AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సుశాంత్ కేసు, ముంబై, గోవాలలో ఎన్ సీ బీ దాడులు, బాలీవుడ్ సెలబ్రిటీలపై కన్ను

సుశాంత్ కేసుకు సంబంధించి నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారులు శనివారం ముంబై, గోవాలలో డ్రగ్ సెంటర్లపై దాడులు నిర్వహించారు. అనుజ్ కేశ్వానీ అనే డ్రగ్ పెడ్లర్ ఇఛ్చిన సమాచారం ఆధారంగా వారు ఆకస్మిక దాడులు..

సుశాంత్ కేసు, ముంబై, గోవాలలో ఎన్ సీ బీ దాడులు, బాలీవుడ్ సెలబ్రిటీలపై కన్ను
Umakanth Rao
| Edited By: |

Updated on: Sep 12, 2020 | 3:06 PM

Share

సుశాంత్ కేసుకు సంబంధించి నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారులు శనివారం ముంబై, గోవాలలో డ్రగ్ సెంటర్లపై దాడులు నిర్వహించారు. అనుజ్ కేశ్వానీ అనే డ్రగ్ పెడ్లర్ ఇఛ్చిన సమాచారం ఆధారంగా వారు ఆకస్మిక దాడులు చేశారు. కేశ్వానీని ఈ సంస్థ ఇటీవల అరెస్టు చేసింది. తన అజమాయిషీ కింద ఇతగాడు పని చేసేవాడని, బాలీవుడ్ సెలబ్రిటీలతో బాటు ఇతరులకు కూడా డ్రగ్స్ సప్లయ్ చేసేవారమని కైజాన్ ఇబ్రహీం అనే ‘బడా’ ‘డ్రగ్గిస్ట్’ తెలిపాడు. రియా చక్రవర్తి సోదరుడు షోవిక్ తో కైజాన్ రెగ్యులర్ గా ‘టచ్ ‘ లో ఉండేవాడట.. అటు-సుశాంత్, రియా ఇద్దరూ లోగడ రహస్యంగా మార్జువానా ను ఓ ఏజన్సీకి కొరియర్ ద్వారా పంపేవారని తెలిసింది. తనకు డ్రగ్స్ ముఠాలతో లింక్ లేదని రియా చెబుతున్నప్పటికీ.. జరుగుతున్న దర్యాప్తు అందుకు పూర్తి విరుద్ధంగా ఉంది.