
ఉత్తర్ ప్రదేశ్ లోని కాన్పూర్ సమీపంలో కాళింది ఎక్స్‌ప్రెస్ ప్రమాదం విషయంలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ట్రైన్ బోల్తా కొట్టించేందుకు పన్నిన కుట్ర కేసులో అతి పెద్ద విషయం బట్టబయలు అయింది. ఈ కేసును దర్యాప్తు చేస్తున్న యూపీ ఏటీఎస్, ఐబీ, ఎన్ఐఏ బృందాలు ఈ ఘటనను కరుడుగట్టిన ఉగ్రవాద సంస్థ ఐఎస్ఐఎస్ చేసి ఉంటుందని అనుమానిస్తున్నారు. ఘటనా స్థలం నుండి లభించిన అధరాలు, సాక్ష్యాలను పరిగణలోకి తీసుకుని ఈ సంఘటనకు ISIS కి చెందిన ఖొరాసన్ మాడ్యూల్ పాల్పడినట్లు అనుమానిస్తున్నారు. ప్రస్తుతం ఈ కేసులో అరెస్టయిన నిందితులిద్దరినీ ఈ బృందాలు నిరంతరం విచారిస్తున్నాయి. అయితే ఇప్పటి వరకు ఈ నిందితుల గురించి ఏ విషయాలను వెల్లడించలేదు.
ఖొరాసన్ మాడ్యూల్ పనితీరు కూడా ఈ ఘటనకు ప్రధాన కారణమని చెబుతున్నారు. ఈ విషయం ప్రాథమిక విచారణలో తేలిందని కేసు దర్యాప్తు చేస్తున్న అధికారులు తెలిపారు. ఇంకా చాలా రైల్వే ప్రమాద ఘటనకు సంబంధించిన వాస్తవాలు పరిశోధించవలసి ఉందన్నారు. అనుమానిత మాడ్యూల్ కి చెందిన ఉగ్రవాదులు ఛాందసవాదులు, తోడేలు దాడులకు పాల్పడతారని అధికారులు చెప్పారు. 2017లో మధ్యప్రదేశ్‌లో ఇలాంటి ఘటనలకు పాల్పడ్డారని గుర్తు చేశారు.
టెర్రర్ లింక్ ఇలా దొరికింది
కాళింది ఎక్స్‌ప్రెస్ ప్రమాదానికి ఉగ్రవాదానికి లింక్ ఎలా దొరికిందంటే.. ఈ మాడ్యూల్‌కు చెందిన సైఫుల్లా అనే ఉగ్రవాదిని లక్నోలో ఎన్‌కౌంటర్ చేశారు. ఆ సమయంలో సైఫుల్లా వద్ద కొన్ని వస్తువులు దొరికాయి. ఇప్పుడు కాన్పూర్‌లోని రైల్వే ట్రాక్‌పై కూడా కొన్ని అనుమానాస్పద వస్తువులు లభించాయి. అవి సైఫుల్లా వద్ద దొరికిన వస్తువులు వంటివే. ఈ కేసు దర్యాప్తులో తేలిన ఉగ్రవాద లింక్ ఉన్నట్లు ఆధారం దొరికినట్లు అయింది. దీంతో ఈ కోణంలో ఏజెన్సీలు దర్యాప్తు పరిధిని విస్తరించాయి. అధికారిక వర్గాల చెప్పిన ప్రకారం ఈ సంఘటనను ఎవరు ప్లాన్ చేసినా ‘సెల్ఫ్ రాడికలైజ్’. ఖొరాసన్ మాడ్యూల్ లు యువకుల బ్రెయిన్ వాష్ చేసి ఇలాంటి సంఘటనలకు సిద్ధం చేస్తారు.
శిక్షణ ఇచ్చిన ఫర్హతుల్లా ఘోరీ
ఈ మాడ్యూల్ సంస్థ దేశంలోని ఇతర ప్రాంతాల నుంచి ప్రజలను ఉగ్రవాద సంస్థల్లో చేరడానికి ఆకర్షిస్తుంది. సోషల్ మీడియా ద్వారా యువకులను జిహాదీలుగా మారుస్తారు. ఈ సమయంలో వారు పూర్తిగా బ్రెయిన్ వాష్ చేయబడతారు. ఛాందసవాదులుగా మారడానికి వారి మనస్సులలో రకరకాల విష బీజాలను నింపుతారు. వీటన్నింటి తరువాత.. వారికి బాంబులు తయారు చేయడంలో, దాడులు చేయడంలో శిక్షణ ఇస్తారు. తర్వాత ఆత్మాహుతి బాంబర్లుగా కూడా మారతారు. పోలీసులకు అందిన ఇన్‌పుట్ ప్రకారం ఈ సంఘటన ప్రధాన సూత్రధారి పాకిస్తాన్‌లో ఉన్న ఐఎస్ఐఎస్ కమాండర్ ఫర్హతుల్లా ఘోరీ. ఆన్‌లైన్‌లో శిక్షణ పొందాడు. ఇటీవల అతనుభారత్‌పై ఉగ్రదాడులకు పిలుపునిస్తూ టెలిగ్రామ్‌లో వీడియోను షేర్ చేశాడు. భారతదేశంలోని రైళ్ళు బోల్తా కొట్టేలా చేయాలనీ ఆదేశాలు ఇచ్చాడు.
అదుపులో 12 మంది
కాన్పూర్ రైలు పట్టాలు తప్పడానికి సంబంధించిన కేసులో దర్యాప్తు సంస్థలు దర్యాప్తు వేగవంతం చేసింది. 219 కెమెరాల నుండి ఫుటేజీని సేకరించి 100 మందికి పైగా వ్యక్తులను ప్రశ్నించారు. 12 మందిని ప్రస్తుతం కస్టడీలో తీసుకున్నారు. విచారణ చేస్తున్నారు. కాన్పూర్ పోలీసులు సిలిండర్ సీరియల్ నంబర్‌ను ఉపయోగించి డెలివరీ చేసిన మూడు గ్యాస్ సిలిండర్ ఏజెన్సీలను కూడా ప్రశ్నించారు.
ఒక సెర్చ్ ఆపరేషన్ విభాగానికి చెందిన ఒక స్నిఫర్ డాగ్ పొదల్లో ఉన్న కొన్ని గుర్తులను గుర్తు పట్టింది. పొదల్లో దాక్కుని కుట్ర ప్రణాళిక చేయబడి ఉండవచ్చని సూచించే సాక్ష్యాలను స్నిఫర్ డాగ్ కనుగొంది.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..