Woman pilots: భారతీయ మహిళలకు అన్ని రంగాల్లోనూ ప్రాధాన్యం దక్కుతున్నది. విమానయానమూ అందుకు మినహాయింపు కాదని ప్రపంచవ్యాప్తంగా నిరూపితమైంది. ఎందుకంటే.. ఇతర దేశాలతో పోలిస్తే, మన దేశంలోనే మహిళా పైలట్లు అధికంగా ఉన్నట్లు కేంద్ర విమానయాన మంత్రిత్వ శాఖ తాజా నివేదిక స్పష్టం చేసింది. ఇంటర్నేషనల్ సొసైటీ ఆఫ్ ఉమెన్ ఎయిర్‌లైన్ పైలట్ల ప్రకారం, ప్రపంచంలోని మొత్తం పైలట్లలో 5 శాతం మంది మహిళలు ఉండగా, భారతదేశంలో మహిళా పైలట్ల సంఖ్య 15 శాతం ఉందని ప్రభుత్వం గురువారం లోక్‌సభకు తెలిపింది. లోక్‌సభలో డాక్టర్ వీ సత్యవతి, చింతా అనురాధ అడిగిన ప్రశ్నకు పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా లిఖితపూర్వక సమాధానంలో ఈ సమాచారం ఇచ్చారు. దేశంలో మహిళా పైలట్ల సంఖ్యను పెంచేందుకు తీసుకున్న చర్యల వివరాలను సభ్యులు కోరగా సింధియా వివరణ ఇచ్చారు.
దేశంలో మహిళలు, పురుషులు అనే తేడా లేకుండా పైలట్ల సంఖ్యను పెంచేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాధిత్య సింధియా తెలిపారు. పైలట్ల సంఖ్యను పెంచడానికి, ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా మొదటి దశలో ఐదు విమానాశ్రయాలలో తొమ్మిది కొత్త ప్లయింగ్ ట్రైనింగ్ ఆర్గనైజేషన్ స్లాట్‌లకు అవార్డు లేఖలను జారీ చేసింది. ఈ విమానాశ్రయాలు మొదటి దశలో బెలగావి, జల్గావ్, కలబురగి, ఖజురహో, లిలాబరి అనే ఐదు విమానాశ్రయాలలో తొమ్మిది కొత్త ఫ్లయింగ్ ట్రైనింగ్ ఆర్గనైజేషన్ (FTOలు) కోసం ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా అవార్డు లెటర్‌లను జారీ చేసింది. ఈ ఐదు విమానాశ్రయాల్లో భావ్‌నగర్, హుబ్లీ, కౌపా, కిషన్‌గఢ్ మరియు సేలంలలో రెండో దశలో మరో ఆరు FTO స్లాట్‌లను చేర్చినట్లు కేంద్ర మంత్రి సింధియా తెలిపారు. ఈ చర్యల వల్ల విమాన శిక్షణా సంస్థలలో ఫ్లైయింగ్ గంటలు మరియు సంవత్సరానికి జారీ చేయబడిన కమర్షియల్ పైలట్ లైసెన్స్‌ల సంఖ్య పెరిగే అవకాశం ఉందని పౌర విమానయాన మంత్రి తెలిపారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి