తమిళనాడుకు చెందిన నీట్ విద్యార్థిని జ్యోతి దుర్గ ఆత్మహత్యపై ప్రముఖ సినీ నటుడు, ఎంఎన్ఎం పార్టీ అధినేత కమలహాసన్ తీవ్రంగా స్పందించారు. జ్యోతి ఆత్మహత్యకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. విద్యార్థుల భవిష్యత్తుని ప్రశ్నార్థకంగా మార్చే పరీక్షా విధానాల్లో మార్పు తీసుకురావాలన్న కమల్.. యువత ఆత్మహత్యలకు పాల్పడకుండా ఉండడానికి కావలసిన మనో ధైర్యాన్ని అందించడానికి అందరూ ముందుకు రావాలని విన్నవించారు. కాగా, నీట్ పరీక్షలో విఫలమవుతాననే భయంతో జ్యోతి దుర్గ ఆత్మహత్యకు పాల్పడింది. ‘నేను అలసిపోయా..అయామ్ సారీ’ అంటూ తల్లిదండ్రులను ఉద్దేశించి చివరిసారిగా ఓ లేఖ రాసి ప్రాణాలొదిలింది. తనలో పేరుకుపోయిన అలజడిని వివరిస్తూ ఓ వీడియో కూడా రూపొందించిన అనంతరం ఆమె తన గదిలో ఉరిపోసుకుని శుక్రవారం రాత్రి ఆత్మహత్యకు పాల్పడింది. బాధితురాలు తన కుటుంబంతో కలసి మదురైలో నివసించేది. ఆమె తండ్రి కేంద్ర సాయుధ బలగాల్లో విధులు నిర్వహిస్తున్నారు.
மாணவி ஜோதிஸ்ரீ துர்காவின் மரணமே #NEET தேர்வின் இறுதி மரணமாக இருக்க நாம் செய்யப் போவது என்ன?
மத்திய மாநில அரசுகள் மாற்று வழியினைச் சிந்தித்துத் துரிதமாக செயல்படுத்திட வேண்டும்.
நம் பிள்ளைகளுக்கு நம்பிக்கையையும், மன வலிமையையும் தர வேண்டியது நம் கடமை.
செய்வோம் அதை!
— Kamal Haasan (@ikamalhaasan) September 12, 2020