శివుడికి నైవేద్యంగా చిలకడ దుంపను ఎందుకు సమర్పిస్తారో తెలుసా?

Samatha

11 February 2026

మహా శివరాత్రి వచ్చేస్తోంది. ఫిబ్రవరి 15 మహా శివరాత్రి పండుగను హిందువులందరూ చాలా ఘనంగా జరుపుకుంటారు.

మహా శివరాత్రి

ఇక 12 శివరాత్రులలో  మహా శివరాత్రికి చాలా ప్రాముఖ్యత ఉంటుంది. ఈ రోజు శివుడికి పూజ చేయడం వలన అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి అంటారు.

శివ రాత్రి ప్రత్యేకత

మహా శివరాత్రి అంటే అందరికీ ముందుగా గుర్తు వచ్చేది జాగరణ,  ఈ రోజున జాగరణ ఉంటూ ఉపవాస దీక్ష చేస్తుంటారు.

జాగరణ, ఉపవాసం

అంతే కాకుండా పరమశివుడుకి చిలకడదుంప, శనగలు, మోదుగుపూలు, మొక్క జొన్న వంటివి కొన్ని ప్రత్యేక నైవేద్యాలను సమర్పిస్తుంటారు.

ప్రతేక నైవేద్యాలు

అయితే మీరు ఎప్పుడైనా గమనించారా? చాలా వరకు శివ రాత్రి సమయంలో మాత్రమే చిలకడ దుంపను నైవేద్యంగా పెడతారు. మరి దీనికి గల కారణం ఏంటో చూద్దాం.

చిలకడ దుంప

శివుడికి అత్యంత ప్రీతికరమైన , సాత్విక ఆహారంలో చిలకడ దుంప ముఖ్యమైనది. అందుకే శివ రాత్రి సమయంలో దీనిని నైవేద్యంగా సమర్పి్స్తారు.

ప్రీతికరమైన నైవేద్యం

అంతే కాకుండా, ఉపవాసం ఉన్నవారు కూడా దీనినే తింటారు. దీని ముఖ్య కారణం ఇందులో పోషకాలు పుష్కలంగా ఉంటాయి.చిలకడ దుంపలో విటమిన్స్, ఫైబర్ ఎక్కువగా ఉండటం వలన ఇవి కడుపు ఆరోగ్యానికి చాలా మంచిది.

ఆరోగ్య ప్రయోజనాలు

ఉపవాసం సమయంలో దీనిని తినడం వలన ఇది ఉపవాసం, జాగారం చేసే భక్తులు అలిసి పోకుండా ఉండటమే కాకుండా శరీరానికి తక్షణ శక్తి లభిస్తుందంట.

తక్షణ శక్తి