్న వారి ఇంటి తలుపులు పగులగొట్టి వెళ్లిపోయారు. గురువారం (డిసెంబర్ 28) సాయంత్రం ఇంట్లోకి కుక్కలు ప్రవేశి, పుర్రెలను తీసుకొచ్చి తలుపు దగ్గర పడేసి వెళ్లాయి. తలుపు వద్ద పుర్రెను చూసి, పోలీసులకు సమాచారం అందించినట్లు స్థానికుడైన దేవరాజ్ తెలిపాడు. దాదాపు ఐదేళ్లుగా ఈ ఇంట్లో ఎవరినీ చూడలేదని ఐదేళ్ల క్రితం కూరగాయలు, పాలు అమ్మే కృష్ణారెడ్డి (బాబురెడ్డి) అనే వ్యక్తి తెలిపాడు. వారి ఇంటి ముందు రోడ్డు, డ్రెయిన్ నిర్మాణ పనులు జరుగుతున్నా ఇంట్లో ఎవరూ కనిపించలేదని తెలిపాడు.

ఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు ఒక గదిలో నాలుగు అస్థిపంజరాలు (మంచాలపై రెండు, నేలపై రెండు), మరో గదిలో మరో అస్థిపంజరం ఉండటం గమనించారు. జగన్నాథ్ రెడ్డి ఇంట్లో 2019 క్యాలెండర్ ఉన్నట్లు గుర్తించారు. ఐదుగురు కరోనా కారణంగా ఐదేళ్ల క్రితం మరణించి ఉంటారని అనుమానిస్తున్నారు. ఫోరెన్సిక్ సైన్స్ లేబొరేటరీ (ఎఫ్‌ఎస్‌ఎల్) బృందం, సీన్ ఆఫ్ క్రైమ్ ఆఫీసర్స్ (ఎస్‌ఓసిఓలు) సాక్ష్యాలను సేకరించడానికి పోలీసులు పిలిపించారు. ఈ క్రమంలో ఇంటి చుట్టూ భద్రతను కట్టుదిట్టం చేశారు. అయితే ఫోరెన్సిక్ నివేదికల అనంతరం మృతుల వివరాలు వెల్లడి కానున్నాయి. కేసుకు సంబంధించి తదుపరి విచారణ జరుగుతోంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.