AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

భార్యకు ప్రియుడితో పెళ్లి చేసిన భర్త.. అది కూడా 15 ఏళ్ల తర్వాత.. అసలు విషయం తెలిస్తే..

పెళ్లైన 15 ఏళ్ల తర్వాత తన భార్యకు మరొకరితో ఉన్న వివాహేతర సంబంధం గురించి తెలుసుకున్న ఓ భర్త.. ఆమెకు తన ప్రియుడితో వివాహం జరిపించడం ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఆశ్చర్యకరమైన సంఘటన ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రంలోని దేహత్ జిల్లా రసూలాబాద్‌లో వెలుగు చూసింది. భార్య ఇష్టం పట్ల ఆ భర్త వ్యవహరించిన తీరును పలువురు ప్రశంసిస్తున్నా.. మరో కొందరు తప్పుపడుతున్నారు.

భార్యకు ప్రియుడితో పెళ్లి చేసిన భర్త.. అది కూడా 15 ఏళ్ల తర్వాత.. అసలు విషయం తెలిస్తే..
Kanpur
Anand T
|

Updated on: Jun 26, 2025 | 6:03 PM

Share

కట్టుకున్న భార్య మరోవ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుందని తెలిస్తే ఆలోచించకుండా దారుణాలకు ఒడిగడుతున్న ఈ రోజుల్లో..ఓ వ్యక్తి మాత్రం తన భార్య వివాహేతర సంబంధం గురించి తెలుసుకొని వినూత్న నిర్ణయం తీసుకున్నాడు. పెళ్లై 15 ఏళ్ల తర్వాత తన భార్యకు ఆమె, ప్రియుడితో వివాహం జరిపించాడు. వివరాల్లోకి వెళితే, దేహత్ జిల్లా రసూలాబాద్‌కు చెందిన యోగేష్ తివారీ (40) అనే వ్యక్తికి ఔరంగాపూర్‌కు చెందిన సోని అనే మహిళతో 2010లో వివాహం జరిగింది. తర్వాత వీరు ఒక మడ బిడ్డకు జన్మనిచ్చారు. ఇప్పుడు ఆ పిల్లాడి వయస్సు12 ఏళ్ల. అయితే కొడుకు పుట్టిన కొన్నేళ్ల తర్వాత సోని కన్నౌజ్‌కు చెందిన వికాస్ ద్వివేది అనే వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకున్నట్టు తెలుస్తోంది. ఈ విషయంపై కాస్త భర్తకు తెలియడంతో ఇద్దరి మధ్య గొడవలు కూడా జరిగాయి.

అయితే, ఈ మధ్య కాలంలో తన పుట్టింటికి వెళ్లిన సోని సోమవారం తిరిగి అత్తింటికి వచ్చింది. సరిగ్గా అదే రోజు ఆమె ప్రియుడు వికాస్ కూడా వాళ్ల గ్రామానికి వచ్చాడు. దాన్ని గమనించిన సోని భర్త వెంటనే పోలీసులకు ఫోన్‌ చేసి విషం చెప్పాడు. దీంతో ఈ విషయం తెలుసుకున్న వికాస్ ఆ గ్రామం నుంచి పారిపోయాడు. ఇక ఇంటికి వెళ్లిన యోగేష్ వివాహేతర సంబంధంపై భార్యను మరోసారి నిలదీశాడు. ఆమె ఇష్టాన్ని తెలసుకొని.. వికాస్‌ను తిరిగి రమ్మని చెప్పాడు. తర్వాత విషయాన్ని గ్రామ పెద్దల దృష్టికి తీసుకెళ్లి.. అందరి సమక్షంలో పంచాయితీ జరిపారు. ఈ పంచాయితిలో సోని తన ప్రియుడితో వివాహానికి లిఖితపూర్వంగా అంగీకరించి.. తన భర్తతో ఉన్న వివాహ బందానికి గుడ్‌బై చెప్పింది.

దీంతో, గ్రామపెద్దలు, పోలీసుల సమక్షంలో భర్త యోగేష్ దగ్గరుండి ఓ ఆలయంలో సోని, వికాస్‌లకు పెళ్లి చేశాడు. అయితే తమ వివాహ బంధానికి గుర్తుగా ఉన్న తన 12 ఏళ్ల కుమారుడిని కూడా యోగేష్ తన తల్లితో పాటు పంపించాడు. అయితే భార్య ఇష్టాన్ని గౌరవించి యోగేష్ తీసుకున్న ఈ నిర్ణయాన్ని కొందరు అంగీకరిస్తున్నా.. మరికొందరు మాత్రం తిరస్కరిస్తున్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..