కంగనా రనౌత్ వివాదంతో శివసేనకు ‘శివ, శివా’ !

ముంబైలో కంగనా రనౌత్ ఇల్లు, ఆఫీసు కూల్చివేత వ్యవహారం ఎటు చెడీ సీఎం ఉధ్ధావ్ థాక్రే నేతృత్వంలోని శివసేన ప్రతిష్టను మసక బరిచేలా తయారైంది. కంగనా ఆఫీసు కూల్చివేత ఆమెకు అనవసరమైన పబ్లిసిటీ ని తెఛ్చి...

కంగనా రనౌత్  వివాదంతో శివసేనకు శివ, శివా !

Edited By:

Updated on: Sep 09, 2020 | 6:08 PM

ముంబైలో కంగనా రనౌత్ ఇల్లు, ఆఫీసు కూల్చివేత వ్యవహారం ఎటు చెడీ సీఎం ఉధ్ధావ్ థాక్రే నేతృత్వంలోని శివసేన ప్రతిష్టను మసక బరిచేలా తయారైంది. కంగనా ఆఫీసు కూల్చివేత ఆమెకు అనవసరమైన పబ్లిసిటీ ని తెఛ్చి పెట్టిందని ఎన్సీపీ సీనియర్ నేత శరద్ పవార్ వ్యాఖ్యానించారు. సేన ఆధ్వర్యంలోని ముంబై మున్సిపల్ కార్పొరేషన్ చర్యను తాను అంగీకరించబోనని ఆయన చెప్పారు. మీడియా ఈ మొత్తం వ్యవహారాన్ని పెద్దది చేసి చూపిందన్నారు. అసలు ఇలాంటి విషయాలను మనం పట్టించుకోరాదని, ఈ టైమింగ్ అన్నది ఏ మాత్రం సహేతుకం కాదని శరద్ పవార్ అభిప్రాయపడ్డారు. నిబంధనల ప్రకారం  కార్పొరేషన్ అధికారులు వ్యవహరించినప్పటికీ, ఈ కాంట్రవర్సీల కాలంలో ఇలాంటివి ప్రజల్లో తప్పుడు సంకేతాలకు వెళ్తాయని ఆయన పేర్కొన్నారు.

ముంబైలో అక్రమ నిర్మాణాలు కొత్త కాదని, ప్రస్తుత ‘సీజన్’ లో ఈ చర్య ఎన్నో ప్రశ్నలను లేవనెత్తుతుందని ఆయన చెప్పారు. మొత్తానికి ఈ పెద్దాయన పరిస్థితిని చల్లబరిచేందుకు ఉధ్ధవ్ థాక్రేని కలిసి..కూల్ కూల్ గా ఉందామని ,ఆలా ఉంటేనే మీ సేన, మా ఎన్సీపీ, కాంగ్రెస్ కూటమి కూడా ‘చల్లగా’ ఉంటుందని చెప్పినట్టు టాక్ !